పుట్టపర్తి నారాయణాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
'''పుట్టపర్తి నారాయణాచార్యులు''' [[1915]], [[మార్చి]], 28 వ తేదీన [[అనంతపురం]] జిల్లా అనంతపురం మండలంలోని [[చియ్యేడు]] గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి శ్రీనివాసాచార్యులు, తల్లి లక్ష్మిదేవి గొప్ప సంస్కృత ఆంధ్ర పండితులు. అసలు వారి ఇంటి పేరు తిరుమల వారు. [[శ్రీకృష్ణదేవరాయలు|కృష్ణదేవరాయల]] రాజగురువు తిరుమల తాతాచార్యుల వంశం వారిది. తాతాచార్యులు గొప్ప శాస్త్ర పండితుడు. ఆయన గురించి కొందరు అల్పబుద్ధుల వల్ల హాస్యకథలు పుట్టాయి. ఆ తర్వాత వారి వంశీయులు చిత్రావతీ తీరంలో పుట్టపర్తిలో ఉండడం వల్ల ఇంటిపేరు పుట్టపర్తి అయింది.
 
నారాయణాచార్యులు చిన్న వయసులోనే [[భారతం]], [[భాగవతం]], పురాణాలతో బాటుపాటు సంగీతం కూడా నేర్చుకున్నారు. ఆయన [[తిరుపతి]] సంస్కృత కళాశాలలో [[సంస్కృతం]] నేర్చుకున్నారు. కపిలస్థానం కృష్ణమాచార్యులు, డి.టి. తాతాచార్యులు లాంటి గొప్ప సంస్కృత పండితుల వద్ద [[వ్యాకరణం]], [[ఛందస్సు]], తదితరాలు నేర్చుకున్నారు. [[పెనుగొండ (అనంతపురం జిల్లా)|పెనుగొండ]]లో రంజకం మహాలక్ష్మమ్మ దగ్గర [[భరత నాట్యం]] నేర్చుకున్నారు. సంగీతం, సాహిత్యం, నాట్యం ఆయనలో త్రివేణీ సంగమంలా మిళితమయ్యయి. చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేయడమే గాక సీనుల మధ్య తెర లేచేలోపు నాట్యం చేసే వారు.
 
[[ప్రొద్దుటూరు]] వీరి అత్తగారి ఊరు. మొదట ఆయన పని చేసింది అనంతపురంలో. అప్పటికింకా స్వాతంత్ర్యం రాలేదు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ మీనన్ కి సమయం దొరికితే చాలు, ఆంగ్లేయుల్ని తనివితీరా పొగడడం, [[మహాత్మా గాంధీ|గాంధీ]] వంటి వారిని తిట్టడం పరిపాటిగా ఉండేది. అది సహించలేని పుట్టపర్తి ఆయనతో వాగ్యుద్ధానికి సిద్ధపడడమే గాక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కొన్నాళ్ళు తిరువాన్కూర్ లోనూ, కొన్నాళ్ళు [[ఢిల్లీ]] లోనూ, ప్రొద్దుటూరు లోనూ పనిచేసి చివరకు [[కడప]]లో స్థిరపడ్డారు. కడపలో శ్రీ రామకృష్ణా ఉన్నత పాఠశాలలో ఆయన ఉపాధ్యాయుడుగా పనిచేశారు. సాహితీ సృష్టి అంతా కడపలోనే జరిగింది.