మహాశయ్ ధరమ్‌పాల్ గులాటి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
ధరమ్ పాల్ గులాటి ప్రస్తుత పాకిస్తాన్ లోని సియాల్ కోట్ లో 27 మార్చి 1923న జన్మించారు. ఆయన తండ్రి MDH స్థాపకుడు మహాషాయ్ చున్నీ లాల్ గులాటీ. ఆయన కుటుంబం భారత విభజన సమయంలో భారతదేశానికి వలస వచ్చారు. ఆ కుటుంబం కొంత సమయం అమృత్ సర్ లోని శరణార్థి శిబిరంలో గడిపి, తరువాత పని వెతుక్కుంటూ ఢిల్లీకి తరలివెళ్లారు.
 
ఢిల్లీలో గులాటీ కరోల్ బాగ్ లో మసాలా దుకాణం ప్రారంభించాడు. 1953లో చాందిని చౌక్ లో రెండో షాపును అద్దెకు తీసుకున్నాడు . 1959లో గులాటి, మహషియన్ డి హట్టి యొక్క తయారీ పరిశ్రమ ను ఏర్పాటు చేయడానికి న్యూఢిల్లీలోని కీర్తి నగర్ లో భూమిని కొనుగోలు చేసాడు .<ref name=":0">{{Cite news|url=https://economictimes.indiatimes.com/industry/cons-products/fmcg/fmcgs-highest-paid-ceo-is-a-94-year-old-school-drop-out/articleshow/56608104.cms|title=FMCG sector's highest paid CEO was a 94-year-old school drop-out|last=Malviya|first=Sagar|date=17 January 2017|work=The Economic Times|access-date=1 March 2019}}</ref> అక్కడి నుంచి ధరంపాల్ ఎండీహెచ్ మసాలాల బ్రాండును తయారు చేశాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి కోట్లాది రూపాయలు టర్నోవర్ సాధించాడు. ప్రస్తుతం భారతదేశంలో ఇది ప్రముఖ మసాలా కంపెనీ.
 
2017 నాటికి, గులాటి భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్ కంపెనీకి CEO గా ఉన్నాడు .ఆ ఆర్థిక సంవత్సరంలో రూ .21 కోట్లకు పైగా జీతం తీసుకున్నాడు.<ref name=":0">{{Cite news|url=https://economictimes.indiatimes.com/industry/cons-products/fmcg/fmcgs-highest-paid-ceo-is-a-94-year-old-school-drop-out/articleshow/56608104.cms|title=FMCG sector's highest paid CEO was a 94-year-old school drop-out|last=Malviya|first=Sagar|date=17 January 2017|work=The Economic Times|access-date=1 March 2019}}</ref> ఈయన చదువు 5వ త‌ర‌గ‌తి మ‌ధ్య‌లో మానేసినా<ref>{{Cite web|url=https://telugu.ap2tg.com/this-man-studied-5th-but-taking-highest-salary-for-ceo-post/|title=చ‌దివింది 5వ త‌ర‌గ‌తి...ఇప్పుడు ఆయ‌న జీతం 21 కోట్లు.!|date=2017-01-19|website=Ap2tg Telugu|language=en-US|access-date=2020-12-03}}</ref> భారతదేశంలోనే ఎక్కువ జీతం తీసుకుంటున్న సీఈవోగా పేరుపొందారు,దాదాపు 100 దేశాలకు ఎండీహెచ్‌ కంపెనీ తయారుచేసిన ఉత్పత్తులని ఎగుమతి చేస్తున్నారు.భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే రెండవ స్పైసెస్‌ బ్రాండ్‌గా ఎండీహెచ్‌ గుర్తింపు పొందింది<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/business/reports-mahashay-dharampal-death-wrong-1123560|title=ఆయన చనిపోలేదు.. అవన్నీ రూమర్లు!|date=2018-10-07|website=Sakshi|language=te|access-date=2020-12-03}}</ref>.