వాడుకరి:Svpnikhil/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
గ్లూలు, జంతు చర్మాల నుండి, ఎముకల నుండి రక్తపు అల్బుమిన్ నుండి లభిస్తున్నాయి. ఫిష్- గ్లూలు చేప నుండి సంగ్రహింపబడినవి. వృక్ష సంబంధ అసంజకలు పిండి నుండి చెట్ల నుండి ఏర్పడిన బంకల నుండి తయారవుతున్నాయి. ఈ రకానికి చెందినవే సాధారణ పిండి పదార్ధాలు , శుద్ధి చేయబడిన పిండి పదార్ధాలు, డెక్స్ ట్రిన్ , నీటిలో కరిగే జిగురులు.
 
ఇవి నీటిలో కరిగే లేదా విక్షేపణ చెందేవి. పిండి పదార్ధాలు డెక్స్ ట్రిన్ ఉత్పన్నాలను , కాగిత , కలప , నేత బట్టలు అతకడంలో ఉపయోగిస్తారు. బంకను కాగితాలను , తపాలా స్టాంపులను ఇతర స్టాంపులను అతకడానికి వాడుతున్నారు.
 
 
మూలక రసాయన అసంజకలు చాలా ముఖ్యమైన వర్గానికి చెందినవి. వీటిలో సోడియం సిలికేట్ ఉంటుంది. ఇది ముఖ్యంగా ముడతలు పడిన కాగితాలను , తత్సంబంధమైన కాగితపు ఉత్పన్నాలకు, లోహపు రేకులకు, ప్లైవుడ్ ను అతికించడానికి , నిర్మాణాలకు సంబంధించిన బిళ్లలు, రక్షణ కవచం గల అట్టల నిర్మాణాలలోనూ వాడుతారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను, మెగ్నీషియం ఆక్సీ క్లోరైడ్ ను పింగాణీ సామానులకు , లిథార్జీ గ్లిజరిన్ ను నీటి గొట్టాలను అతకడానికి , పోర్ట్ లాండ్ సిమెంటును గృహనిర్మాణాలలోను , బంధక - పదార్ధాలుగాను వాడుతున్నారు.