జింద్: కూర్పుల మధ్య తేడాలు

+జిల్లా లింకు
చి AWB తో లింకుల సవరణ, పాఠ్యం సవరణ, typos fixed: కు → కు (2), → (4)
పంక్తి 73:
| demographics1_info1 = [[హిందీ భాష|హిందీ]]
}}
[[హర్యాణా|హర్యానా]] రాష్ట్రం లోని పురాతన నగరాల్లో '''జింద్''' ఒకటి. ఇది [[జింద్ జిల్లా]] కు ముఖ్య పట్టణం. పట్టణం లోని పర్యాటక ప్రాధాన్యత కలిగిన స్థలాల్లో రాణి తలాబ్ ఒకటి. [[పాండురాజు|పాండు]] -పిండారా, రామ్‌రాయ్‌లు మతపరమైన దర్శనీయ క్షేత్రాలు. ''[[అమావాస్య]]'' సమయంలో పవిత్ర స్నానం చేసేందుకు భక్తులు ఈ క్షేత్రాలకు వస్తూంటారు
 
జింద్ కోటను సా.శ. 1776 లో సిద్దూ జాట్ పాలకుడు మహారాజా గజ్‌పత్ సింగ్ నిర్మించాడు. నర్వానా, జులానా, ఉచనాలు జింద్‌ జిల్లాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాలు.
పంక్తి 83:
 
== చరిత్ర ==
ఫూల్ సింగ్ మనవడు, ఫుల్కియన్ మిస్ల్ వ్యవస్థాపకుడు మహారాజా గజపత్ సింగ్, సిక్కు సాయుధ దళాలను సమకూర్చుకుని 1763 లో ఆఫ్ఘన్ గవర్నరు జైన్ ఖాన్ నుండి దేశంలోని పెద్ద భూభాగాన్ని స్వాధీనం చేసుకుని స్వతంత్ర సిక్కు రాజ్యాన్ని స్థాపించాడు. ప్రస్తుత జింద్ జిల్లా కూడా అందులో భాగమే. 1775 లో జింద్ ను తన రాజ్యానికి రాజధానిగా చేసుకున్నాడు. తరువాత రాజా సంగత్ సింగ్ (1822 నుండి 1834 వరకు పాలించాడు) జింద్ స్థానంలో [[సంగ్రూర్]] ను రాజధానిగా చేసుకున్నాడు. స్వాతంత్ర్యం తరువాత, జింద్ రాజ్యం భారత యూనియన్‌లో విలీనమైంది.
 
ఈ జిల్లా 1948 జూలై 15 న పెప్సు లోని [[సంగ్రూర్ జిల్లా|సంగ్రూర్ జిల్లాలో]] భాగమైంది. 1966 నవంబరు 1 న, సంగ్రూర్ జిల్లాను రెండుగా విభజించి, జింద్ ముఖ్య పట్టణంగా జింద్ జిల్లాను ఏర్పాటు చేసారు. <ref name="harsamvad1">[http://haryanasamvad.gov.in/store/document/Haryana%20Samvad%20October%202018.pdf Haryana Samvad] {{Webarchive|url=https://web.archive.org/web/20181129225259/http://haryanasamvad.gov.in/store/document/Haryana%20Samvad%20October%202018.pdf|date=29 November 2018}}, Oct 2018, p44-46.</ref>
పంక్తి 94:
 
== రోడ్లు, రైళ్ళు ==
జింద్ జంక్షన్ రైల్వే స్టేషను, ఢిల్లీ - ఫాజిల్కా, రైలు మార్గం లోని రైల్వే కూడలి. నగరం గుండా వెళ్ళే ఇతర రైలు మార్గాలు జింద్-సఫిడాన్-పానిపట్, జింద్-గోహానా-పానిపట్ మార్గాలు. కొత్తగా రాబోయే రైలు మార్గం జింద్-నార్నాండ్- హన్సీ.
 
రోడ్డు మార్గాల ద్వారా కూడా జింద్‌కు ఇతర ప్రాంతాలతో చక్కటి రవాణా సౌకర్యాలున్నాయి. ప్రైవేటు యాజమాన్యంలోని బస్సులు జింద్ నుండి [[కైతల్]], నార్వానా, [[పానిపట్]], [[భివాని|భివానీ]], [[రోహ్‌తక్]], సఫిడాన్, పుండ్రి లకు నడుస్తాయి నగరం నుండి దూర ప్రాంత బస్సు సర్వీసులు కూడా బయల్దేరుతాయి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/జింద్" నుండి వెలికితీశారు