చిలకలూరిపేట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 189:
చిలకలూరిపేట నియోజకవర్గంలో మూడు మండలాలు ఉన్నాయి. అవి [[చిలకలూరిపేట మండలం|చిలకలూరిపేట]], [[యడ్లపాడు మండలం|యడ్లపాడు]], [[నాదెండ్ల మండలం|నాదెండ్ల]]. మొత్తం 1,98,069 వోట్లున్నాయి. పట్టణంలో విద్యాలయాలు, ధాన్యం మిల్లులు, పత్తి జిన్నింగు మిల్లులు, నూనె మిల్లులు, వాహనాల మరమ్మత్తు సంస్థలు ఎన్నో ఉన్నాయి. గణపవరములో అనేక వ్యాపార సంస్థలు మిల్లులు గలవు.
 
చిలకలూరిపేట వాహన నిర్మాణం, మరమ్మత్తులకు పేరు పొందిన స్థలం. వాహనాల బాడీ నిర్మాణానికి ఇది పెట్టింది పేరు. ఈ పని మీద రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు చిలకలూరిపేటకు వస్తూ ఉంటారు. వాహన రంగానికి సంబంధించిన ఇతర పనులైన రంగులు వేయుట, సీట్లు తయారుచేయుట మొదలైన వాటిలో కూడా నిష్ణాతులైన పనివారు ఇక్కడ కనిపిస్తారు. పాత బ్యారన్ సామానులు లభించును.
 
చిలకలూరిపేటలో శ్రీ ఊసా శబరీనాథ్ అను ఒక అంతర్జాతీయ చౌక్ బాల్ క్రీడాకారుడు ఉన్నారు. 2014, నవంబరు-28 నుండి 30 వరకు, నేపాల్ రాజధాని [[కాఠ్మండు]] నగరంలో, భారత్, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ దేశాల మధ్య చౌక్ బాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ఈయన భారదేశం జట్టు వైస్ కెప్టెనుగా పాల్గొని, తన ప్రతిభతో భారత జట్టు విజయానికి తోడ్పడినారు. ఈ పోటీల ఫైనల్సులో భారత జట్టు బంగ్లాదేశ్ జట్టుపై 25 పాయింట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. [1]
 
శ్రీ ఆలూరి సాయికిరణ్:- వీరు ఎత్తయిన పర్వతలు అధిరోహించి, పెద్ద '''పర్వాతారోహకులు '''గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2020, ఆగష్టు-15 న "గిన్నెస్ ఆఫ్ వర్ల్డ్ రికార్డ్" సంస్థ వారు, మౌంటెనీరింగ్ కు సంబంధించి, ఫేస్ బుక్ లో, ఒక గంటలో ఫొటోలు అప్ లోడ్ చేయాలని సూచించగా, వీరు మౌంటెనీరింగ్‌లో తన సాహసాలకు సంబంధించిన 995 ఫొటోలను అప్‌లోడ్ చేసి, గిన్నెస్ బుక్ ఆఫ్ వర్ల్డ్ రికార్డ్శ్‌లో తమ పేరు నమోదు చేయించుకున్నారు. దీనికి సంబంధించిన ప్రశంసా పత్రాన్ని వీరు, 21-11-2020 న అందుకున్నారు. [2]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/చిలకలూరిపేట" నుండి వెలికితీశారు