బి.ఎస్.యడ్యూరప్ప: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ నేతలలో ...
 
వ్యాసం విస్తరణ
పంక్తి 1:
దక్షిణ భారతదేశంలో [[భారతీయ జనతా పార్టీ]]కి చెందిన ప్రముఖ నేతలలో ఒకడైన '''బి.ఎస్.యడ్యూరప్ప''' (B. S. Yeddyurappa) [[1943]], [[ఫిబ్రవరి 27]]న [[మాడ్యా]] జిల్లాలోని బూకనాకెరెలో జన్మించాడు. [[1970]]లోనే శికారిపుర శాఖకు [[రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్]] కార్యదర్శిగా నియమించబడి [[1972]]లో తాలుకా శాఖకు జనసంఘ్ అద్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. [[1975]]లో శికారిపుర పురపాలక సంఘపు అద్యక్షుడిగా వ్యవహరించి అత్యవసర పరిస్థితి కాలంలో జైలుకు కూడా వెళ్ళినాడు. [[1980]]లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో శికారిపుర తాకుకా భాజపా అద్యక్షుడిగాను, ఆ తరువాత [[శిమోగా]] జిల్లా భాజపా అద్యక్షుడుగాను పనిచేశాడు. [[1988]] నాటికి [[కర్ణాటక]] రాష్ట్ర భాజపా అద్యక్షుడిగా ఎదిగాడు. [[1983]]లో శికారిపుర శాసనసభ నియోజకవర్గం నుంచి కర్ణాటక శాసనసభలో ప్రవేశించి అప్పటినుంచి వరుసగా అదే స్థానం నుంచి ఎన్నికవుతూ వస్తున్నాడు. [[2007]] [[నవంబర్|నవంబర్‌లో]] ముఖ్యమంత్రి పీఠం దక్కిననూ జనతాదళ్ (ఎస్) మద్దుతు కొనసాగించుటకు నిరాకరించడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడింది. 6 మాసాల రాష్ట్రపతి పాలన అనంతరం జరిగిన ఎన్నికలలో భాజపా విజయం సాధించడంతో [[మే 30]], [[2008]]న రెండో పర్యాయం కర్ణాటక ముక్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.
"https://te.wikipedia.org/wiki/బి.ఎస్.యడ్యూరప్ప" నుండి వెలికితీశారు