అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా (పాట): కూర్పుల మధ్య తేడాలు

https://web.archive.org/web/20170918045741/http://vulimiri.blogspot.in/2011/08/blog-post_14.html నుండి యదాతథంగా కాపీ చేసిన వ్యాసం
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{copypaste|url=https://web.archive.org/web/20170918045741/http://vulimiri.blogspot.in/2011/08/blog-post_14.html|date=డిసెంబరు 2020}}
'''అర్ధ శతాబ్దపు''' అనే ఈ పాట 1997లో విడుదలైన [[సింధూరం]] చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట రాసినందుకు [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]] గారికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. [[శ్రీ (సంగీత దర్శకులు)|శ్రీ]] సంగీతం అందించిన ఈ పాటను గానంచేసింది [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]], సంగీతం అందించింది [[శ్రీ (సంగీత దర్శకులు)]]పాడాడు.
 
== పాట నేపథ్యం ==
భారత మాత 1947 ఆగస్టు పదిహేను అర్ధరాత్రి దాస్య శృంఖలాల నుండి విముక్తురాలు అయ్యింది. ప్రజలంతా సంబర పడ్డారు. అయితే స్వరాజ్యం రావడంతో మన కర్తవ్యం పూర్తి కాలేదు, అసలు ప్రగతి అంతా ముందుంది అని, "స్వాతంత్ర్యం వచ్చెననీ సభలేచేసి సంబరపడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి" అని అలనాడు తన పెన్నుతో మన వెన్ను తట్టి హెచ్చరించారు మహాకవి శ్రీశ్రీ.
 
తరువాత స్వాతంత్ర్యం వచ్చిన అయిదు పదులకు దేశ రాజకీయ వాతావరణం లో చాల మార్పులు వచ్చాయి. కాని సగటు మనిషి జీవితంలో మార్పు రాలేదు. ఇంతలో నక్సలిజం రాజుకుంది. ఆ నేపథ్యంలో విడుదలయిన చిత్రం "సింధూరం". 'కృష్ణ వంశీ' దర్శకత్వంలో విడుదలయిన ఈ చిత్రం రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డ్ ను, ఫిలిం ఫేర్ అవార్డును గెలుచుకుంది. ఈచిత్రంలో ఒక మరపురాని గీతం వ్రాసినది శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. వారి కలం, కత్తి కన్నా పదునైనదని నిరూపించిన గీతం ఇది. నిజానికి చిత్ర నిర్మాణం పూర్తయి, ప్రీవ్యూ చూసి బయటకు వచ్చిన తరువాత కలిగిన స్పందన తో అప్పటికప్పుడు శాస్త్రి గారి కలం-గళం నుండి పెల్లుబికిన కవితావేశం ఈ గీతం అని కృష్ణవంశీ గారి మాటలలో తెలిసింది.
 
ప్రస్తుతం మనకు స్వాతంత్ర్యం వచ్చి ఆరు పదులు పైబడింది.అయినా సగటు రాజకీయ వాతావరణంలో మార్పు ఏ మాత్రంలేదు. కాకపోతే, మార్పుకోసం దశాబ్దానికొక కొత్త అలజడి, ఒక కొత్త ఉన్మాదం, వెరసి ఇదీ మన ప్రగతి గతి. వాస్తవానికొస్తే, ఈ పాట వింటుంటే ఏదో తెలియని బాధ కలుగుతుంది. మనసులో ఆశావాదం నిండి వున్నా ఒక్కోసారి నైరాశ్యం ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుంటుంది. సిరివెన్నెల గారు తన పాటలో పలుకులో ఆ ఆవేదనను సాధారణ పదాలతో చక్కగా, స్పష్టంగా వ్యక్తం చేసారు.
 
== పాటలోని సాహిత్యం ==
Line 35 ⟶ 28:
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== ఇతర లంకెలు ==
# [https://web.archive.org/web/20170918045741/http://vulimiri.blogspot.in/2011/08/blog-post_14.html స్వగతం వెబ్ సైట్ లో పాట గురించిన వ్యాసం]
# [http://www.youtube.com/watch?v=vWSB07jA8JI/ యూట్యూబ్ లో పాట వీడియో]