జాన్ జాక్విస్ రూసో: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 21:
=== రూసో సిద్ధాంతాలు===
'''మానవ స్వభావము'''
 
రూసో అభిప్రాయములో మానవుడి స్వభావములో రెండు ప్రధాన గుణాలున్నాయి. అవి ఆత్మరక్షణ, సాంఘిక స్వభావము. సమూహంలో జీవించాలనే కోరిక సాంఘిక స్వభావము నుంచి జనిస్తుంది. అదిలేకపోయినట్లయితే మానవుని జీవితం దుర్భరం అయ్యేది. ఆత్మరక్షణ, ఇతరుల పట్ల సానుభూతి ఈ రెండూ ఒక్కొక్కప్పుడు పరస్పరం ఘర్షణ పడే సందర్భాలు ఏర్పడవచ్చును అంటాడు రూసో. కుటుంబ శ్రేయస్సుకోసం ఉన్న ఆతృత సమాజ ప్రయోజనంకోశం చేయవలసిన ప్రయత్నాన్ని పరిమితం చేయొచ్చు; లేదా వ్యతిరేకించవచ్చును.అందువలన ఇటువంటి విభిన్న ప్రయోజనాల మర్ధ స్పర్ధకు దారితీస్తాయి. అందువలన వీటిమధ్య రాజీ ఏర్పరచడానికి మానవుడు ప్రయత్నిస్తాడు. ఇటువంటి రాజీ ఫలితంగానే మరొక భావం ఎర్పడుతుంది. దానిని అంతరాత్మ అంటాడు. ఇది మానవుడికి ఏది మంచి ఏది చేడు అనేది చెప్పదు. ఏడి మంచి అని మానవుడు తెలుసుకుంటాడో దానిని చేయమని అంతరాత్మ ప్రోత్సహిస్తుంది. మంచిని మానవుడు మరొక భావం ద్వారా తెలుసుకుంటాడు.ఆ భవమే హేతువు(Reason). ఏమి చేయవలెనో హేతువు మానవునికి చెబుతుంది. అయితే అతనిని ఆపని చేయటానికి పూర్తిగా పురికొల్పలేదు. అతనిచే మంచి పని చేయించగలిగేది ఒక్క అంతరాత్మ మాత్రమే. మానవుడు వివేకంచే పరిపూర్ణుడు కాగలడు.అయితే వివేకం అతనిని పూర్తిగా ప్రభావైతం చేయలేదు.అతనిని కార్యోన్ముఖుని చేయడానికి కొంత ప్రేరణ లేదా ఉద్యేగం అవసరం. మానవుడు పూర్తిగా హేతుబద్ధంగా వ్యవహరించడానికి, మానసిక భావాలు, ఉద్రేకాలు, రాగద్వేషాలు అతనిని కార్యాచరణకు ప్రోత్సహిస్తాయని, మానవ సంబంధాలలో రాగద్వేషాల ప్రాముఖ్యాన్ని వివరించిన రాజనీతి తత్త్వవేత్త రూసో.
 
'''స్వేచ్చ'''
 
ప్రాకృతిక వ్యవస్థ(State of Nature) మానవుడు స్వేచ్ఛా జీవి. అంటే మనకు కావలసిన జీవన విధానాన్ని ఎంచుకోవటం.అదే జంతువులనుండి వేరు చేస్తుంది. అందువల్ల రూసో Social Contract అనే ఉపోద్ఘాతములో మనవుడు జన్మత: స్వేచ్చా జీవి అని ప్రకటిస్తాడు.రూసో స్వేచ్చకు స్వాతంత్ర్యానికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాడు. స్వాతంత్ర్యం ఎటువంటి చట్టాలకు పరిమితం కాదు.ఇది ఒకరకమైన అపరిమితమన స్వేచ్చ. విధులు లేని హక్కులు ఒకరకమైన అరజకాన్ని సృష్టిస్తాయి. ఇది మానవ ప్రగతిలో మొదటి దశ. దీని తరువాత రెండవ దశ పౌర సమజము. ఇందులో చట్టం అనే పరిధిలో స్వేచ్చను అనుభవిస్తాడు.ఇదే ప్రాకృతిక వ్యవస్థ.మానవుడు తన ఇచ్చను చట్టాన్ని, చట్టంద్వారా హేతువుకు అనుగుణంగా రూపొందించుకున్నప్పుడే అతడు నిజమైన స్వేచ్చను అనుభవిస్తాడు.వ్యత్కి ఇచ్చను సంఘ శ్రేయస్సుతో ఏవిధంగా సమ
న్వయం చేయాలనేది ఒక ప్రధాన ప్రశ్న అంటాడు రూసో. Man is born fre, but every where he is in chains. మానవుడు స్వేచ్చా జీవిగా జన్మించినా అతడు
Line 29 ⟶ 31:
 
