కన్నౌజ్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Fixing broken redirect to moved target page కనౌజ్ జిల్లా
ట్యాగు: దారిమార్పు లక్ష్యాన్ని మార్చారు
"Kannauj" పేజీని అనువదించి సృష్టించారు
ట్యాగులు: దారిమార్పును తీసేసారు విశేషణాలున్న పాఠ్యం వ్యాసాల అనువాదం ContentTranslation2
పంక్తి 1:
 
#దారిమార్పు [[కనౌజ్ జిల్లా]]
{{Infobox settlement
| name = Kannauj
| population_density_km2 = auto
| unit_pref = Metric
| area_footnotes =
| area_total_km2 =
| area_rank =
| elevation_footnotes =
| elevation_m = 139
| population_total = 84,862
| population_as_of = 2011
| population_footnotes =
| population_rank =
| government_type =
| population_demonym =
| demographics_type1 = Languages
| demographics1_title1 = Official
| timezone1 = [[Indian Standard Time|IST]]
| utc_offset1 = +5:30
| postal_code_type = <!-- [[Postal Index Number|PIN]] -->
| postal_code = 209725
| registration_plate = UP-74
<!-- unsupported | Colleges and Universities = [[Government Medical College, Kannauj]], [[Government Engineering College, Kannauj]] -->| website = {{URL|www.kannauj.nic.in}}
| footnotes =
| governing_body =
| named_for =
| native_name =
| pushpin_label_position = right
| native_name_lang =
| settlement_type = City
| image_skyline = Goddess Annapurna Temple ,tirwa town,stateUttar Pradesh.jpg
| image_alt =
| image_caption =
| nickname = ''Perfume Capital of India''
| map_alt =
| map_caption =
| pushpin_map = India#India Uttar Pradesh
| pushpin_relief = yes
| pushpin_map_alt =
| founder =
| pushpin_map_caption =
| coordinates = {{coord|27.07|N|79.92|E|display=inline,title}}
| subdivision_type = Country
| subdivision_name = {{flag|India}}
| subdivision_type1 = [[States and territories of India|State]]
| subdivision_type2 = [[List of districts of India|District]]
| subdivision_name1 = [[Uttar Pradesh]]
| subdivision_name2 = [[Kannauj district|Kannauj]]
| established_title = <!-- Established -->
| established_date =
| demographics1_info1 = [[Hindi language|Hindi, Urdu]]
}}
'''కన్నౌజ్''', [[ఉత్తరప్రదేశ్|ఉత్తర ప్రదేశ్]], [[కనౌజ్ జిల్లా|కన్నౌజ్ జిల్లా]] లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలనను మునిసిపల్ బోర్డు చేస్తుంది. చారిత్రికంగా ఈ పట్టణానికి ''కన్యాకుబ్జం'' అని పేరు. కాలక్రమేణా అదే ప్రస్తుత రూపానికి మారింది. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=2Tnh2QjGhMQC&pg=PA2|title=History of Kanauj: To the Moslem Conquest|last=Rama Shankar Tripathi|publisher=Motilal Banarsidass Publ|year=1989|isbn=978-81-208-0404-3|page=2|id=}}</ref> 9 వ శతాబ్దంలో గుర్జర-ప్రతీహార చక్రవర్తి మిహిర భోజుడీ కాలంలో దీనిని ''మహోదయ'' అని కూడా పిలిచేవారు.
 
కన్నౌజ్ ఒక పురాతన నగరం. [[భారతదేశ మధ్యకాల రాజ్యాలు|మధ్యయుగ భారత దేశంలో]] ఇది వివిధ భారతీయ రాజవంశాల రాజధానిగా ఉండేది. మొట్టమొదటిది మౌఖరీ రాజవంశం క్రింద ఉండేది. ఆ తరువాత, [[పుష్యభూతి రాజవంశం|వర్ధన రాజవంశానికి]] చెందిన [[హర్షవర్థనుడు|హర్ష వర్ధనుడి]] పాలనలో ఉండేది. <ref name="Tripathi, p.192">Tripathi, ''History of Kanauj'', p.192</ref> 7 - 11 వ శతాబ్దాల మధ్య, కన్నౌజ్ త్రైపాక్షిక పోరాటాలకు కేంద్రంగా మారింది. ఇది [[పాల సామ్రాజ్యం]], [[రాష్ట్రకూటులు|రాష్ట్రకూట సామ్రాజ్యం]], [[గుర్జరా - ప్రతిహరా రాజవంశాలు|గుర్జర-ప్రతీహార సామ్రాజ్యం]] ఈ మూడింటి మధ్య పోరాటాలు రెండు శతాబ్దాలకు పైగా కొనసాగాయి. తరువాత నగరం, గహదవల వంశీకుడైన గోవిందచంద్రుని పాలన లోకి వచ్చింది. అతడి పాలనలో కన్యాకుబ్జం "అపూర్వమైన కీర్తి" ని అందుకుంది.
 
