"గంగా నది" కూర్పుల మధ్య తేడాలు

 
[[దస్త్రం:Early morning on the Ganges.jpg|thumb|230px|right|వారాణసిలో గంగానదిపై సూర్యోదయం]]
అలహాబాదు తరువాత మరెన్నో నదులతో కలిసి గంగానది మహా ప్రవాహంగా మారుతుంది. [[పశ్చిమ బెంగాల్]]‌లో మాల్దా వద్ద మొదటిసారి చీలుతుంది. అక్కడినుండి [[హూగ్లీహుగ్లీ నది]] (గంగానది చీలిక) ప్రారంభమౌతుంది. విశాలమైన గంగా-హూగ్లీ డెల్టా ఇక్కడితో మొదలౌతుంది. [[కొలకత్తా]] నగరం హూగ్లీ వడ్డున ఉంది. ప్రధానమైన గంగానదిని మాల్దా తరువాత "పద్మ" నది అంటారు. [[పద్మ నది]] బంగ్లాదేశ్‌లో ప్రవేశించిన తరువాత [[బ్రహ్మపుత్రా నది]] చీలిక అయిన [[జమునా నది]] పద్మతో కలుస్తుంది. ఆతరువాత [[మేఘనా నది]] కూడా దీనితో కలుస్తుంది. బంగ్లాదేశ్ మైదానాలలో ఈ మహాప్రవాహం అనేకానేకంగా చీలి అక్కడి [[సుందర వనాలు]] డెల్టా గుండా ప్రవహించి, తరువాత [[బంగాళాఖాతం]] [[సముద్రం]]లో కలుస్తాయి.
 
[[సుందర వనాలు]] (Sundarbans) డెల్టా దట్టమైన mangrove వృక్షాలతో కూడిన అరణ్యం. పర్యావరణ పరంగా విశిష్టమైన చాలా వృక్ష, జంతు సంపదకు ఆలవాలం. ప్రత్యేకించి [[రాయల్ బెంగాల్ పులి]], [[గంగానది డాల్ఫిన్]], [[ఐరావతి డాల్ఫిన్]], [[మంచినీటి షార్క్ చేప]] (Glyphis gangeticus) వీటిల్లో ముఖ్యమైనవి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3057306" నుండి వెలికితీశారు