చతుష్షష్టి కళలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
2409:4070:613:FFBC:E88D:9C73:1F30:DA18 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3055338 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 142:
==వివరణ సహిత 64 కళలు==
===వా.కా.సూత్రములలో<ref>[వా.కా.సూ. 1-3-16.]</ref>===
{{Div col|cols=2}}
# గీతము (స్వర ప్రధానముగా, పద ప్రధానముగా, లయ ప్రధానముగా మనస్సు యొక్క అవధానము ప్రధానముగా లోలోపల గానము చేయబడునది),
# వాద్యము (ఇది తత-ఘన-అనవద్ధ-సుషిర భేదములచే నాలుగు విధములు ),
# నృత్యము (భావాభినయము),
# అలేఖ్యము (చిత్రలేఖనము),
# విశేషకచ్ఛేధ్యము (తిలక-పత్రభంగాది రచన),
# తండులకుసుమ బలివికారములు (బియ్యపుపిండితో, పూలతో భూతతృప్తి కొఱకు పెట్టెడి ముగ్గులు),
# పుష్పాస్తరణము (పూలశయ్యలను, అసనములను ఏర్పఱచుట),
# దశన వసనాంగరాగము (దంతములకు, వస్త్రములకు రంగులద్దుట),
# మణిభూమికాకర్మ (మణులతో బొమ్మలను చేయుట),
# శయన రచనము (ఋతువుల ననుసరించి శయ్యలను కూర్చుట),
# ఉదక వాద్యము (జలతరంగిణి),
# ఉదకాఘాతము (వసంతకేళిలో పిచికారుతో నీళ్ళు చిమ్ముట),
# చిత్రయోగములు (రకరకముల వేషములతో సంచరించుట),
# మాల్యగ్రథన వికల్పములు (చిత్ర విచిత్రములైన పూలమాలలను కూర్చుట),
# శేఖరకాపీడ యోజనము (పూలతో కిరీటమును, తలకు చుట్టును అలంకరించుకొనెడి పూల నగిషీని కూర్చుట),
# నేపథ్య ప్రయోగము (అలంకరణ విధానములు),
# కర్ణపత్రభంగములు (ఏనుగు దంతములతోను శంఖములతోను చెవులకు అలంకారములను కల్పించుకొనుట),
# గంధయుక్తి (అత్తరువులు మొదలగునవి చేసే నేర్పు ),
# భూషణ యోజనము (సామ్ములు పెట్టుకొను విధానము ),
# ఇంద్రజాలములు (చూపఱుల కనులను భ్రమింప జేయుట),
# కౌచిమారయోగము (సుభగంకరణాది యోగములు),
# హస్త లాఘవము (చేతులలోనున్న వస్తువులను మాయము చేయుట),
# విచిత్ర శాఖయూష భక్ష్యవికారములు (రకరకముల తినుబండములను వండుట),
# పానక రసరాగాసవ యోజనము (పానకములు, మద్యములు చేయుట),
# సూచీవానకర్మ (గుడ్డలు కుట్టుట),
# సూత్రక్రీడ (దారములను ముక్కలు చేసి, కాల్చి మరల మామూలుగా చూపుట),
# వీణాడమరుక వాద్యములు (ఈవాద్యములందు నేర్పు),
# ప్రహేళికలు (సామాన్యార్థము మాత్రము పైకి కనబడునట్లును, గంభీరమైన యర్థము గర్భితమగునట్లును కవిత్వము చెప్పుట),
# ప్రతిమాల (కట్టుపద్యములను చెప్పుట),
# దుర్వాచక యోగములు (విలాసము కొఱకు క్లిష్ట రచనలను చదువులట),
# పుస్తక వాచకము (అర్థవంతముగా