కొత్త సత్యనారాయణ చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
==జీవిత చరిత్ర==
చౌదరి [[గుంటూరు]] జిల్లా [[తెనాలి]] తాలూకా [[అమృతలూరు]] గ్రామంలో బుచ్చయ్య చౌదరి మరియు రాజరత్నమ్మ దంపతులకు [[డిసెంబరు 31]], [[1907]] సంవత్సరంలో జన్మించాడు. ఇతడు ప్రాధమిక విద్య అమృతలూరు సంస్కృత పాఠశాలలో గావించాడు. అక్కడ భాషా ప్రవీణ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై, [[చిట్టిగూడూరు]]లోని నరసింహ సంస్కృత కళాశాలలో చేరి [[1929]]లో ఉభయ భాషా ప్రవీణ పట్టా ప్రథమ శ్రేణిలో పొందినాడు. శ్రిమత్తిరుమల గుదిమెళ్ళ వరదాచారి, దువ్వూరి వెంకటరమణ శాస్త్రి ఇతడి గురువులు. కవిరాజు [[త్రిపురనేని రామస్వామి చౌదరి]] సాంగత్యంలో ఇతడి లోని సంఘ సంస్కరణ భావాలు బలపడ్డాయి. ఇతడు నిడుబ్రోలు ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా, అనంతరం పాములపాటి బుచ్చినాయుడు కళాశాలలో [[తెలుగు]] ఉపన్యాసకులుగా ఉద్యోగం చేస్తూ రచనా వ్యాసంగం కొనసాగించాడు. [[1930]] లోనే భాషా పోషక గ్రంథ మండలి స్థాపించి దాని ద్వారా తన రచనలను ప్రకటించడం ప్రారంబించాడు.
 
 
ఇతడి విమర్శక రచనలు జనసామాన్యంలోనే కాక, సాహితీలోకంలో సంచలనం సృష్టించాయి. తొలుత తెలుగు విద్యార్ధి మాసపత్రిక లోను, తదుపరి [[1961]] [[జూన్]] నుంచి [[భారతి]] మాసపత్రికలో కవిసామ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] గారి రామాయకల్ప వృక్షం పై విమర్శల పరంపర కొనసాగించాడు. తదనంతరం కల్పవృక్ష ఖండనం గా ప్రచురించాడు.
 
ఆంధ్ర విశ్వకళా పరిషత్తు ఇతడిని [[1974]]లో [[కళా ప్రపూర్ణ]] పురస్కారంతో సన్మానించింది. పొన్నూరు, నిడుబ్రోలు పట్టణ ప్రజలు గజారోహణ సత్కారం చేశారు. ఇతడికి ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆదర్శ ఉపాధ్యాయులు, ఉత్తమ పండితులు, ఉదాత్త విమర్శకులు అయిన ఇతడు [[డిసెంబరు 15]], [[1974]] సంవత్సరంలో పరమపదించాడు.
 
 
సూచన: ఈయన ఫొటొను అప్లోడు చేశాను..(బొమ్మలలో ఉంది) చూదగలరు.. ఫొటో ను యిక్కడకు చేర్చగలరు...
 
'''కొత్త సత్యనారాయణ చౌదరి గారి రచనలు''' మొత్తము రచనలు: 71 ముద్రితములు; 47 (1974)
1. వైదిక వాఙ్మయ చరిత్ర 2.సతీసప్తతి(పద్య) 3.కధా వింశతి 4.చంద్రా పీడచరిత్ర 5.కామ శాస్త్రము(వాత్స్యాయన మహర్షి ) 6.కావ్యమాల1వభాగము 7. కావ్యమాల 2వభాగము 8.సుభాషితము 9.ధర్మశాస్త్రము(మనుస్మృతి)10.కవుల కధలు 11.వరరుచి 12.ఈశ్వర సేవకులు 13. విక్రమ కధలు 14. మ్రొక్కుబడి(పద్య) 15.నవనాధము(గద్య) 16. బృహత్కధలు 17.వత్సరాజు 18. విక్రమాదిత్యము 19. సాలభంజికలు 20. బాపూజీ (పద్య) 21. చారుదత్తము ౨22. నీతిచంద్రిక(సవ్యాఖ్య) 23. చిన్నయ్య (సూరి చరిత్ర) 24. నైషధము 25. కలిపురాణము (పద్య)26. ప్రతాపసింహము 27. వీరపూజ 28.చాణక్యము 29. దివ్యమూర్తులు 30. స్వరాజ్య కధలు 31. మాయాభిక్షువు (పద్య)32. కలిపురాణము (2వ భాగము) 33. మాస్వామి (పద్య)34.మంజరి (పద్య)35.జాతక కధలు 36.సైరంధ్రి (గద్య) 37పంచశతీ పరీక్ష (విశ్వనాధ వారి పంచశతికి విమర్శనము) 38. కవిరాజు (త్రిపురనేని)39. షష్టిక (పద్య) 40. సాహితి(వ్యాసములు) 41. రామాయణ రహస్యాలు 42. మోహన దాసు (పద్య) 43.వసంతసేన (రూపకము)44.కులపతి (శ్రీ వరదాచార్య) 45.కల్పవృక్ష ఖండనము 46. పంచదశీ (శ్లోకములు) 47. శకుంన్తలా (సంస్కృత రచన)
'''అముద్రితములు''': 48. కలిపురాణము (3వ భా.పద్య ) 49. కలిపురాణము (4వభా.పద్య ) 50. కలిపురాణము (5వభా.పద్య) 51. ధూర్తుని స్వగతం 52.మేవాడ విజయము (గద్య)53.మహారధులు 54అంజలి (పద్య) 55. లోకతంత్రము(పద్య) 56. స్వరాష్ట్ర్రము (పద్య) 57. త్యాగయ్య 58. రామరాజభూషణము 59.మాలిక (పద్య) 60. కావ్య కధలు 61. తెలుగు వెలుగులు 62. చిత్ర కధలు 63. కవిత్రయము 64. పండితుడు (పద్య) 65. శిశుఘ్ను(పద్య)66. తెనుగు లక్షణము 67. నా యుపాధ్యాయ గిరి 68. బాలప్రౌఢ ప్రశ్నోత్తరమాల 69. సూక్తి ముక్తావళి 70. వినోద కధలు71. వాల్మీకము