రైల్వే కోడూరు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి చిన్న మార్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 20:
==శ్రీ భుజంగేశ్వరస్వామివారి ఆలయం==
ఈ అలయానికి, కోడూరు పరిధిలో రు. 20 కోట్ల విలువ చేసే ఆస్తులున్నవి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి అప్పట్లో పెద్దలు భూరి విరాళాలిచ్చారు. ఎస్.వి.జూనియర్ కలాశాల వద్ద 1.7 ఎకరాలు, పాత బస్సుస్టాండు వద్ద 4.5 సెంట్లు, పాత బజారు వీధిలో ఒక ఇల్లు, మార్కెట్ వీధిలో 16 గదులు, ఇవి అన్నీ శివునికి చెందిన ఆస్తులు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ కృష్ణ చతుర్దశి (ఉగాది ముందురోజు) రోజున సాయంత్రం, పార్వతీ సమేత పరమేశ్వరుడు, చంద్రప్రభ వాహనంపై పుర వీధులలో భక్తులకు దర్శనమిచ్చును. ఈ కార్యక్రమం కోసం ఆలయ కమిటీ వారు పుష్ప రథం ఏర్పాటుచేసెదరు. ఆది దంపతులకు గ్రామస్థులు, నీరాజనాలు సమర్పించెదరు.
 
ఈ ఆలయంలో 2016,నవంబరు-21వ తేదీ కార్తీక సోమవారంనాడు, ఉదయాత్పూర్వం, 4-50 - 5-50 గంటల మధ్య, నూతనంగా నిర్మించిన ఒక ప్రత్యేక మండపంలో, శ్రీ దాంపత్య దక్షిణామూర్తి స్వామివారి విగ్రహ ఆవిష్కరణ నిర్వహించెదరు.
 
==శ్రీ బలిజ గంగమ్మ అమ్మవారి ఆలయం==
పట్టణ పరిధిలోని బలిజ వీధిలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి జాతర, 2014,మే-22, గురువారం నాడు ఘనంగా నిర్వహించారు. జిల్లా నుండి భక్తులు కుటుంబసభ్యులతో పెద్ద సంఖ్యలో తరలి వచ్చి, అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
 
==శ్రీ గంగమ్మ అమ్మవారి ఆలయం==
"https://te.wikipedia.org/wiki/రైల్వే_కోడూరు" నుండి వెలికితీశారు