రక్తపోటు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రక్తపు పోటు''' (blood pressure) అనేది రోగం కాదు, రోగ లక్షణం కాదు. ఒక వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని సంక్షిప్తంగా వర్ణించటానికి వైద్యులు నాలుగు కీలకమైన చిహ్నాలని (vital signs) వాడతారు. అవి శరీరపు ఉష్ణోగ్రత (body temperature), నాడి లేదా హృదయ స్పందన జోరు (pulse or heart rate), ఊపిరి జోరు (respiration rate), రక్తపు పోటు (blood pressure). ఈ నాలుగూ లేక పోతే ఆ వ్యక్తి మరణించినట్లే! కనుక ఈ నాలుగు కీలక చిహ్నాలూ అవధిని మించి పెరిగినా, తరిగినా మంచిది కాదు. రక్తపు పోటు అవధిని మించి పెరిగితే దానిని 'మితిమీరిన రక్తపు పోటు'(high blood pressure or hypertension) అంటారు. ఇలా రక్తపు పోటు మితి మీరితే అది రోగ లక్షణం.
 
==రక్తపు పోటు లక్షణాలు==
 
రక్తపు పోటు ఎక్కువగా ఉన్న వారికి బయటకి ఏమీ లక్షణాలు కనబడవు. చాప కింద నీరులా ఇది శరీరానికి కొంత హాని చేసిన తరువాత మరో సందర్భంలో ఎప్పుడో జరిగిన హాని ప్రస్పుటమవుతుంది. ఇలా ముదిరిన తరువాత మందులు వాడినా జరిగిపోయిన హానిని తిరగబెట్టలేము. అందుకని తరచు రక్తపు పోటు ఎంత ఉందో, అవకాశం దొరికినప్పుడల్లా - కొలుచుకుని చూసుకుంటూ ఉండాలి. ఈ రోజుల్లో వైద్యుణ్ణి చూడ్డానికి ఏ పని మీద వెళ్ళినా రివాజుగా నర్సులు రక్తపు పోటుని కొలిచి నమోదు చేస్తారు. అలా నమోదు చేసినప్పుడు రోగి ఆ కొలతలని అడిగి తెలుసుకుని గుర్తు పెట్టుకోవటం మంచిది. ఈ కొలత ఉండవలసిన దానికంటె ఎక్కువ ఉంటే ఎక్కువ రక్తపు పోటు (హిఘ్high బ్లూద్blood ప్రెర్సూరెpressure) ఉందని అంటారు. ఎక్కువ రక్తపు పోటు ఉంటే అది గుండె జబ్బుకీ, మూత్రపిండాల జబ్బుకీ దారితీసే ప్రమాదం ఉంది. దీనికి విపర్యంగా మూత్రపిండాలకి జబ్బు చేస్తే దాని మూలంగా రక్తపు పోటు పెరుగుతుంది కూడ. అందుకని రక్తపు పోటు విలువ మీద ఒక కన్నేసి ఉంచటం చాల మంచి అలవాటు, ప్రాణాన్ని రక్షించుకునే అలవాటు.
 
==రక్తపు పోటు అంటే ఏమిటి?==
Line 11 ⟶ 12:
ఇక్కడ ఉటంకించిన విషయాన్ని బట్టి రక్తపు పోటు కొలవటానికి రెండు సంఖ్యలు వాడతారని తెలుస్తోంది కదా. ఈ రెండింటిలో మొదటిది (ఎగువ ఉన్నది) సిస్టాలిక్‌ పోటు (systolic pressure), రెండవది (దిగువ ఉన్నది) డయస్టాలిక్‌ పోటు (diastolic pressure). గుండె ముకుళించుకున్నప్పుడు రక్తం ఒక్క ఉదుటున మొడుకి వస్తుంది. అప్పుడు ఈ పోటు ఎక్కవగా ఉంటుంది. అదే సిస్టాలిక్‌ పోటూ అంటే. గుండె వికసించుకున్నప్పుడు ప్రవాహం అంతిమ దశలో ఉంటుంది. అప్పుడు ఈ పోటు తక్కుచగా ఉంటుంది. అది డయాస్టాలిక్‌ పోటు. పూర్వపు రోజుల్లో ఉష్ణోగ్రతనీ, రక్తపు పోటుని రస స్తంబం (mercury column) పొడుగుని బట్టి కొలిచేవారు. ఈ రోజుల్లో పాదరస స్తంబం వాడకుండానే కొలవ గలుగుతున్నారు.
 
==రక్తపు పోటుకి కారణం ఏమిటి?కారణాలు==
 
'ఎవ్వరికైనా రక్తపు పోటు ఎందుకు పెరుగుతుంది?' అన్న ప్రశ్నకి సమాధానం చెప్పటం కష్టం. ప్రవర (family history), లింగం (gender), వయస్సు (age), జాతి (race) - అన్నీ కొద్దో గొప్పో దోహదం చేస్తాయి. తల్లి దండ్రులకి, దగ్గర బంధువులకి ఉంటే పిల్లలకి సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. వయస్సు పెరుగుతూన్న కొద్దీ ఈ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. గణాంకాల ప్రకారం అమెరికాలో ఉండే నల్ల వారిలో ఈ పెరుగుదల ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి కారణాల వల్ల వచ్చే రక్తపు పోటు పెరుగుదలని ఇంగ్లీషులో primary hypertension అంటారు. వీటిని మనం అంతర్జనిత కారణాల వచ్చే పెరుగుదల అనవచ్చు. ఇలా కాకుండా ఏదో జబ్బు వల్ల వచ్చేది secondary hypertension లేదా తెలుగులో వ్యాధిజనిత కారణాల వచ్చే పెరుగుదల అనవచ్చు. ఇటువంటి వర్గీకరణ కంటె భౌతిక సూత్రాలని ఉపయోగించి ఏయే సందర్భాలు రక్తపు పోటు పెరుగుదలకి దోహదం చేస్తాయో చూడవచ్చు.
 
* పంపు జోరు (rate of pumping). గుండె ఎక్కువ జోరుగా కొట్టుకుంటే రక్తపు పోటు ఎక్కువ అవుతుంది.
* ప్రవహించే రక్తం పరిమాణం (volume) పెరిగితే పోటు పెరుగుతుంది. అంటే శరీరంలో ఎక్కువ రక్తం ఉంటే పోటు కూడ ఎక్కువగానే ఉంటుంది. మనం ఎక్కువ ఉప్పు తింటే అది రక్తపు పరిమాణాన్ని పెంచుతుంది. ఇది అందరిలోనూ ఒకేలా ఉండదు.
* ప్రవాహానికి నిరోధం (resistance) ఉంటే పోటు పెరుగుతుంది. గొట్టం చిన్నదయినా నిరోధం పెరుగుతుంది లేదా గొట్టంలో ఏదైనా అడ్డు పడ్డా నిరోధం పెరుగుతుంది. అందుకనే రక్తనాళపు గోడలలో కొలెస్టరాల్‌ పేరుకుంటే పోటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని మందులు రక్తనాళాలని కుచించుకునేలా చేస్తాయి (vasoconstrictors), కొన్ని పెద్దవయేలా చేస్తాయి (vasodilators). ఈ మందుల ప్రభావం వల్ల రక్తపు పోటు పెరగటం , తరగటం జరగవచ్చు.
"https://te.wikipedia.org/wiki/రక్తపోటు" నుండి వెలికితీశారు