అమెజాన్ వెబ్ సర్వీసెస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
'''అమెజాన్ వెబ్ సర్వీసెస్ ''' లేదా '''AWS''' అనునది అమెజాన్(కంపెనీ) సంస్థ యొక్క అనుబంధ సంస్థ. వీరు ప్రప్రంచ ప్రసిద్ది గాంచిన క్లౌడ్ ఆధారిత కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ సేవలను అందిస్తున్నారు.
==నేపధ్యము==
==Background==
అమెజాన్‌ను స్థాపించిన జెఫ్‌[[జెఫ్ బెజోస్‌బెజోస్]]‌ ఈ వెబ్‌ సర్వీసెస్‌ ఆలోచనకు మూలకారకుడు. ఏడబ్ల్యూఎస్‌ ప్రస్తుత రూపానికి రాకముందు మిగతా అన్ని వెబ్‌సైట్లలాగా ‘అమెజాన్‌ బ్యాక్‌ ఎండ్‌ టెక్నాలజీ’గా మాత్రమే ఉండేది. అంటే ప్రతి కంపెనీ తన వెబ్‌సర్వర్లను నడిపినట్టుగానే అమెజాన్‌ సొంత సర్వర్లతో పనిచేసుకునేది.
 
ఒకసారి బెజో్‌సకు ఒక ఆలోచన వచ్చింది.తన సంస్థలోని యాడ్స్‌ విభాగం సేల్స్‌ గణాంకాలను ఆ విభాగం వారిని అడిగి, ఈమెయిల్‌ ద్వారా తెప్పించుకోవడం కన్నా.. సెంట్రల్‌ డేటా నుంచి తీసుకునేలా ఏర్పాటు చేయాలన్నది ఆ ఆలోచన. ఆ తర్వాత.. అది కేవలం తమ అంతర్గత అవసరాలకే కాకుండా, బోలెడన్ని కంపెనీలకూ ఉపయోగపడేలా ఉంటే? అన్న ఆలోచన వచ్చింది. అదే అమెజాన్‌ వెబ్‌ సర్వీసె్‌సకు మూలం.
 
2002లో జూలైలో అలా ఏడబ్ల్యూఎస్‌ మొదలైంది. 2006 నుంచి బయటి ప్రపంచానికి అమెజాన్‌ వెబ్‌ సర్వీసె్‌సలోకి దారులు తెరుచుకున్నాయి. సాంకేతికంగా ఆలోచిస్తే.. అమెజాన్‌ వెబ్‌సైట్‌ చేస్తున్న పని కూడా అదే. ఎవరి కంపెనీ కోసం వారు వెబ్‌సైట్‌ రూపొందించుకోవడం కాకుండా.. అందరు రిటైలర్లూ వచ్చి అమెజాన్‌ వెబ్‌సైట్‌లో వస్తువులను అమ్ముకుంటున్నారు. అక్కడ భౌతికంగా కనపడే వస్తువులను అమ్మితే.. వెబ్‌ సర్వీసె్‌సలో సేవలను అమ్ముతారంతే.
 
== ప్రారంభము ==
ప్రారంభించిన మొదట్లో ఏడబ్ల్యూఎస్‌ అంటే కేవలం అమెజాన్‌ కంప్యూటర్లలో కొంత స్థలాన్ని కొనుక్కోవడం మాత్రమే. కానీ, కాలక్రమంలో ఏడబ్ల్యూఎస్‌ నాలుగు సేవలను అందించడం ప్రారంభించింది. అవి.. స్టోరేజ్‌, కంప్యూటింగ్‌, డేటాబేస్‌, ఇంటర్నల్‌ మెసేజింగ్‌. వీటిలో మొదటి రెండింటినీ ‘అమెజాన్‌ ఎస్‌3’గా వ్యవహరిస్తారు.
 
అంటే సింపుల్‌ స్టోరేజ్‌ సర్వీస్‌. నిజానికి ఏడబ్ల్యూఎస్‌ రాకముందు ఇలా చేయాలంటే చాలా పెద్ద తతంగం ఉండేది. తగిన సర్వీస్‌ ప్రొవైడర్‌ను వెతుక్కోవడం, మన సేవలకు అవసరమయ్యే స్పెసిఫికేషన్లు ఉన్న సర్వర్లను ఎంచుకోవడం.. ఇదంతా కష్టంగా ఉండేది. అమెజాన్‌ వాటన్నింటినీ సులభతరం చేసింది. 2016 నాటికి దాదాపు 13 లక్షల సర్వర్లను ఉపయోగించి అమెజాన్‌ తన వెబ్‌ సర్వీసె్‌సను అందించేది. ఆ తర్వాత సర్వర్ల సంఖ్య ఇంకా పెరిగింది. వాటి ద్వారా దాదాపు 190 దేశాల్లో కొన్ని లక్షల మంది ఏడబ్ల్యూఎస్‌ సేవలను వినియోగించుకుంటున్నారు.
 
== ఖాతాదారులు ==
అశోక్‌ లేలాండ్‌, ఆదిత్య బిర్లా కేపిటల్‌, యాక్సిస్‌ బ్యాంకు, క్లియర్‌ ట్యాక్స్‌, హెచ్‌డీఎ్‌ఫసీ లైఫ్‌, మహీంద్రా ఎలక్ట్రిక్‌ ఓలా, ఓయో, నేషనల్‌ కమోడిటీ అండ్‌ డెరివేటివ్స్‌ ఎక్స్ఛేజీ ఈ-మార్కెట్స్‌ లిమిటెడ్‌ వంటి అనేక కంపెనీలు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌‌ సేవలను వినియోగించుకుంటున్నాయి. తమ కీలకమైన వర్క్‌, డేటాను క్లౌడ్‌ ఫ్లాట్‌ఫారమ్‌కు తరలిస్తున్నాయి. నేషనల్‌ కమోడిటీ అండ్‌ డెరివేటివ్‌ ఎక్స్ఛేంజీ 50 అప్లికేషన్లను ఏడబ్ల్యూఎస్‌ క్లౌడ్‌కు బదిలీ చేసింది. హెచ్‌డీఎ్‌ఫసీ లైఫ్‌ సైతం కీలకమైన అప్లికేషన్లను ఏడబ్ల్యూఎ్‌సకు బదలీ చేసింది.
 
డీఎ్‌సపీ ఇన్వె్‌స్టమెంట్‌ మేనేజర్స్‌ 2019 లో 50 అప్లికేషన్లను '''ఏడబ్ల్యూఎస్'''‌ క్లౌడ్‌ ద్వారా నిర్వహిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన యప్‌ టీవీ ఓవర్‌-ద-టాప్‌ (ఓటీటీ) సేవలకు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ సేవలను ఎంచుకుంది.  దేశంలోని అనేక స్టార్ట్‌పలు, చిన్న, మధ్య స్థాయి వ్యాపార సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలు, విద్యా సంస్థలు, ఎన్‌జీఓలు ఏడబ్ల్యూఎస్‌ ఖాతాదారులుగా ఉన్నాయి.
 
==References==
<references />