అచ్యుత దేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
ఈయన పరిపాలనా కాలములో [[హంపి]]లోని తిరువేంగళనాధుని ఆలయము నిర్మించినాడు. ఈ ఆలయం అక్కడ కొలువై ఉన్న దేవుని పేరుమీదుగా కంటే ''అచ్యుతరాయ ఆలయము'' అన్న పేరుతోనే ప్రసిద్ధి చెందింది.
 
ఇప్పుడు [[కపిల తీర్ధము]]గా ప్రసిద్ధమైన [[తిరుమలతిరుపతి]] లోని ఆళ్వార్ తీర్ధాన్ని అచ్యుతరాయలు నిర్మింపజేశాడు. తీర్ధము చుట్టూ రాతి మెట్లు, మంటపము నిర్మించాడు. [[1533]] లో స్వామివారి పుష్కరిణి మెట్లు బాగుచేయించి పాత పుష్కరిణి పక్కనే కొత్త పుష్కరిణిని కట్టించాడు. తిరుమలలో ఆలయానికి దక్షిణము వైపున అచ్యుతరాయలు మరియు ఆయన భార్య వరదాంబికల రాతి విగ్రహాలు చూడవచ్చు<ref name=act3>[http://www.omnamovenkatesaya.com/saptagiri_Nov2005_Eng/Tirumala_through_ages.htm అనాదిగా తిరుమల - పి.కుసుమ కుమారి]</ref>.
 
కృష్ణదేవరాయల లాగానే అచ్యుతరాయలు కూడా సాహిత్య పోషకుడు. ప్రతి సంవత్సరం ఒక గ్రంథం రాయించి తిరుపతి వెంకటేశ్వరునికి సమర్పించేవాడు<ref name=arudra237>ఆరుద్ర, పేజీ.237-238</ref>. అచ్యుతరాయలు స్వయంగా ''తాళమహోదధి'' అనే గ్రంథం సంస్కృతంలో రాశాడు. ఈయన ఆస్థానములో కన్నడ కవి [[చాటు విఠలనాధుడు]], ప్రముఖ సంగీతకారుడు [[పురందరదాసు]] మరియు సంస్కృత విద్వాంసుడు [[రెండవ రాజనాథ డిండిమభట్టు]] ఉండేవారు. డిండిమభట్టు ''అచ్యుతరాయాభ్యుదయము''తో పాటు సంస్కృతములో భాగవత చంపు వ్రాసి అచ్యుతరాయలకు అంకితమిచ్చాడు. ఈయన ఆస్థానములోని తెలుగు కవులలో [[రాధామాధవ కవి]] ముఖ్యుడు. ఈయన రచించిన ''తారకబ్రహ్మరాజీయము''ను అచ్యుతరాయల మంత్రి [[నంజ తిమ్మన]]కు అంకితం చేశాడు. కృష్ణరాయల సభ భువనవిజయములాగే, అచ్యుతరాయల సభను ''వెంకట విలాస మండపము'' అని పిలిచేవారు.
"https://te.wikipedia.org/wiki/అచ్యుత_దేవ_రాయలు" నుండి వెలికితీశారు