పెడన: కూర్పుల మధ్య తేడాలు

చి చిన్న మార్పులు.
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 41:
 
===శ్రీ భద్రకాళీసమేత శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం===
స్థానిక బ్రహ్మపురంలోని ఈ ఆలయంలోని స్వామివారి వార్షిక ఉత్సవాలు, అంగరంగ వైభవంగా ప్రారంభమైనవి '''కర్ణోద్భవ ''' వంశీకులు నిర్వహించుచున్న ఈ ఉత్సవాలు ఐదు సంవత్సరాల అనంతరం పెడన గ్రామములో జరుగుచున్నవి. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాతోపాటు, ఉభయ గోదావరి జిల్లాలలో నివసించుచున్న ఆ వంశీకులు, పెక్కు సంఖ్యలో ఈ ఆలయానికి తరలి వచ్చారు. ఉదయం 11-25 కి ఆలయంలో అలుగు సంబరం మొదలైనది. దీనిలో భాగంగా భక్తులు విచిత్ర వేషధారణలతో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం వీరభద్రపురం నుండి ప్రభను ఊరేగింపుగా ఉత్సవ ప్రాంగణానికి తీసుకొని వచ్చారు. రాత్రి 9 గంటలకు నిప్పులగుండం అనంతరం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సవాలలో గరగ నృత్యాలు, అఘోరాల వేషధారణలు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచినవి. ఉత్సవ క్రతువులో ముగింపులో భాగంగా, 28వతేదీ సోమవారం ఉదయం 8-52 కి స్వామివారి కళ్యాణం నిర్వహించెదరు. అనంతరం భారీ అన్న సమారాధనకు కర్ణోద్భవ సంఘం ఏర్పాట్లు చేసింది. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని, పెడనలోని చేనేత, కలంకారీ పరిశ్రమలు మూడు రోజులు సెలవులు ప్రకటించినవి.
 
===శ్రీ భద్రావతీ సమేత భావనాఋషిస్వామివారి ఆలయం===
"https://te.wikipedia.org/wiki/పెడన" నుండి వెలికితీశారు