అల్లం: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
తప్పులు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 19:
[[దస్త్రం:Allam.JPG|250px|right|thumb|అల్లం]]
 
'''అల్లం''' ఒక చిన్న మొక్క వేరునుండి తయారవుతుంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఇది భారతదేశం, చైనా దేశాలలో చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని శతాబ్దాల నుంచీ చైనీయుల వైద్యంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది. [[కన్ఫ్యూషియస్]] తన రచనల్లో దీనిగురించి ప్రస్తావించాడు. చైనా దేశం కి అల్లంను పరిచయం చేసింది మన భారతీయులు. ఆసియా దేశాల్లో చేసే చాలా వంటకాల్లో ఇది విడదీయలేని భాగం. పచ్చళ్ళలోనూ, కూరల్లో వేసే [[మసాలా]] లోనూ దీన్ని విస్తృతంగా వాడుతారు. ఎండాకాలంలో వడకొట్టకుండా, అల్లాన్ని [[కరివేపాకు]], [[మజ్జిగ]]లతో కలిపి తీసుకుంటారు. చాలామందికి ప్రయాణాల్లో [[వాంతులు]] మహా ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని అల్లంతో అరికట్టవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్యులు. అల్లం నోటి దుర్వాసనను పోగోడుతుంది. అల్లం నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియాలను సంహరించి, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం అల్లానికి ఉంది. అల్లం ప్రభావం కాలేయం మీద ఉంటుంది. [[కొలెస్టరాల్‌|కొలెస్టరాల్]] నియంత్రణలో మెరుగైన పాత్ర వహించేలా కాలేయాన్ని తయారు చేయడమే అల్లం నిర్వహించే పాత్ర. రక్త నాళాల్లో రక్తప్రవాహం మెరుగుపరుస్తుంది. నాళాలు మూసుకు పోవడం జరుగదు. కీళ్లవారు, ఆస్త్మాల నుండి ఉపశమనం అందిస్తుంది. [[జీర్ణక్రియ]]ను మెరుగుపరుస్తుంది. అల్లం, చిటికెడు ఉప్పును భోజనానికి ముందుగానీ, తర్వాతగానీ తీసుకుంటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అల్లం మలబద్ధకాన్ని పోగొడుతుంది. సులభ విరోచనకారి కూడా. కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది.
 
==లక్షణాలు==
# ఈ మొక్క వార్షికంగా పెరుగుతుంది. ఇది ఒక హెర్బ్ నిత్యం ఒక మీటర్ పొడవు పెరుగుతుంది. కాండం ఇరుకుగా ఉండి ఆకుపచ్చ ఆకులు, పసుపు పువ్వులు కలిగి ఉంటాయి.అల్లం పసుపు పువ్వులు, తెలుపు, పింక్ రంగులు కలిగి ఉంటాయి.కాండం 3 నుండి 4 అడుగుల వరకు ఉంటుంది.ఎండిన నేలలో వొచ్చే ఎక్కువ పోషకాలను అందిస్తుంది. లేత అల్లం భూగర్భ చాలా తేలికపాటి రుచితో జ్యుసిగా, కండగా ఉంటుంది.ప్రౌఢ అల్లం భూగర్భ నుండి తీస్తారు దాదాపు పొడిగా ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/అల్లం" నుండి వెలికితీశారు