'''సాంఘిక ఒడంబడిక'''
 
సంఘంలో ప్రతి సభ్యుడు తన హక్కులు, అధికారాలను మొత్తం సమాజానికి అర్పించాలి. సమాజ శ్రేయస్సుకోసం కృషి చేయాలి. ప్రతి వ్యకికి వ్యక్తిగతమైన కొన్ని స్వెచ్చలు ఉండాలి. సాంఘిక ఒడంబడిక అభికారులకు సభ్యులకు మధ్య సముచితంగా ఉండాలి. ఒడంబడిక వలన ఏర్పడినది ఒక సజీవమైన సమాజం అయి ఉండాలి. రూసో మానవుని ఒక వ్యక్తిగా కాక ఒక పౌరునిగా భావిస్తాడు.రాజకీయాధికారికి పౌరుడు నైతిక కారణాల వలన బద్దుడౌతాడు.Political Obligation.
 
'''జనేచ్చ సిద్ధాంతం''''
రూసో ప్రతిపాదించిన జనేచ్చ (General Will) సిద్ధాంతం అతని రాజకీయ భావాలలో అత్యంత ప్రధానమైనది. రాజకీయాధికారం ప్రయోజనం, అధికారం ఏర్పడే పద్దతులకంటె రాజకీయాదికారానికి మానవుడు ఎందుకు బద్ధుడై ఉంటాడన్న ప్రశ్నను రూసో ప్రధానంగా చర్చిస్తాడు. రాజకీయాధికారాన్ని మానవులు కొన్ని పరిమిత ప్రయోజనాలను సాధించటానికి మాత్రమే రూపొందించుకోలేదు.పౌర సమాజం ప్రజలందరి సమ్మతిపై ఏర్పడుతుంది. దీనికి సభ్యులందరిని శాసించే అధికారం ఉంది. వీరు సమాజం ఆధిపత్యాన్ని అంగీకరిస్తారు. అధికారాన్ని శిరసావహిస్తారు. రాజకీయాధికారాన్ని ఎందుకు పౌరులు అంగీకరిస్తారు అనేదాని సంధానం రూసో తన జనేచ్ఛ సిద్ధంతంలో కనిపిస్తుంది.వ్యక్తిగత స్వేచ్ఛ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వాస్తవ ఇచ్చ (Actual Will), రెండు నిజమైన ఇచ్ఛ (Real Will). వాస్తమికమైన ఇచ్చ వ్యక్తిని కేవలం తన ప్రయోజనాలను మాత్రమే సాధించేటట్లు చేస్తుంది. నిజమైన ఇచ్చ తత్త్కాలిక ప్రయోజనాలను అదుపులో ఉంచి పరిపూర్ణతను సాధించుకొని, నైతిక ఔన్నత్యాన్ని పెంపొందించుకోమని చెబుతుంది. ప్రతివ్యక్తి తన నిజమైన ఇచ్చద్వారా ప్రభావితుడైనప్పుడు అటువంటి మొత్తం ప్రజల జనేచ్చగా రూపొందుతుంది. జనేచ్చ అంటే ప్రజల ఇచ్చ కాదు లేదా అధిక సంఖ్యాకుల ఇచ్చ కాదు. ప్రతివ్యక్తి ప్రయోజనాన్ని సాధించే ఇచ్చగా మొత్తం సమాజ ప్రయోజనాన్ని కాపాడే ఇచ్చగా జనేచ్చ రూపొందుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/జాన్_జాక్విస్_రూసో" నుండి వెలికితీశారు