కన్నడ ప్రభాకర్: కూర్పుల మధ్య తేడాలు

మూలాల్లో తేది సవరణలు
ట్యాగు: 2017 source edit
మూలాల్లో సవరణలు
ట్యాగు: 2017 source edit
పంక్తి 22:
ప్రభాకర్ 1950, మార్చి 30 న అప్పటి [[మైసూరు]] రాష్ట్రంలో [[బెంగుళూరు]]లోని ఫ్రేజర్ టౌన్ లో జన్మించాడు. ప్రభాకర్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మొదటి పెళ్ళి ద్వారా భారతి, గీత, మరో కొడుకును పొందాడు. రెండో సారి నటి [[జయమాల]]ను వివాహమాడాడు. వీరికి సౌందర్య అనే కూతురు. ఆమెతో విడాకులు తీసుకున్నాక అంజు అనే మరో నటిని వివాహం చేసుకున్నాడు. ఆమె ద్వారా అర్జున్ అనే కొడుకు కలిగాడు. తర్వాత ఆమె కూడా విడాకులు తీసుకున్నది. నటుడిగా తీరికలేకుండా ఉన్నపుడు కొన్ని సంస్థలకు దానాలు చేశాడు. రాజకీయంగా ఎదగాలనుకున్నాడు కానీ అవి కార్యరూపం దాల్చలేదు.
 
1980 దశకం మధ్యలో ప్రభాకర్ కు ఒక బైక్ ప్రమాదం జరిగింది. దాంతో అతని ఆరోగ్యం దెబ్బతిన్నది. దీని కారణంగానే 2000 మొదట్లో అతనికి ''మల్టిపుల్ ఆర్గాన్ డిస్ఫంక్షన్'' అనే వ్యాధి చుట్టు ముట్టింది.<ref>{{cite web |title= My Dad Prabhakar Did not Die of Gangrene: Vinod Prabhakar |url= http://www.chitraloka.com/interviews/11793-my-dad-prabhakar-did-not-die-of-gangrene-vinod-prabhakar.html |publisher= ''chitraloka.com'' |date= 8 April 2015 |accessdate= 9 April 2015 |website= |archive-url= https://web.archive.org/web/20150411062432/http://www.chitraloka.com/interviews/11793-my-dad-prabhakar-did-not-die-of-gangrene-vinod-prabhakar.html |archive-date= 11 April 2015 |url-status= dead }}</ref> చివరగా 2001 మార్చి 25 న రాత్రి 9:45 గంటలకు బెంగుళూరులో మాల్యా ఆసుపత్రిలో కన్నుమూశాడు.<ref>{{cite web |title= Tiger Prabhkar Dead |url= http://www.chitraloka.com/flash-back/3218-tiger-prabhkar-dead.html |publisher= ''chitraloka.com'' |date= 25 March 2001 |accessdate= 10 November 2014 |website= |archive-url= https://web.archive.org/web/20141206152009/http://www.chitraloka.com/flash-back/3218-tiger-prabhkar-dead.html |archive-date= 6 December 2014 |url-status= dead }}</ref>
 
== కెరీర్ ==
ప్రభాకర్ మొదటగా ఒకలో బడ్జెట్ చిత్రంలో ప్రతినాయకునిగా నటుడిగా తన ప్రస్థానం ప్రారంభించాడు.<ref name="TOI">{{cite news |title= This fighter finally met his match |url= http://timesofindia.indiatimes.com/city/bangalore/This-fighter-finally-met-his-match/articleshow/35859915.cms? |publisher= ''The Times of India'' |date= 28 March 2001}}</ref> అతని మొదటి సినిమా ''కాడిన రహస్య''. నెమ్మదిగా స్టంటు, యాక్షన్, థ్రిల్లర్ సినిమాల్లో నటించడం ప్రారంభించాడు. ''హుళి హెజ్జె''అనే సినిమాలో అతను నిజం పులితో పోరాటం చేయడంతో అభిమానులు అతన్ని ''టైగర్ ప్రభాకర్'' అని ముద్దుగా పిలుచుకుంటారు.
 
బాగా గుర్తింపు వచ్చిన తర్వాత [[తెలుగు]], [[తమిళ]], [[మలయాళ]], [[హిందీ]] సినిమాల్లో కూడా నటించడం ప్రారంభించాడు. తెలుగు సినిమాల్లో, ఎక్కువగా చిరంజీవి సినిమాల్లో ప్రతినాయకునిగా నటించడంతో తెలుగు ప్రేక్షకులు ఇతన్ని కన్నడ ప్రభాకర్ గా గుర్తించసాగారు.
"https://te.wikipedia.org/wiki/కన్నడ_ప్రభాకర్" నుండి వెలికితీశారు