చదివెడి నేర్పు),
# నాటకాఖ్యాయికా దర్శనము (నాటకములకు, కథలకు సంబంధించిన జ్ఞానము ),
# కావ్యసమస్యాపూరణము (పద్యములతో సమస్యలను పూరించుట),
# పట్టికా వేత్రవాన వికల్పములు (పేముతో కుర్చీలు, మంచములు అల్లుట),
# తక్షకర్మ (విలాసము కొఱకు బొమ్మలు మొదలైనవి చేయుట),
# తక్షణము (కఱ్ఱపని యందు నేర్పు),
# వాస్తువిద్య (గృహాదినిర్మాణ శాస్త్రము ),
# రూప్యరత్నపరీక్ష (రూపాయలలోను, రత్నములలోను మంచి చెడుగులను పరిశీలించుట),
# ధాతువాదము (లోహములుండెడి ప్రదేశములను కనుగొనుట),
# మణిరాగాకర జ్ఞానము (మణుల గనులను కనిపెట్టుట),
# వృక్షాయుర్వేద యోగములు (చెట్లవైద్యము),
# మేషకుక్కుటలావక యుద్ధవిధి (పొట్టేళ్ళు, కోళ్ళు, లావుక పిట్టలు మొదలగు వానితో పందెములాడుట),
# శుకశారికా ప్రలాపనము (చిలుకలకు, గోరువంకలకు మాటలు నేర్పుట),
# ఉత్సాధన, సంవాహన, కేశమర్దన కౌశలము (ఒళ్ళుపట్టుట, పాదములోత్తుట, తలయంటుట వీనియందు నేర్పు),
# అక్షరముష్టికా కథనము (అక్షరములను మధ్య మధ్య గుర్తించుచు కవిత్వము చెప్పుట),
# మ్లేచ్ఛితక వికల్పములు (సాధుశబ్దమును గూడ అక్షర వ్యత్యయము చేసి అసాధువని భ్రమింపజేయుట),
# దేశభాషా విజ్ఞానము (బహుదేశ భాషలను నేర్చియుండుట),
# పుష్పశకటిక (పూలతో రథము, పల్లకి మొదలగునవి కట్టుట),
# నిమిత్త జ్ఞానము (శుభాశుభ శకునములను తెలిసియుండుట),
# యంత్ర మాతృక (యంత్ర నిర్మాణాదులు),
# ధారణ మాతృక (ఏకసంధా గ్రహణము),
# సంపాఠ్యము (ఒకడు చదువుచుండగా పలువురు వానిననుసరించి వల్లించుట),
# మానసీక్రియ (మనస్సుయొక్క అవధానమునకు సంబంధించిన క్రియ),
# కావ్యక్రియ (కావ్యములను రచించుట),
# అభిధాన కోశచ్ఛందో విజ్ఞానము (నిఘంటువులు, ఛందోగ్రంథములు-వీని పరిజ్ఞానము),
# క్రియాకల్పము (కావ్యాలంకార శాస్త్ర పరిజ్ఞానము),
# ఛలితక యోగములు (మాఱువేషములతో నింకొక వ్యక్తివలె చలామణి యగుట),
# ద్యూతవిశేషములు (వస్త్రములను మాయము చేయుట మొదలగు పనులు),
# ద్యూతవిశేషములు (జూదము లోని విశేషములను తెలిసికొని యుండుట),
# ఆకర్షక్రీడలు (జూదములందలి భేదములు),
# బాలక్రీడనకములు (పిల్లల ఆటలు),
# వైనయిక జ్ఞానము (గజ అశ్వ-శాస్త్ర పరిజ్ఞానము),
# వైజయిక విద్యలు (విజయసాధనోపాయములను తెలిసియుండుట),
# వ్యాయామిక జ్ఞానము (వ్యాయామపరిజ్ఞానము).
{{Div end}}
===శుక్రనీతిసారము నుండి<ref>[శుక్రనీతిసారము 4-3-67]</ref>===
{{Div col|cols=2}}
"https://te.wikipedia.org/wiki/చతుష్షష్టి_కళలు" నుండి వెలికితీశారు