688
edits
చి ({{Orphan}}) |
Shankar1242 (చర్చ | రచనలు) ట్యాగు: 2017 source edit |
||
{{Orphan}}
ఇది హిందువులకు సంబంధించిన ఒక ఉపాసనా మార్గము.దహరమనిన అల్పము అని అర్ధము. సూక్ష్మము గా జేసినందువలన అల్పముకానీ దేశ లేదా ప్రదేశవ్యాప్తిచే అల్పమని కాదు.అది ఈ ఆకాశము కంటే విశాలము.ఈ ఉపాసన యందు సాధకుడు హృదయ గుహలో నుండును. దహరాకాసమునందు మనస్సును లగ్నము చేసి నేను బ్రహ్మమును అని ధ్యానింపవలెను. ఇచట ధ్యానము గాంభీరమగుచో తత్త్వప్రకాశము కలుగును. దీనివలన సంకల్ప సిద్ధికలుగును.హృదయమును కేంద్రీకరించి ధ్యానమును చేసినచో శ్రీఘ్రముగా అఖండమగు ఒకానొక తేజస్సు కనపడును. ఇక్కడ హృదయమనగా హృదయాకాశమనియే అర్ధము. ఉపాసన సిద్ధించినచో విశ్వవ్యాప్తి అగు జ్ఞానముతో పరిచయము కలుగును.
ఆకాశమునకు ఎల్లలు లేవు. ధ్యానము గంభీరమగు కొలదిని దీని నైజము మనకు ఉపలబ్ధమగును. ధ్యానము నిర్రుఢమైనపుడు హృదయ గుహనుండి సహస్రారమునకు పోవు నాడీ రూపమగు ఒకానొక దారి కనపడును. సాధకుడీదారిని పయనించినచో తేజమగు ఒకానొక సత్తను అధిగమించవచ్చును. ఈమార్గము అతి సూక్ష్మము. ఇది మనోబుద్ధులకు అందదు.దహరాకాశమున ధ్యానమునకు ఫలముగా సాధకుడు అధ్యాత్మానుభవ సంపన్నుడగును. మరియు అతని అలౌకిక జ్ఞానము సత్యాద్భాసితమును సతతము ప్రకాశ శీలమగును. కర్మ కించిత్ కూడా అంటదు. సాధారణ జ్ఞానము దీనిని ఎరుగజాలదు.ఇది దివ్యము.దీని వలన అహంకారమునకు నాశనము కలుగును.
|
edits