రామరాజభూషణుడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 1:
'''[[రామరాజభూషణుడు]]''' గా పేరుగాంచిన '''భట్టుమూర్తి''', [[శ్రీకృష్ణదేవరాయలు|శ్రీకృష్ణదేవరాయల]] ఆస్థానములోని [[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజాల]] లో ఒకడు. ఈయన [[16వ శతాబ్దము]]కు చెందిన తెలుగు కవి, సంగీత విద్వాంసుడు. ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు [[అళియ రామరాయలు|అళియ రామరాయల]] ఆస్థానమునకు [[ఆభరణము]] వలె ఉండటము వలన ఈయనకు 'రామరాజభూషణుడు' అని పేరు వచ్చింది.
ఒక గొప్ప ఆంధ్రకవి. ఈతని [[జన్మభూమి]] బల్లారికి సమీపము లోని పాలమండలము అను ప్రదేశమున ఉండెడు భట్టుపల్లె. ఇతడు శాలివాహనశకము 13 వ శతమానశతాబ్ద మధ్యకాలమున జీవించి ఉన్నట్లు తెలియవచ్చుచు ఉంది. ఇతఁడు రచియించిన గ్రంథములు [[వసుచరిత్రము]], [[హరిశ్చంద్ర నలోపాఖ్యానము]], కావ్యాలంకారసంగ్రహము. అందు మొదటిది రెండవదానివలె శుద్ధశ్లేషమయము కాకపోయినను శ్లేషనే అనుజీవించి ఉండును. దీనివలె కఠినశైలి కలదిఁయు మధురము అయినదియు అగు శ్లేషకావ్యము మఱియొక్కటి తెనుఁగున లేదు. రెండవది కేవలశ్లేషమయమై హరిశ్చంద్రుని యొక్కయు నలుని యొక్కయు చరిత్రములను తెలుపుచు ఉంది. మూడవది కావ్యాలంకార లక్షణములను తెలుపునది. తెనుఁగునందు మేలైన అలంకార శాస్త్రము ఇది ఒక్కటియె కానఁబడుచు ఉంది. ఈతని కావ్యములు మిక్కిలి శ్లాఘనీయములుగా ఉన్నాయి. అయినను అవి ఇంచుక మతాంతరలక్షణమును తెలుపును. ఇతనికి [[రామరాజభూషణుఁడు]], [[భట్టుమూర్తి]] అను బిరుదాంకము కృష్ణదేవరాయలచే ఇయ్యఁబడెను.
 
[[నెల్లూరు]] ప్రాంతమునకు చెందిన భట్టుమూర్తి [[వసుచరిత్రము]], [[హరిశ్చంద్ర]], [[నలోపాఖ్యనము]], నరసభూపాలీయము అని కావ్యములను రచించాడు. వీటన్నిటిలో వసుచరిత్ర చాలా ప్రసిద్ధమైనది. ఇందులోని శ్లేష ప్రయోగము ప్రశంసనీయము. ఆ తరువాత కాలములో వచ్చిన [[చేమకూరి వెంకటకవి]] భట్టుమూర్తి శైలిని అనుకరించాడు.
"https://te.wikipedia.org/wiki/రామరాజభూషణుడు" నుండి వెలికితీశారు