గిరిజ (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి →‎వివాహము, వ్యక్తిగత జీవితము: AWB తో "మరియు" ల తొలగింపు
చి →‎నేపధ్యము: AWB తో వర్గం చేర్పు
పంక్తి 22:
 
==నేపధ్యము==
1950 - 1960 దశకాల్లో ఏకచత్రాధిపత్యంగా సినీజగత్తును ఏలిన హాస్య మహారాణి గిరిజ. [[కస్తూరి శివరావు]] నిర్మించిన [[పరమానందయ్య శిష్యులు]] చిత్రంతో [[అక్కినేని నాగేశ్వరరావు]] సరసన కథానాయికగా సినీరంగ ప్రవేశం చేసింది. తర్వాత [[పాతాళభైరవి]] చిత్రంలోని 'నరుడా ఏమి నీ కోరిక' అనే ఒకే ఒక్క పలుకుతో కథానాయిక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. సుప్రసిద్ద హాస్యనటుడు [[రేలంగి]]తో జట్టుకట్టిన తర్వాత అప్పటి హీరోహీరోయిన్లకు సమానంగా కీర్తి సంపాదించింది. [[అన్నపూర్ణ (సినిమా)|అన్నపూర్ణ]], [[గుడిగంటలు]], [[అప్పుచేసి పప్పుకూడు]], [[జగదేకవీరుని కథ]], [[ఆరాధన]] వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
 
ఒక పక్క హాస్యనటిగా నటిస్తూనే మరోపక్క అక్కినేని నాగేశ్వరరావు (వెలుగునీడలు), [[ఎన్. టి. రామారావు]] (మంచి మనసుకు మంచిరోజులు), [[జగ్గయ్య]] (అత్తా ఒకింటి కోడలే), [[శివాజీగణేశన్]] (మనోహర), [[హరనాథ్]] (మా ఇంటి మహాలక్ష్మి), [[చలం]] (కులదైవం), [[జె. వి. రమణమూర్తి]] (ఎం.ఎల్.ఏ) వంటి కథానాయకుల సరసన నాయికగా రాణించింది.
"https://te.wikipedia.org/wiki/గిరిజ_(నటి)" నుండి వెలికితీశారు