అసంజకలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో లింకుల సవరణ, పాఠ్యం సవరణ, typos fixed: బుమి → భూమి, → (12), , → , (15)
చిన్న మార్పు
పంక్తి 1:
అసంజకలు (adhesives ) రెండు ఉపరితలాలను ఒకదానితో ఒకటి చక్కగా అతికే పదార్థాలను అసంజకలు అంటారు. అసంజకలు, గ్లూలు అనే రెండు మాటలు ఒకే అర్థంలో పర్యాయపదాలుగా చాలా కాలం నుండి వాడుకలో ఉన్నాయి. అయితే సర్వసాధారణంగా గ్లూ అనేది జిగురుగా ఉంటుంది. కానీ అసంజకలు జిగురుగా ఉండవు. అసంజకలలో ముఖ్యంగా రెండు రకాలు ఉన్నాయి.
 
== రకాలు ==
అసంజకలలో ముఖ్యంగా రెండు రకాలు ఉన్నాయి.
# కర్బన (సమ్మేళనాత్మక) అసంజకలు
# మూలక రసాయన అసంజకలు
 
రసాయన ప్రవృత్తిని ఆధారంగా చేసుకొని, అసంజకలు ఏడు రకాలు-
 
=== రసాయన ప్రవృత్తిని ఆధారంగా చేసుకొని, అసంజకలు ఏడు రకాలు- ===
# థెర్మోప్లాస్టిక్ సంశ్లేషణ రెజిన్లు
# థెర్మో సెట్టింగ్ సంశ్లేషణ రెజిన్లు
Line 16 ⟶ 17:
వీటిలో 4, 5, 6 రకాలు కర్బన అసంజకల తయారీకి ఉపయోగపడేవే మూలపదార్ధాలు. లభించిన అసంజకల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వర్గీకరించడం జరిగింది. మొదటి రకానివి గట్టి అసంజకలు. అవి దృఢమైన ఉపరితలాలు గల కర్ర, గాజు, పింగాణి, దృఢమైన ప్లాస్టిక్లు, లోహాలు వంటి వాటిని అతకడానికి వాడతారు. రెండో రకానివి మెత్తని అసంజకలు. ఇవి మెత్తని ఉపరితలాలు గల కాగితం, బట్టలు, తోళ్ళు కావలసిన ఆకృతులుగా మలిచే ప్లాస్టిక్లను, పలచని లోహపురేకులు వంటి వాటిని అతికించేందుకు వాడే అసంజకలు. ఈ తరగతికి చెందిన అసంజకాలకు అతికించవలసిన ఉపరితలాలతో సమానమైన మృదుత్వం ఉండడం అవసరం.
 
థెర్మోప్లాస్టిక్ సింథెటిక్ రెజిన్ అసంజకలలో పొలిమెరిజేషన్ ఉత్పన్నాలైన పొలివినైల్ అసెటితే, పాలివినైల్ బ్యూతిరాల్, పాలివినైల్ ఆల్కహాల్, పొలి వినైల్ రెజిన్లు, ఆక్రిలిక్ మీథాక్రిలిక్ ఆమ్లాలు, ఎస్తర్ రెజిన్లు, సైనో అక్రిలెట్లు, సంశ్లేషణ రెజిన్లైన పొలి ఇసొబ్యుటిలిన్, పొలి ఎమైడ్లు, కుమరొన్-యొడిన్ ఉత్పన్నాలు, సిలికాన్లు ఉన్నాయి. సాధారణంగా ఇట్టి థెర్మొప్లాస్టిక్ రెజిన్లకు, శాశ్వత ద్రావణీయత, ద్రవీభవించే గుణమూ సిద్ధిస్తాయి. అందుచేత వీటిని టేపుల తయారీలోను, భద్రత - గాజులోను, జోళ్ళకు వాడే సిమెంట్ తయారీ పరిశ్రమలోను వాడుతున్నారు. అంతేగాక పలచని లోహపు రేకులను అతకడంలో, కర్ర సంబంధమైన వాటిని, రబ్బరు, కాగితం మొదలైన వాటిని అతకడానికి దీన్ని విస్తృతంగా వాడుతున్నారు. వివిధ రకాలైన రబ్బరు అసంజకలు కూడా వాడుకలో ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి
 
==== వీటిలో ముఖ్యమైనవి ====
# రబ్బరు పాలు (లాటెక్స్) ఉన్న ద్రావణాలు.
# రబ్బరు లేదా కృత్రిమ పరివర్తత రబ్బర్ ద్రావణాలు
"https://te.wikipedia.org/wiki/అసంజకలు" నుండి వెలికితీశారు