అయితే, [[ఢిల్లీ సల్తనత్|ఢిల్లీ సుల్తానుల]] విజయాలతో కన్నౌజ్ ప్రాభవం అంతరించింది.
 
కన్నౌజ్ అత్తరుల తయారీకి ప్రసిద్ధి చెందింది. ఇది ''భారతదేశ పరిమళ ద్రవ్యాల రాజధాని'' అంటారు. సాంప్రదాయక కన్నౌజ్ పెర్ఫ్యూమ్కు భౌగోళిక గుర్తింపు ఉంది. <ref name="perfume">{{Cite web|url=http://www.taipeitimes.com/News/feat/archives/2012/09/20/2003543194|title=Life: India's perfume capital threatened by scent of modernity|publisher=The Taipei Times|access-date=10 February 2016}}</ref> కన్నౌజ్‌లో 200 కంటే ఎక్కువ పెర్ఫ్యూమ్ తయరీ కర్మాగారా లున్నాయి. పొగాకు, ''అత్తరు'' ( పెర్ఫ్యూమ్ ), రోజ్ వాటర్ లకు కన్నౌజ్ మార్కెట్ ప్రదేశం. [[హిందుస్తానీ భాష|హిందూస్థానీ]] భాషకు చెందిన ''కన్నౌజీ'' మాండలికానికి ఆ పేరు ఈ పట్టణం పేరు మీదుగానే వచ్చింది.
 
== చరిత్ర ==
 
=== ప్రారంభ చరిత్ర ===
పురావస్తు పరిశోధనల ప్రకారం, [[బూడిదవర్ణ పాత్రాసంస్కృతి|పెయింటెడ్ గ్రే వేర్]] సంస్కృతికి చెందిన ప్రజలు సా.పూ. 1200-600 కాలం లోను, నార్తర్న్ బ్లాక్ పాలిష్ వేర్ సంస్కృతికి చెందిన ప్రజలు సా.పూ. 700-200 కాలం లోనూ కన్నౌజ్ ప్రాంతంలో నివసించినట్లు తెలుస్తోంది.<ref>Dilip K. Chakrabarti (2007), ''Archaeological geography of the Ganga plain: the upper Ganga (Oudh, Rohilkhand, and the Doab)'', p.47</ref> . కన్యాకుబ్జం పేరుతో, హిందూ పురాణాలు, [[మహాభారతం]], [[రామాయణము|రామాయణాలలో]] ఈ పట్టణ ప్రస్తావన ఉంది. వ్యాకరణవేత్త పతంజలి (క్రీ.పూ. 150). <ref>Rama S. Tripathi, ''History of Kanauj: To the Moslem Conquest'' (Motilal Banarsidass, 1964), pp.2,15-16</ref> ప్రారంభ బౌద్ధ సాహిత్యంలో కనౌజ్‌ను ''కన్నాకుజ్జ'' పేరుతో పేర్కొన్నారు. [[మథుర]] నుండి [[కాశీ|వారణాసి]], [[రాజగిరి]] లకు ఉన్న వాణిజ్య మార్గంలో దాని స్థానాన్ని సూచిస్తుంది . <ref>Moti Chandra (1977), ''Trade Routes in Ancient India'' pp.16-18</ref>
 
