కొక్కొండ వెంకటరత్నం పంతులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''కొక్కొండ వెంకటరత్నం పంతులు''' ([[మార్చి 14]], [[1842]] -[[14 డిసెంబర్]], [[1915]]) [[కవి]], [[నాటక రచయిత]], పత్రికా సంపాదకుడు, [[ఉపాధ్యాయుడు]], సంగీతజ్ఞుడు. గ్రాంధికమే మాట్లాడేవాడు. [[మహామహోపాధ్యాయ]] బిరుదు పొందిన ఆధునికాంధ్రులలో రెండవ వ్యక్తిగా ఘనత వహించాడు. "ఆంధ్రభాషా జాన్‌సన్" అనే గౌరవం కూడా పొందాడు. ఆంధ్ర వాజ్మయంలో నవయుగ ప్రవర్తకత్రయం ([[పరవస్తు చిన్నయ సూరి|చిన్నయసూరి]], వెంకటరత్నము, [[కందుకూరి వీరేశలింగం పంతులు|వీరేశలింగము]]) లో ఇతను మధ్యమ స్థానాన్ని ఆక్రమించాడు.
 
ఇరవై రెండు సంవత్సరాలు [[మద్రాసు]] రాజధాని కళాశాలలోనూ, ఎనిమిది సంవత్సరాలు [[రాజమండ్రి]] కళాశాలలోనూ [[తెలుగు]] పండితులుగా పనిచేసాడు. ఇతను 1871 లో ‘ఆంధ్రభాషా సంజీవిని’అనే పత్రికను స్థాపించి 20 సంవత్సరాలు నడిపాడు. [[చెన్నై]]లో ఆంధ్రులచే నడుపడిన పత్రికలో ఇదే మొదటిది పత్రిక. ఆ తర్వాత ‘హాస్యవర్ధని’ అనే పత్రికను నడిపాడు. హిందూ శ్రేయోభివర్ధనీ సభను స్థాపించి, [[ఆంధ్రభాష]]లో వక్తృత్వం, ఉపన్యాస పద్ధతి నెలకొల్పి వాటిద్వారా ఆర్యమత ప్రచారం చేశాడు.