టైటానిక్ నౌక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
టైటానిక్ నౌక '''వైట్ స్టార్ లైన్''' అనే సంస్థ కోసం [[ఐర్లాండు]] లోని బెల్‌ఫాస్ట్కు చెందిన '''హర్లాండ్ అండ్ వోల్ఫ్ ''' అనే నౌకా నిర్మాణ సంస్థ తయారు చేసిన మూడు [[ఓడ|నౌక]]ల్లో ఒకటి. వైట్ స్టార్ లైన్ ప్రధాన పోటీదారైన కునార్డ్ లైన్స్ లూసిటానియా, మౌరిటానియాకు పోటీగా తయారు చేయబడింది. టైటానిక్, దీని సోదర నౌకలైన '''ఒలంపిక్''', త్వరలో నిర్మించబడే '''బ్రిటానిక్''' నౌకలూ కలిపి [[ప్రపంచం]]లో అతి పెద్దవైన, విలాసవంతమైన నౌకలుగా పేరు తెచ్చుకోనున్నాయి.
 
టైటానిక్ నిర్మాణం [[మార్చి 31]], [[1909]]లో [[అమెరికా]]కు చెందిన జేపీ మోర్గన్, ఇంటర్నేషనల్ మర్చంటైల్ మెరైన్ కంపెనీ సమకూర్చిన నిధులతో ఆరంభమైంది. దీని ప్రధాన శరీర భాగంశరీరభాగం (hull) [[1911]], [[మే 31]]కి పూర్తయింది. ఇతర విడిభాగాల కూర్పు [[మార్చి 31]], [[1912]]కి పూర్తయింది. ఇది 882 అడుగుల 9 అంగుళాలు (269 మీటర్లు) పొడవు, 92 అడుగుల 6 అంగుళాల (28మీటర్ల28 మీటర్ల) వెడల్పు, నీటితలం నుంచి 60 అడుగులు (18 మీటర్లు) ఎత్తులోనూ ఉండేది. ప్రయాణికులు, నౌకా సిబ్బంది మొత్తం కలిపి ఇది 3547 మందిని మోయగలదు. దీని ద్వారా అప్పుడు ఉత్తరాల బట్వాడా జరుగుతుండటంతో దీనికి రాయల్ మెయిల్ స్టీమర్ అనే పేరును కూడా తగిలించారు. అప్పటి నియమాల ప్రకారం ఈ నౌకలో సరిపడా లైఫ్ బోట్లున్నా నౌకలోని ప్రయాణీకులందరికీ అవి సరిపోలేదు.
 
== విశేషాలు ==
పంక్తి 16:
 
== మొదటి ప్రయాణం ==
టైటానిక్ నౌక మొట్టమొదటి, చిట్టచివరి ప్రయాణం [[ఇంగ్లాండు]]లోని సౌథాంప్టన్ నుంచి [[న్యూయార్క్]] నగరం వరకూ సాగవలసినదిసాగవలసిఉంది. ఎడ్వర్డ్ జె స్మిత్ నావికుడిగా ఈ ప్రయాణం, [[1912]], [[ఏప్రిల్ 10]] [[బుధవారం]] ఆరంభమైంది. టైటానిక్ దాని స్థానం నుండి బయలుదేరగానే దానీ శక్తివంతమైన ప్రొపెల్లర్లు విడుదల చేసిన శక్తి వలన దాని పక్కనే లంగరు వేసి ఉన్న [[న్యూయార్క్|న్యూయార్కు]] లైనర్ కట్లు తెంచుకుని టైటానిక్‌కు సుమారు నాలుగు అడుగుల దూరం వరకూ వచ్చింది. కానీ అప్రమత్తమైన సిబ్బంది ఈ ప్రమాదం నుంచి కాపాడగలిగారు. దీని వలన నౌక [[ప్రయాణం]] ఆరంభమవడం గంట పాటు ఆలస్యమైంది. ఇంగ్లీష్ ఛానల్ను దాటిన తరువాత [[ఫ్రాన్సు]] లోని చెర్‌బోర్గు వద్ద ఆగి, మరి కొంతమంది ప్రయాణికులను ఎక్కించుకున్నదిఎక్కించుకుంది. తరువాత ఐర్లండులోని క్వీన్స్‌టౌన్ వద్ద కూడా ఆగి మొత్తం 2240 మంది ప్రయాణికులతో న్యూయార్కు వైపు [[ప్రయాణం]] మొదలు పెట్టింది.
 
== ఘోర ప్రమాదం == H&G
2012 [[ఏప్రిల్ 14]] [[ఆదివారం]] రాత్రి. చలికి దాదాపుగా గడ్డకట్టుకుపోయే ఉష్ణోగ్రత. [[సముద్రం]] నిశ్చలంగా ఉంది. [[చంద్రుడు]] కనపడడం లేదు. [[ఆకాశం]] నిర్మలంగా ఉంది. గత కొద్ది రోజులుగా మంచు కొండల గురించి వైర్ లెస్ ద్వారా సమాచారం అందుకుంటున్న నౌక కెప్టెన్ స్మిత్ నౌకను కొద్దిగా [[దక్షిణం]] వైపుకు మళ్ళించమని సిబ్బందిని ఆదేశించాడు. ఆరోజు మధ్యాహ్నం 1:45 సమయానికి ''అమెరికా'' అనే స్టీమరు టైటానిక్ నౌక వచ్చే దారిలో భారీ మంచు పర్వతాలు ఉండవచ్చునని చేసిన హెచ్చరికలు దురదృష్టవశాత్తూ నౌకను నియంత్రించే బ్రిడ్జ్ గదికి చేరలేదు. సాయంత్రం ''మెసాబా'' అనే నౌక నుంచి వచ్చిన అలాంటి హెచ్చరికలు కూడా నియంత్రణ గదికి చేరలేదు.
 
