లాన్స్ నాయక్ హనుమంతప్ప: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
+సియాచెన్ హిమానీనదం లింకు
పంక్తి 13:
భారత్-పాక్ సరిహద్దులోని సియాచిన్‌లో మంచు చరియలు విరిగిపడి అందులో చిక్కుకు పోయిన పది మంది సైనికుల్లో హనుమంతప్ప ఒకడు. ఆరు రోజుల పాటు గడ్డకట్టిన మంచులో కూరుకుపోయి బతికి బయటపడ్డాడు. ఊహకు కూడా అందని ఇది నిజంగా సాధ్యమైంది. సియాచిన్ ప్రమాదంలో గల్లంతైన పది మంది సైనికులు చనిపోయినట్టేనని ఆర్మీ అధికారులు ప్రకటించారు. మంచులో చిక్కుకుపోయిన జవాన్ల కోసం చేపట్టిన గాలింపు చర్యల్లో హనుమంతప్ప నాయక్‌ కొన ఊపిరితో భద్రత బలగాలకు [[ఫిబ్రవరి 8]] [[2016]] న కనిపించాడు. అతనిని వెంటనే రక్షించి భద్రత బలగాలు సైనిక ఆస్పత్రిలో చేర్పించాయి. ఐసీయూలో చికిత్సనందించిన హనుమంతప్ప అప్పటికి కోమాలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతను 35 అడుగుల లోతులో -45° గడ్డకట్టే మంచులో ఆరు రోజులపాటు ఉన్నాడు. 19,600 అడుగుల ఎత్తులో ఉన్న వారిపై మంచు చరియలు విరిగి పడి 6 రోజుల పాటు అందులోని కూరుకుపోయారు.<ref>https://twitter.com/ibnlive/status/697426320637054978</ref><ref>http://timesofindia.indiatimes.com/india/How-Lance-Naik-Hanumanthappa-Koppad-defied-certain-death-at-Siachen/articleshow/50925655.cms</ref><ref>http://indianexpress.com/article/india/india-news-india/siachen-avalanche-survivor-lance-naik-hanamanthappa-critical/</ref> అతనికి సంబంధించిన ఏ అంగమూ పనిచేయడం లేదని వైద్యులు తెలిపారు. నిమోనియా కారణంగా రెండు ఊపిరితిత్తులూ దెబ్బతిన్నాయని తెలిపారు. మెదడుకు ఆక్సిజన్ అందడం లేదన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు వెల్లడించారు.<ref>http://www.thehindu.com/news/national/soldier-rescued-from-siachen-glacier-admitted-to-delhi-hospital/article8212271.ece</ref><ref>http://zeenews.india.com/news/india/siachen-miracle-yoga-and-a-lucky-air-pocket-saved-lance-naik-hanumanthappa_1854187.html</ref> కానీ చికిత్స పొందుతున్న అతను తరువాత మరణించాడు
==యోగా ట్రైనర్ కావడం వల్లే==
సియాచిన్‌లో[[సియాచెన్ హిమానీనదం|సియాచెన్]]‌లో మంచులో చిక్కుకుపోయి ఆరు రోజుల తర్వాత బతికి బయటపడిన హనుమంతప్ప యోగా ట్రైనర్ అని సైన్యం తెలిపింది. హనుమంతప్ప సైనికులకు యోగా శిక్షణ ఇచ్చేవాడు. ప్రతికూల పరిస్థితుల్లో శ్వాస నియంత్రణ చేసే విద్య తెలిసినందువల్లే 122 గంటలపాటు ఆయన తన ప్రాణాన్ని నిలుపుకోగలిగాడు. మైనస్ 55 డిగ్రీల సెల్సియస్‌లో ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్న హనుమంతప్ప యోగాలో అనులోమ్ విలోమ్ ప్రక్రియ తెలిసినవాడు. తద్వారా తక్కువ ఆక్సిజన్ ఉన్నా ప్రాణం నిలుపుకోగలిగే అవకాశం ఉంటుంది.<ref>[http://www.andhrajyothy.com/Artical?SID=205510 హనుమంతప్ప యోగా ట్రైనర్ కావడం వల్లే మంచులో 122 గంటలు ప్రాణం నిలుపుకున్నాడు 10-02-2016]</ref>
 
==కెరీర్==