జి.ఆర్. గోపినాథ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
ఈయన [[నవంబరు 13]] [[1951]] లో [[కర్ణాటక రాష్ట్రం]] లోని [[మెల్‌కోట్]] నందు జన్మించారు. ఈయన తన 8 మంది సహోదరులలో రెండవవాడు. ఆయన తండ్రి పాఠశాల ఉపాధ్యాయుదు. కావున వారి కుటుంబసభ్యులు అందరూ కూడా ఆ గ్రామంలోనే జీవించేవారు.అందువలన గోపినాథ్ ఆ గ్రామంలో ఉన్న కన్నడ మాధ్యమంలో ఐదవ తరగతి వరకు విధ్యాభ్యాసం చేశారు.ఆయన ఐదవ తరగతిలో వారి పాఠశాలలో డిఫెన్స్ ఫోర్‌ పాఠశాల వారు ప్రవేశ పరీక్ష నిర్వహించారు.ఆ పరీక్ష ఆంగ్లములో నిర్వహించడం
వలన ఆయన రాయలేక పోయారు. 1962 లో గోపీనాథ్ [[బీజాపూర్]] సైనిక పాఠశాల నందు చేరారు. ఈ పాఠశాల ఆయనకు [[:en:National Defence Academy|నేషనల్ డిఫెన్స్ అకాడమీ(NDA)]] లో చేరుటకు సహాయపడింది. 3 సంవత్సరముల శిక్షణ అనంతరం ఆయన ఎన్.డి.ఎ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. తర్వాత ఇండియన్ మిలిటరీ అకాడమీ లో పట్టభద్రుడైనాడు.
==కాలక్రమ పట్టిక===
* 1997: డెక్కన్ ఏవియేషన్ కార్యకలాపాల ప్రారంభం
* 2003: ఎయిర్ డెక్కన్ కార్యకలాపాల ప్రారంభం
* 2004: డెక్కన్ ఏవియేషన్ శ్రీలంకకు విస్తరణ.
* 2007: ఎయిర్ డెక్కన్ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో విలీనం
* 2009: దక్కన్ 360 ను ప్రారంభించి లోక్సభ ఎన్నికలలో పోటీ
 
==ఎయిర్ డెక్కన్ సంస్థ==
ఎయిర్ డెక్కన్ సంస్థను రాజకీయ వేత్త, రచయిత అయిన కెప్టెన్ జి.ఆర్. గోపీనాథ్ ప్రారంభించారు. ఇది భారత దేశంలో తొలి చవక ధరల విమానసంస్థ గా తన సేవలను ఆగస్టు 23, 2003లో బెంగళూరు నుంచి హుబ్లీకి ప్రారంభించింది.<ref>{{cite web | title=About Air Deccan | url=http://www.deccanairlines.in/deccan-airways.html | website= | access-date=2015-04-16 | archive-url=https://web.archive.org/web/20140222004421/http://www.deccanairlines.in/deccan-airways.html | archive-date=2014-02-22 | url-status=dead }}</ref> సామాన్యుల విమాన సంస్థగా దీనికి పేరుంది. ఈ సంస్థ లోగో రెండు అరచేతులు కలిపి ఓ పక్షి ఎగురుతున్నట్లుగా ఉంటుంది. ఈ సంస్థ నినాదం “సింప్లీ-ఫ్లై” అని రాస్తారు. సామాన్యులు కూడా విమానాల్లో ఎగురవచ్చని ఈ సంస్థ నిరూపించింది. తన జీవిత కాలంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలనే ప్రతి భారతీయుని కల నెరవేర్చాలని కెప్టెన్ గోపీనాథ్ అంటుండేవారు. [[హుబ్లీ]], [[మంగళూరు]], మధురై, విశాఖపట్టణం వంటి రెండో శ్రేణి నగరాలకు [[బెంగళూరు]], [[చెన్నై]] లాంటి మెట్రో పాలిటన్ నగరాల నుంచి విమానాలను నడిపించిన తొలి విమాన సంస్థ ఇదే. ఎయిర్ డెక్కన్ ఆరంభమైన అతి కొద్ది కాలంలోని అద్భుత పురోగతి సాధించించి. అయితే ఈ సంస్థ నష్టాల భారిన పడడంతో 2007లో దీని నిర్వహణ బాధ్యతలను కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్ తీసుకుంది. అప్పుడు దీనిని కింగ్ ఫిషర్ రెడ్ ఎయిర్ లైన్స్ గా పేరు మార్చారు. ప్రయాణికులను ఆకర్షించేందుకు ఈ విమాన ప్రయాణ ఛార్జీలను బాగా తగ్గించారు. ఎంతగా తగ్గించారంటే భారత దేశంలో ఉన్నత శ్రేణి రైలు ప్రయాణ ఛార్జీలతో సమానంగా ఈ విమాన రేట్లునిర్ణయించి విమాన ప్రయాణికులకు సేవలందించారు. అయితే ఈ సంస్థ కాలక్రమంలో స్పైస్ జెట్, ఇండి గో ఎయిర్ లైన్, జెట్ లైట్, గో ఎయిర్ ల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంది. ప్రస్తుతం దీని కార్యకలాపాలు ఆపివేశారు. <ref>{{cite web|url=http://www.financialexpress.com/news/deccan-ipo-scrapes-through/168968/ |title=Deccan IPO scrapes through |publisher=Financialexpress.com |date=24 May 2006 |accessdate=30 August 2010}}</ref> ఇది బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించేది. అప్పుడు చౌక ధరల విమాన సర్వీసులకు ఇది పేరొందింది. కానీ తర్వాత నష్టాలు ఎక్కువ కావడంతో 2008లో ఎయిర్‌ డెక్కన్‌ను కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లో విలీనం చేశారు. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ దీన్ని కింగ్‌ఫిషర్‌ రెడ్‌గా రీబ్రాండ్‌ చేసింది. కానీ తర్వాత ఆర్థికపరమైన సమస్యల కారణంగా 2012లో మూతపడింది.
"https://te.wikipedia.org/wiki/జి.ఆర్._గోపినాథ్" నుండి వెలికితీశారు