"మత్తు వదలరా (2019 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

 
'''మత్తు వదలరా''' 2019, డిసెంబరు 24న విడుదలైన [[తెలుగు]] కామెడీ థ్రిల్లర్ [[సినిమా]]. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాణ సారథ్యంలో రితేష్ రానా<ref>{{Cite web|url=https://www.firstpost.com/entertainment/mathu-vadalara-movie-review-ritesh-ranas-thriller-is-a-superb-blend-of-suspense-and-comedy-7827101.html|title=Mathu Vadalara movie review: Ritesh Rana's thriller is a superb blend of suspense and comedy|last=Kumar|first=Hemanth|date=2019-12-26|website=Firstpost|language=en|url-status=live|access-date=2020-11-29}}</ref> తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రంలో శ్రీ సింహా, నరేష్ అగస్త్య, అత్యుల చంద్ర, సత్య,  [[బ్రహ్మాజీ]], [[వెన్నెల కిషోర్]] తదితరులు నటించగా,<ref>{{Cite news|last=Dundoo|first=Sangeetha Devi|url=https://www.thehindu.com/entertainment/reviews/mathu-vadalara-review-a-partly-comic-partly-trippy-thriller-from-a-new-team/article30394845.ece|title='Mathu Vadalara' review: Till 'meth' does us apart|date=2019-12-25|work=The Hindu|access-date=2020-11-29|language=en-IN|issn=0971-751X}}</ref> కాల భైరవ సంగీతం అందించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమై,<ref name="budget">{{Cite web|url=https://www.ibtimes.co.in/must-know-heres-what-helped-rajamoulis-nephews-succeed-box-office-mathu-vadalara-810918|title=Must know! Here's what helped Rajamouli's nephews succeed at box office with Mathu Vadalara|last=Sharma|first=Bhavana|date=2019-12-29|website=International Business Times, India Edition|language=english|access-date=2020-11-29}}</ref> మంచి సమీక్షలు కూడా అందుకుంది.<ref>{{Cite news|last=Pathi|first=Thadhagath|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/mathu-vadalara/movie-review/72965795.cms|title=Mathu Vadalara Movie Review: A perfect thriller which makes the audience glued to their seats and also spills some laughs.|date=25 December 2019|work=The Times of India|access-date=2020-11-29|url-status=live}}</ref> ఈ చిత్ర ప్రదర్శనకోసం [[హైదరాబాదు]]లో మరికొన్ని థియేటర్లు కూడా ఇచ్చారు.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/mathu-vadalara-gets-new-screens-and-shows/articleshow/73008809.cms|title='Mathu Vadalara' gets new screens and shows|work=The Times of India|date=28 December 2019|author=Neeshita Nyayapati}}</ref>
 
== కథా నేపథ్యం ==
బాబూ మోహన్ (శ్రీ సింహా), ఏసుదాస్ (సత్య), అభి (అగస్త్య) ముగ్గరూ స్నేహితులు. బాబూ మోహన్‌కి కాస్త అతి నిద్ర. ఈ లక్షణాల్లో భాగంగా.. అలుపు, అసహనం, ఆగ్రహం, ఆరాటం, మతిభ్రమణం లాంటివి ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇతను తన మిత్రుడు ఏసుదాస్‌తో కలిసి డెలివరీ బాయ్‌గా పనిచేస్తుంటాడు. నెల మొత్తం కష్టపడి పనిచేసినా నాలుగైదు వేలు కంటే ఎక్కువ సంపాదించలేకపోవడంతో ఏసుదాస్ సలహాతో తెలివిగా ‘తస్కరించుట’ అనే పద్దతి ద్వారా కస్టమర్లను మోసం చేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు.
 
ఈ ప్రయత్నంలో భాగంగా ఆర్డర్ ఇవ్వడానికి ఒక అపార్ట్‌మెంట్‌కి వెళ్లి అక్కడ క్రైమ్‌లో ఇరుక్కుంటాడు. అక్కడ జరిగిన మర్డర్స్‌కి బాబూ మోహన్ తనకు ఉన్న అతి నిద్ర వ్యాధి లక్షణాల వల్ల బాధ్యత వహించాల్సి వస్తుంది. నిద్ర నుండి కోలుకున్న తరువాత బాబూ మోహన్ ఈ మిస్టర్ మిస్టరీ నుండి ఎలా బయటపడ్డాడు. అసలు ఆ హత్యలు చేసింది ఎవరు? తెర వెనక ఈ కథను ఎవరు నడిపించారు? అసలు నిందితులు ఎవరు అన్నదే ‘మత్తు వదలరా’ మిగిలిన కథ.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3063396" నుండి వెలికితీశారు