రాత్రి 11:40 సమయంలో టైటానిక్ ''న్యూఫౌండ్ లాండ్స్'' (ఉత్తర అమెరికాకు సమీపంలో ఉండే ఒక పెద్ద ద్వీపం) వద్దగల గ్రాండ్ బ్యాంక్స్ (సముద్రం లోపల ఉండే పీఠభూముల్లాంటి ప్రదేశాలు) లో ప్రయాణిస్తోంది. నౌకకు ముందుగా దాని దారిలో పయనిస్తూ సమాచారాన్ని అందిస్తూ హెచ్చరికలు చేస్తూ వెళ్ళే ''ఫ్రెడెరిక్ ఫ్లీట్'', ''రెజినాల్డ్ లీ'' టైటానిక్ కు ఎదురుగా పెద్ద మంచు పర్వతాన్ని కనుగొన్నారు. ఫ్లీట్ కుడి వైపు మంచుపర్వత ముందని చెప్తూ బ్రిడ్జి గదికి వెళ్ళే గంటను మోగించాడు. నౌకాధికారి ముర్డోక్ నౌకను ఉన్నపళంగా ఎడమ వైపుకు మళ్ళించమని ఆదేశించాడు. ఇంజన్ ఒక్కసారి ఆగి పోయి మళ్ళీ తిరిగి పరిగెత్తడం ఆరంభించింది. కానీ నౌక పర్వతాన్ని గుద్దుకోవడం మాత్రం అనివార్యమైంది. ఈ గుద్దుకోవడంలో నౌక కుడి భాగం వైపు 300 అడుగుల పొడవు మేరకు నౌక ప్రధాన భాగం రాపిడికి గురై నిర్మాణంలో వాడిన రివెట్లను బయటపడేసింది.
పంక్తి 37:
టైటానిక్ ఇతివృత్తంగా అనేక కాల్పనిక [[నవలా సాహిత్యము|నవల]]లు, [[సినిమా]]లు విడుదలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన కొన్ని నెలల తర్వాత దీన్ని గురించి కొన్ని మూల గ్రంథాలు కూడా రాయడం జరిగింది. ప్రమాదం నుంచి బయటపడిన ''లైటోలర్'', జాక్ థయర్ వంటి వారు తమ అనుభవాలను గ్రంథస్తం చేశారు. ''వాల్టర్ లార్డ్'' అనే రచయిత స్వయంగా టైటానిక్‌లో ప్రయాణించిన వ్యక్తులను కలిసి, పరిశోధన చేసి, అసలు నౌకలో ఏం జరిగిందో వర్ణించాడు.
 
'''టైటానిక్ ఆధారంగా తీసిన కొన్ని సినిమాలు'''
* సేవ్డ్ ఫ్రమ్ ది టైటానిక్ (1912)
* ఇన్ నాట్ అండ్ ఐజ్ (1912)
పంక్తి 45:
* ఎ నైట్ టు రిమెంబర్ (1958)
* [[టైటానిక్ (1997 సినిమా)]] (1997)
వీటిలో బాగా ప్రాచుర్యం పొందిన సినిమా 1997లో విడుదలైంది. దీనికి ''జేమ్స్ కామెరూన్'' దర్శకత్వం వహించాడు. ''కేట్ విన్‌స్లెట్'', ''లియోనార్డో డికాప్రియో'' ప్రధాన పాత్రలు ధరించారు. ఇది చలన చిత్ర పరిశ్రమలోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగానే కాక 14 [[ఆస్కార్ అవార్డు|ఆస్కార్ పురస్కారాలలో]] 11ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. అంతకు ముందు ఈ ఘనత సాధించిన చిత్రం బెన్‌హర్ ( 1959). తరువాత ఈ ఘనత సాధించింది 2003లో నిర్మించిన ''ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ "'' అనే సినిమా సాధించింది.
 
== అవీ-ఇవీ ==
పంక్తి 51:
 
== గణాంకాలు ==
నౌకలో ప్రయాణిస్తున్న వారి గణంకాలు విధంగా ఉన్నాయి.<ref>http://www.encyclopedia-titanica.org/</ref>
{| class="wikitable"
|-
Line 77 ⟶ 78:
| 0
|}
<ref>http://www.encyclopedia-titanica.org/</ref>
 
== ఇవి కూడా చూడండి ==
* [[ప్రమాదాలు]]
Line 86 ⟶ 85:
{{మూలాలజాబితా}}
<!--అంతర్వికీ లింకులు-->
== వెలుపలి లంకెలు ==
 
[[వర్గం:వాహనాలు]]
[[వర్గం:నౌకలు]]
"https://te.wikipedia.org/wiki/టైటానిక్_నౌక" నుండి వెలికితీశారు