"నేదునూరి కృష్ణమూర్తి" కూర్పుల మధ్య తేడాలు

పరిచయం విస్తరణ
(మరికొన్ని సవరణలు)
ట్యాగులు: 2017 source edit విశేషణాలున్న పాఠ్యం
(పరిచయం విస్తరణ)
ట్యాగు: 2017 source edit
| name = నేదునూరి కృష్ణమూర్తి
| image =NedunuriKrishnaMurthy.jpg
| imagesize =
| caption = నేదునూరి
| birth_date = {{birth date|1927|10|10}}
| children =
}}
'''నేదునూరి కృష్ణమూర్తి''' (1927, అక్టోబరు 10 - 2014, డిసెంబరు 8) [[కర్ణాటక సంగీతం|కర్ణాటక సంగీత]] విద్వాంసుడు, [[సంగీత కళానిధి]] బిరుదు పొందినవాడు. తూర్పుగోదావరి జిల్లా, కొత్తపల్లె గ్రామంలో జన్మించాడు. విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నాడు. మొదట్లో వయొలిన్ మీద ఆసక్తితో ఉన్నా తర్వాత గురువుల సలహాపై గాత్ర సంగీతం వైపు మొగ్గు చూపాడు. శ్రీపాద పినాకపాణి వంటి వారి వద్ద శిష్యరికం చేశాడు. అన్నమాచార్య సంకీర్తనలు, రామదాస కీర్తనలను స్వరపరిచాడు. నాదసుధా తరంగిణి అనే ట్రస్టును ఏర్పాటు చేసి స్వరపరిచిన కీర్తనలను వాటి నొటేషన్లతో సహా ప్రచురించాడు. 2013 లో కొప్పరపు కవుల ప్రతిభా పురస్కారం అందుకున్నాడు. 2014 డిసెంబరు 8 న విశాఖపట్నంలో వృద్ధ్యాప్యం, అనారోగ్య కారణంగా మరణించాడు.
 
==బాల్యం==
కృష్ణమూర్తి [[అక్టోబరు 10]], [[1927]] న [[తూర్పు గోదావరి]] జిల్లాలోని [[కొత్తపల్లె (తూర్పుగోదావరి)|కొత్తపల్లి]] గ్రామంలో రామమూర్తి పంతులు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఇంట్లో అందరికన్నా చిన్నవారు. వీరి తండ్రి [[పిఠాపురం]] రాజా వారి సంస్థాన కార్యాలయంలో పనిచేస్తూండేవారు. నేదునూరి 1940 లో [[విజయనగరం]] మహారాజా సంగీత కళాశాలలో వయొలిన్‌, గాత్రంలో ప్రాథమిక శిక్షణ పొందారు. కీర్తిశేషులు ద్వారం నరసింగరావు నాయుడు శిష్యుడిగా ఉన్నారు. 1945 నుంచి సంగీత సభలలో పాల్గొంటూ వచ్చారు. 1949లో ప్రముఖ సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి [[పద్మభూషణ్‌]] డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి గారి వద్ద చేసి సంగీతంలో గమకాలు, ఇతర మెళకువలలో శిక్షణ పొంది, సంగీత నైపుణ్యానికి మెరుగులు దిద్దారు. [[ఆల్‌ ఇండియా రేడియో]]లో అగ్రగణ్య కళాకారుడిగా వెలుగులోకి వచ్చారు. 1951 నుండి ఐదు దశాబ్దాలకు పైగా మద్రాసు సంగీత అకాడమీలో ప్రదర్శనలు ఇస్తూ వచ్చారు.
 
ఉచితంగా ఏం నేర్చుకో గలిగితే అది నేర్చుకో అని ఆయన తండ్రి ప్రాధేయపడ్డారుకోరాడు. ఎందుకుఅలా అనిఉచితంగా విశ్లేషించలేదు. అసలు సంగతి తెలుసు కనక.బోధించబడుతున్న హిందీ, సంస్కృతం నేర్చుకున్నారు. కానీ ఆయనకు మాత్రం సంగీతంలో మంచి అభిరుచి ఉండేది. అందుకు తల్లి ప్రభావం ఉంది అని అంటారు. అష్టపదులు, తరంగాలు, రామాయణ కృతులు పాడారు. చిన్నతనంలో నేదునూరి గ్రామంలో పెరిగేరు. విద్వాన్‌ అప్పారావు వద్ద వర్ణాలు నేర్చుకున్నారు. అష్టపదులు, తరంగాలు కల్లూరి వేణుగోపాల రావు గారి వద్ద నేర్చుకున్నారు. ఓ సారి వేణుగోపాలరావు గారి ఇంటికి విజయనగరం తహసిల్దారు విచ్చేసినప్పుడు నేదునూరి హత్తుకొనే పాట విని ప్రసన్నులైయ్యారు. అప్పల నరసింహం పుణ్యమా అని విజయనగరం మహారాజా కాలేజీలో చేరడం జరిగింది. ఉండేందుకు ఉచిత బస ఏర్పరచారు, భోజన వసతి కల్పించారు. ఇంక నేదునూరివారు వెనుదిరిగి చూడలేదు.
 
ఈయన అనేక అన్నమయ్య కృతులకు బాణీలు కట్టాడు. "నానాటి బ్రతుకు నాటకము" కీర్తనకు నేదునూరి కట్టిన బాణీని ప్రశంసిస్తూ ఎం. ఎస్. సుబ్బలక్ష్మి "నేదునూరి గారూ, ఆ ఒక్కపాటకు బాణీని కట్టినందుకు మీకు సంగీతకళానిధి ఇవ్వచ్చండి" అని మెచ్చుకున్నది. 1991 లో [[సంగీత కళానిధి]] పురస్కారం ఈయనకు ఇచ్చినప్పుడు సెమ్మంగూడి[[సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్]] ఈయన పేరును ప్రతిపాదించగా, సుబ్బలక్ష్మి ఆ ప్రతిపాదనకు ద్వితీయం చేసింది.<ref>[http://www.hindu.com/fr/2008/08/22/stories/2008082250960300.htm Revisiting the saint] - The Hindu ఆగష్టు 22, 2008</ref> 2013 లో కొప్పరపు కవుల ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు.
 
సంగీత లోకంలో ప్రముఖ స్థానం సంపాయించుకున్నారు. సంగీత అకాడమీలో యాబై యేళ్ళకు పైగా పాడారు. తన సుదీర్ఘ సంగీత యాత్రలో అనేక సంగీత కోవిదులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ద్వారం వెంకట స్వామి నాయుడు దగ్గరనుంచి, డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి, లాల్గుడి జయరామన్‌, ఎం ఎస్‌ సుబ్బులక్ష్మి, పేరి శ్రీరామమూర్తి (వయొలిన్‌), వెంకటరమణ (మృదంగం), నేమాని సోమయాజులు (ఘటం) ఇత్యాదులు నేదునూరి ప్రతిభను కొనియాడేవారు. నేదునూరి అనేక అవార్డులు, గౌరవ పురస్కారాలు పొందారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3065916" నుండి వెలికితీశారు