మథుర జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

ఉత్తర ప్రదేశ్ లోని జిల్లా
"Mathura district" పేజీని అనువదించి సృష్టించారు
(తేడా లేదు)

01:03, 8 డిసెంబరు 2020 నాటి కూర్పు

యమునా నది ఒడ్డున ఉన్న మధుర జిల్లా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా. చారిత్రిక పట్టణం మధుర, ఈ జిల్లా ముఖ్యపట్టణం. ఇది వైష్ణవ మతంలో అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటైన బృందావన్‌కు కూడా ప్రసిద్ది చెందింది. [2] జిల్లా ఆగ్రా విభాగంలో భాగం. మధురకు ఈశాన్యంలో అలీగఢ్ జిల్లా, ఆగ్నేయంలో హాత్‌రస్ జిల్లా, దక్షిణాన ఆగ్రా జిల్లా, పశ్చిమాన రాజస్థాన్, వాయవ్యంలో హర్యానా రాష్ట్రం ఉన్నాయి. మధుర జిల్లా హిందువులకు ముఖ్యమైన తీర్థయాత్రా కేంద్రం.

Mathura district
Location of Mathura district in Uttar Pradesh
Location of Mathura district in Uttar Pradesh
CountryIndia
StateUttar Pradesh
DivisionAgra
HeadquartersMathura
Tehsils4
Government
 • Lok Sabha constituenciesMathura
Area
 • Total3,329.4 km2 (1,285.5 sq mi)
Population
 (2011)
 • Total25,47,184[1]
Demographics
 • Literacy74.65%.[1]
Time zoneUTC+05:30 (IST)
Websitehttp://mathura.nic.in/

జనాభా వివరాలు

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
19016,51,619—    
19115,60,620−14.0%
19215,28,677−5.7%
19315,70,211+7.9%
19416,88,801+20.8%
19517,74,567+12.5%
19619,11,685+17.7%
197110,99,356+20.6%
198113,30,963+21.1%
199116,50,653+24.0%
200120,74,516+25.7%
201125,47,184+22.8%
మథుర జిల్లాలో మతం
మతం శాతం
హిందూమతం
  
90.72%
ఇస్లాం
  
8.52%

2011 జనాభా లెక్కల ప్రకారం మధుర జిల్లా జనాభా 25,47,184, [1] జనాభా పరంగా భారతదేశ జిల్లాల్లో ఇది 167 వ స్థానంలో ఉంది. జిల్లాలో జనసాంద్రత 761. 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 22.53%. మధుర జిల్లాలో లింగ నిష్పత్తి 858 /1000. అక్షరాస్యత 72,65%. మధుర జాట్ ఆధిపత్యమున్న ప్రాంతం. జిల్లలో సుమారు 5.30 లక్షల జాట్లున్నారు . [3]

భౌగోళికం, శీతోష్ణస్థితి

మధుర 27°17′N 77°25′E / 27.28°N 77.41°E / 27.28; 77.41 వద్ద [4] సముద్ర మట్టం నుండి 174 మీటర్ల ఎత్తున ఉంది. మధురలో తీవ్రమైన ఉష్ణమండల శీతోష్ణస్థితి ఉంటుంది. వేసవి చాలా వేడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 44°C దాటిపోతాయి. శీతాకాలాలు పొగమంచుతోకూడుకుని బాగా చల్లగా ఉంటాయి. ఉష్ణోగ్రతలు 5°C కి తగ్గుతాయి. సగటు వర్షపాతం 793 మి.మీ. ఉంటుంది. జూలై నుండి సెప్టెంబరు వరకు వర్షాకాలం ఉంటుంది.

రవాణా సౌకర్యాలు

మధుర సెంట్రల్ రైల్వేకు చెందిన ప్రధాన మార్గాల్లో ఉంది. దేశం లోని ముఖ్యమైన నగరాలైన ఢిల్లీ, ఆగ్రా, లక్నో, ముంబై, జైపూర్, గ్వాలియర్, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నైలకు రైలు సౌకర్యాలున్నాయి. సమీప విమానాశ్రయం ఖేరియా (ఆగ్రా), మధుర నుండి 62 కి.మీ. దూరంలో ఉంది [5] మధుర నుండి ముఖ్యమైన నగరాలకు చక్కటి రోడ్డు సౌకర్యాలున్నాయి.

మూలాలు

  1. 1.0 1.1 1.2 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. Gopal, Madan (1990). K.S. Gautam (ed.). India through the ages. Publication Division, Ministry of Information and Broadcasting, Government of India. p. 176.
  3. "Nitin Gadkari to hold rally in Jat dominated Mathura district". The Times of India.
  4. Falling Rain Genomics, Inc. - Mathura
  5. http://www.roaddistance.in/uttar-pradesh/kheria-airport-area-to-mathura-distance/by-road/