కన్నౌజ్ గ్రీకో-రోమన్ నాగరికతకు కనగోరా లేదా కనోగిజా పేరుతో తెలిసి ఉండవచ్చు, ఇది టోలెమీ (సుమారుగా 140 CE) రాసిన ''జాగ్రఫీలో'' ఇది కనిపిస్తుంది. కానీ ఈ గుర్తింపు ధృవీకరించబడలేదు. సా.శ ఐదవ ఏడవ శతాబ్దాలలో చైనా బౌద్ధ ప్రయాణికులు [[ఫాహియాన్|ఫాక్సియన్]], [[యుఁఆన్‌ చ్వాంగ్‌|జువాన్జాంగ్]] లు కన్నౌజ్‌ను సందర్శించారు. <ref>Tripathi, ''History of Kanauj'', pp.17-19</ref>
[[దస్త్రం:Maukharis_of_Kanauj._Isanavarman._Circa_AD_535-553.jpg|thumb|250x250px| మహారాజా ఈశానవర్మ ఆధ్వర్యంలో కన్నౌజ్ మౌఖారీల నాణెం, సిర్కా 535-553 CE.]]
[[దస్త్రం:Harshavardhana_Circa_AD_606-647.jpg|thumb|250x250px| [[పుష్యభూతి రాజవంశం|వర్ధన రాజవంశ]] [[హర్షవర్థనుడు|చక్రవర్తి హర్షుడి]] నాణెం, సిర్కా 606-647 CE. <ref>{{Cite web|url=https://www.cngcoins.com/Coin.aspx?CoinID=261204|title=CNG: eAuction 329. INDIA, Post-Gupta (Ganges Valley). Vardhanas of Thanesar and Kanauj. Harshavardhana. Circa AD 606-647. AR Drachm (13mm, 2.28 g, 1h).|website=www.cngcoins.com}}</ref>]]
కన్నౌజ్ [[గుప్త సామ్రాజ్యము|గుప్త సామ్రాజ్యంలో]] భాగంగా ఉండేది. 6 వ శతాబ్దంలో గుప్త సామ్రాజ్యం క్షీణించిన సమయంలో, కన్నౌజ్‌కుచ్ చెందిన మౌఖరీ రాజవంశం - గుప్తుల క్రింద సామంతులుగా ఉండేవారు. కేంద్ర అధికారం బలహీనపడినపుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వతంత్రులయ్యారు. ఉత్తర భారతదేశంలోని పెద్ద ప్రాంతాలపై నియంత్రణను సాధించారు. <ref>Tripathi, ''History of Kanauj'', pp.22-24</ref>
 
మౌఖరీల క్రింద, కన్నౌజ్ ప్రాముఖ్యత, సంపద పెరుగుతూనే ఉంది. [[పుష్యభూతి రాజవంశం|వర్ధన రాజవంశ]] చక్రవర్తి హర్షుడు దాన్ని జయించి తన రాజధానిగా చేసుకున్నాడు. అతడి పాలనలో (సా.శ .606 నుండి 647 వరకు) ఇది ఉత్తర భారతదేశపు గొప్ప నగరంగా అవతరించింది. <ref>Tripathi, ''History of Kanauj'', p.147</ref> <ref>James Heitzman, ''The City in South Asia'' (Routledge, 2008), p.36</ref> చైనా యాత్రికుడు [[యుఁఆన్‌ చ్వాంగ్‌|జువాన్జాంగ్]] హర్షుడి పాలనలో భారతదేశాన్ని సందర్శించాడు. కన్నౌజ్ అనేక బౌద్ధ మఠాలతో కూడిన పెద్ద, సంపన్న నగరమని అతడు అభివర్ణించాడు. <ref>Heizman, ''The City in South Asia'', pp.36-37</ref> హర్షుడు నిస్సంతుగా మరణించాడు. ఫలితంగా మన్నారాజా యశోవర్మ కన్నౌజ్ పాలకుడిగా అధికారాన్ని చేజిక్కించుకునే వరకు అధికారంలో శూన్యత ఏర్పడింది. <ref name="Tripathi, p.192">Tripathi, ''History of Kanauj'', p.192</ref>
 
