పినిశెట్టి శ్రీరామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''పినిశెట్టి శ్రీరామమూర్తి''' ప్రముఖ తెలుగు నాటక, సినిమా రచయిత మ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పినిశెట్టి శ్రీరామమూర్తి''' ప్రముఖ తెలుగు నాటక, సినిమా రచయిత మరియు దర్శకులు.
 
వీరు [[తూర్పు గోదావరి]] జిల్లా [[పాలకొల్లు]] లో జన్మించారు. చిన్ననాటి నుండి నాటక రచన, ప్రదర్శనలలో కృషిచేశారు. 1944 సంవత్సరంలో 'ఆదర్శ నాట్యమండలి'ని స్థాపించారు. ఆదర్శజ్యోతి అనే నాటకం రాసి, ప్రదర్శించి ప్రశంసలు పొందారు. వీరు రాసిన ఇతర నాటకాలు 'కులం లేని పిల్ల', 'పల్లె పడుచు', 'అన్నా చెల్లెలు' అనేక నాటక సమాజాల వారు దేశమంతటా ప్రదర్శించారు. స్త్రీ పాత్ర లేకుండా రాసిన 'ఆడది' నాటిన వేయికి పైగా ప్రదర్శనలు ఇవ్వబడి చరిత్ర సృష్టించింది. అదే విధంగా 'పంజరంలో పక్షులు', 'రిక్షావాడు', 'సాగరయ్య సంసారం' కూడా బహుళ ప్రజాదరణ పొందాయి. వీరు చలనచిత్ర రంగంలో ప్రవేశించి దాదాపు 60 చిత్రాలకు సంభాషణలు రాశారు.
 
[[వర్గం:తెలుగు సినిమా రచయితలు]]