బి.ఎస్.యడ్యూరప్ప: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం విస్తరణ
వ్యాసం విస్తరణ
పంక్తి 5:
యడ్యూరప్ప [[1967]]లో వీరభద్రశాస్త్రి కూతురైన మైత్రిదేవిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు (రాఘవేంద్ర, విజయేంద్ర) మరియు ముగ్గురు కుమారైలు (అరుణాదేవి, పద్మావతి, ఉమాదేవి).<ref name="family">
==రాజకీయ ప్రస్థానం==
1970లో శికారిపుర యూనిట్‌కు రాష్ట్రీయ స్వంసేవక్ సంఘ్ కార్యదర్శిగా నియమించబడుటలో యడ్యూరప్ప రాజకీయ జీవితం ఆరంభమైంది. 1972లో జనసంఘ్ తాలుకా శాఖకు అద్యక్షుడిగా నియమించబడ్డాడు.<ref name="family"/> 1975లో శికారిపుర పురపాలక సంఘపు అద్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. 1975లోనే [[ఇందిరాగాంధీ]] ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితి విధించుటతో అనేక నాయకులతో పాటు యడ్యూరప్ప కూడా జైలుకు వెళ్ళవలసి వచ్చింది. 1975 నుంచి 1977 వరకు [[బళ్ళారి]] మరియు శిమోగా జైళ్ళలో జీవనం కొనసాగించాడు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించుటలో పాత జనసంఘ్ నేతలతో పాటు యడ్యూరప్ప కూడా భాజపాలో చేరి శిమోగా జిల్లా పార్టీ అద్యక్ష పదవిని పొందినాడు. 1988 నాటికి కర్ణాటక భాజపా అద్యక్షుడైనాడు. అదే సంవత్సరంలో తొలిసారిగా శాసనసభకు పోటీచేసి శికారిపుర నియోజకవర్గం నుంచి గెలుపొందినాడు. అప్పటి నుమ్చి వరుసగా ఐదు పర్యాయాలు అదే నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తున్నాడు. కర్ణాటక 10వ శాసనసభకు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాడు. [[199]]లో ఎన్నికలలో ఓడిపోయిననూ పార్టీ తరఫున ఎగువసభకు నామినేట్అయ్యాడు. <ref name="legis"/> ధరంసిం ప్రభుత్వాన్ని పడగొట్టుటకు జనతాదళ్ (ఎస్)కు చెందిన కుమారస్వామితో జతకట్టి చెరి సగం రోజులు ప్రభుత్వం ఏర్పాటుచేయాలనే ఒప్పందం కుదుర్చుకొని తొలుత కుమారస్వామి ముఖ్యమంత్రిత్వానికి మద్దతు పలికినాడు. యడ్యూరప్ప కుమారస్వామి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా మరియు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. 20 మాసాల గడుపు తీరిపోయిననూ కుమారస్వామి భాజపాకు అధికారం అప్పగించకపోవడంతో భాజాపా అగ్రనేతలు జోక్యం చేసుకొని చివరకు యడ్యూరప్పకు 2007 నవంబర్‌లో అధికారం అప్పగించిననూ కుమారస్వామి మనసుమార్చుకొని వెంటనే మద్దతు ఉపసంహరించడంతొ వారంరోజులకే దక్షిణ భారతదేశంలో ఏర్పడిన తొలి భాజపా ప్రభుత్వం కూలిపోయింది. 6 మాసాల రాష్ట్రపతి పాలన అనంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో భాజాపా దాదాపు పూర్తి మెజారిటీ సాధించింది. యడ్యూరప్పను ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టి ప్రకటించినందువల్ల ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటుకు ఎలాంటి అవాంతరం జరుగలేదు. ఎడ్యూరప్ప స్వయంగా మళ్ళీ శికారిపుర శాసనసభ నియోజక వర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి బంగారప్పపై 45 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించాడు. 2008, మే 30న యడ్యూరప్ప రెండో పర్యాయం కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. <ref>http://abclive.in/abclive_regional/yeddyurappa-karnataka-cm.html</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/బి.ఎస్.యడ్యూరప్ప" నుండి వెలికితీశారు