=== కన్నౌజ్ త్రికోణం ===
కన్నౌజ్ 8 -10 వ శతాబ్దాల మధ్య మూడు శక్తివంతమైన రాజవంశాలైన [[గుర్జరా - ప్రతిహరా రాజవంశాలు|గుర్జర ప్రతీహారులు]], [[పాల సామ్రాజ్యం|పాల]], [[రాష్ట్రకూటులు|రాష్ట్రకూటుల]] మధ్య పోరాటాలకు కేంద్ర బిందువుగా మారింది. మూడు రాజవంశాల మధ్య సంఘర్షణను చాలా మంది చరిత్రకారులు త్రైపాక్షిక పోరాటం అని పిలుస్తారు. <ref name="Kannauj">{{Cite book|url=https://books.google.com/books?id=K7ZZzk8cXh8C&pg=PA9|title=Pratiyogita Darpan|publisher=Upkar Prakashan|page=9}}</ref> <ref name="R. C. Majumdar">{{Cite book|url=https://books.google.com/books?id=XNxiN5tzKOgC&pg=PA282|title=Ancient India|last=[[R.C. Majumdar]]|publisher=Motilal Banarsidass|year=1994|isbn=978-81-208-0436-4|pages=282–285|id=}}</ref>
[[దస్త్రం:Indian_Kanauj_triangle_map.svg|ఎడమ|thumb|113x113px| కనౌజ్ మూడు సామ్రాజ్యాలకు కేంద్ర బిందువు: [[దక్కన్ పీఠభూమి|దక్కను]] లోని [[రాష్ట్రకూటులు]], మాల్వా లోని గుర్జర ప్రతీహారులు, [[బెంగాల్]] లోని [[పాల సామ్రాజ్యం|పాలులు]] .]]
త్రైపాక్షిక పోరాటాల్లో చివరికి గుర్జర ప్రతీహారులు నగరాన్ని నిలుపుకోవడంలో విజయం సాధించారు. <ref name="Kannauj">{{Cite book|url=https://books.google.com/books?id=K7ZZzk8cXh8C&pg=PA9|title=Pratiyogita Darpan|publisher=Upkar Prakashan|page=9}}</ref> గుర్జర-ప్రతీహారులు దక్షిణాన [[రాష్ట్రకూటులు|రాష్ట్రకూట సామ్రాజ్యం]], తూర్పున [[పాల సామ్రాజ్యం]] సరిహద్దులుగా ఉన్న [[అవంతి|అవంతిని]] ( ఉజ్జయినిలో ) పరిపాలించేవారు. గుర్జర-ప్రతీహార పాలకుడు వత్సరాజు చేతిలో ఇంద్రయుద్ధ ఓటమితో త్రైపాక్షిక పోరాటం ప్రారంభమైంది. [[పాల సామ్రాజ్యం|పాలా]] పాలకుడు ధర్మపాలుడు కూడా కనౌజ్‌పై పట్టు కోసం ఆసక్తి చూపడంతో అతడికీ వత్సరాజుకూ మధ్య పోరు జరిగింది. అందులో ధర్మపాలుడు ఓడిపోయాడు. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=7XliTyOXI5kC&pg=PA195|title=Compendium General Knowledge|last=Kumar Sundram|publisher=Upkar Prakashan|year=2007|isbn=978-81-7482-181-2|page=195|id=}}</ref> ఈ గందరగోళాన్ని సద్వినియోగం చేసుకొని, [[రాష్ట్రకూటులు|రాష్ట్రకూట]] పాలకుడు ధ్రువుడు ఉత్తరం వైపుకు దాడివెడలి, వత్సరాజను ఓడించి, కన్నౌజ్ ను హస్తగతం చేసుకున్నాడు. దానితో ఈ దక్షిణ భారత పాలకుడు తన ఉత్తరదేశ దండయాత్ర ముగించాడు. <ref name="R. C. Majumdar">{{Cite book|url=https://books.google.com/books?id=XNxiN5tzKOgC&pg=PA282|title=Ancient India|last=[[R.C. Majumdar]]|publisher=Motilal Banarsidass|year=1994|isbn=978-81-208-0436-4|pages=282–285|id=}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/books?id=K7ZZzk8cXh8C&pg=PA7|title=Pratiyogita Darpan|publisher=Upkar Prakashan}}</ref>
 
[[రాష్ట్రకూటులు|రాష్ట్రకూట]] పాలకుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళాక, కన్నౌజ్ కొంతకాలం పాటు ధర్మపాలుడి నియంత్రణలో ఉంది. రెండు ఉత్తర రాజవంశాల మధ్య మళ్ళీ పోరాటం కొనసాగింది: పాల చక్రాయుధుడు ప్రతీహార రెండవ నాగభట్టు చేతిలో ఓడిపోయాడు. కన్నౌజ్ మళ్ళీ గుర్జర ప్రతీహారుల చేతిలోకి వచ్చింది. ధర్మపాలుడు మళ్ళీ కనౌజ్ నియంత్రణ కోసం ప్రయత్నించాడు గానీ, ప్రతీహారుల చేతిలో ఓడిపోయాడు. <ref name="Kannauj">{{Cite book|url=https://books.google.com/books?id=K7ZZzk8cXh8C&pg=PA9|title=Pratiyogita Darpan|publisher=Upkar Prakashan|page=9}}</ref> అయితే, కొద్ది కాలం లోనే రెండవ ఉత్తర దండయాత్రను ప్రారంభించిన రాష్ట్రకూట రాజు రెండవ గోవిందుడి చేతిలో రెండవ నాగభట్టురెండవ నాగభట్టు ఓడిపోయాడు. ఈ ఓటమి తరువాత ప్రతీహార శక్తి కొంతకాలం క్షీణించింది. ధర్మపాలుడి మరణానంతరం రెండవ నాగభట్టు కన్నౌజ్‌పై పట్టు సాధించి తన ప్రతీహార సామ్రాజ్యానికి రాజధానిగా చేసుకున్నాడు. . ఈ కాలంలో, [[రాష్ట్రకూటులు]] అంతర్గత విభేదాలను ఎదుర్కొంటున్నందున వారు, దీనికి పోటీపడలేదు. ఆ విధంగా కన్నౌజ్‌ను ఆక్రమించిన తరువాత గుర్జర ప్రతీహారులు ఉత్తర భారతదేశంలో గొప్ప శక్తిగా నిలిచారు.
 
=== మధ్యయుగ కాలంలో ===
ఘజ్నికి చెందిన సుల్తాన్ మహమూద్ 1018 లో కనౌజ్‌ను స్వాధీనం చేసుకున్నాడు. చంద్రదేవ గహద్వాల రాజవంశాన్ని 1090 లో కనౌజ్ వద్ద రాజధానితో స్థాపించాడు. అతని మనవడు గోవిందచంద్ర కాలంలో కనౌజ్‌కు అపూర్వమైన కీర్తి కలిగింది. ముహమ్మద్ ఘోరి నగరానికి వ్యతిరేకంగా ముందుకు సాగి, 1193 నాటి చంద్వార్ యుద్ధంలో జయచంద్రను చంపాడు. ఇతర భారతీయ నగరాలకు ఉన్న దూరాన్ని వివరించడానికి అల్‌బెరూనీ "కనోజ్" ను కీలకమైన భౌగోళిక బిందువుగా పేర్కొన్నాడు (భారతదేశం, వాల్యూమ్ 1, పే 199 నుండి, డాక్టర్ ఎడ్వర్డ్ సి. సాచౌ చే అనువదించబడింది, లండన్ 1910). "కనౌజ్ కీర్తి" ఇల్టుట్మిష్ యొక్క విజయంతో ముగిసింది. {{Rp|21,32–33}}
 
1540 మే 17 న జరిగిన కనౌజ్ యుద్ధంలో [[షేర్ షా సూరి]], [[హుమాయూన్]]<nowiki/>ను ఓడించాడు
 
భారతదేశంలో ప్రారంభ ఆంగ్ల పాలనలో, నగరాన్ని వారు '''కానోడ్జ్''' అని పిలిచేవారు . నవాబ్ హకీమ్ మెహందీ అలీ ఖాన్, కన్నౌజ్ నగరాభివృద్ధికి చిహ్నంగా ఉంటూ వచ్చాడు . ఒక ఘాట్ ( [[iarchive:wanderingsofpilg02parluoft/page/16/mode/1up|మెహందీఘాట్]] ), ఒక సరాయ్ (ప్రయాణికులు, వ్యాపారుల ఉచిత బస కోసం నిర్మించిన సత్రం), పక్కా రహదారులనూ నవాబు నిర్మించాడు.
 
== భౌగోళికం ==
కనౌజ్ {{Coord|27.07|N|79.92|E|}} వద్ద <ref>[http://www.fallingrain.com/world/IN/36/Kannauj.html Falling Rain Genomics, Inc – Kannauj]</ref> సముద్ర మట్టం నుండి 139&nbsp;మీటర్ల ఎత్తున ఉంది.
 
== జనాభా ==
2001 భారత జనగణన ప్రకారం,<ref>{{Cite web|url=http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|title=Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)|publisher=Census Commission of India|archive-url=https://web.archive.org/web/20040616075334/http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|archive-date=2004-06-16|access-date=2008-11-01}}</ref> కన్నౌజ్ జనాభా 71,530. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47%. కన్నౌజ్ అక్షరాస్యత 58%. ఇది జాతీయ సగటు 59.5% కన్నా తక్కువ: పురుషుల అక్షరాస్యత 64%, స్త్రీల అక్షరాస్యత 52%. కన్నౌజ్ జనాభాలో 15% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు
 
== మూలాలు ==
{{Reflist}}
[[వర్గం:Coordinates on Wikidata]]
"https://te.wikipedia.org/wiki/కన్నౌజ్" నుండి వెలికితీశారు