ప్రాకృతం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ప్రాకృత రచనలు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 12:
 
గాంధారీ ప్రాకృతం, పైశాచీ ప్రాకృతం వంటివి కేవలం వ్యాకరణవేత్తల ప్రస్తావనల ద్వార మాత్రమే మనకు తెలుస్తున్నాయి.{{Citation needed|date=January 2010}} ఉత్తరభారతదేశానికి చెందిన ఆధునిక భాషలన్నీ ప్రాకృతాలనుండి పుట్టినవే.
 
==ప్రాకృత రచనలు==
ప్రాకృతములు పలురకములు. షడ్విధములని ఆర్యుల అనుశాసనము. ప్రధానంగా శౌరసేనీ, మాగధి, పైశాచీ, అపభ్రంశములేఅని ప్రాకృత వ్యాకర్తలు పేర్కొన్నారు. కాలక్రమేణ ప్రాంత, జాతీయ విభజన ప్రాకృతములో ఏర్పడి, ప్రాకృత భేధములు ఇరవై ఏడుగా '''ప్రాకృత చంద్రికా''' పేర్కొనినది.ఇంత విరివి వైవిధ్యముగల ప్రాకృత వాజ్మయమున ఎంతో విస్తారమయిన రచనలు ఉండుట సుగ్రహమైన మాట. కాని నేడు మన పాలిటికి మిగిలిన సారస్వతము మిక్కిలి తక్కువ. ముద్రిత సారస్వము ఇంకనూ తక్కువ. ముద్రితమైన ప్రాకృత వాజ్మయమునందలి వైవిధ్యము సంస్కృతమునకు ఏ మాత్రమూ తీసిపోదు. ప్రాకృత సాహిత్యంలో బాణభట్టు చేత భూషించబడిన మహోన్నత కధాప్రబంధము "బృహత్కధ" బహుళప్రాచుర్యము పొందిన గ్రంధము.ఇందులో ఉదయన మహారాజు తనయుడు నరవాహనదత్తుడు, మదన మంజూషా అను లోకోత్తర సౌందర్యరాశిని వివాహమాడుట, ఆపిదప 26 కన్యలను పెండ్లి చేసుకొనుట ఈ బృహత్కధ ఇతి వృత్తాంతము.ఇది లక్షగాధలతో నిర్మించబడినది.పూర్తిరచన నష్టమయినను, ఈ బృహత్కధ మంగళగాధ మాత్రమే ఇప్పుడు లభ్యమవుచున్నది. ఇది పైశాచీ ప్రాకృతములో రచించడం జరిగినది. దీనినే 6 వ శాతాబ్దములో జైనపత ప్రచారముకొరకు మార్పులు చేర్పులు చేసి '''వసుదేవ హిండి''' అను పేరుతో శౌరసేనీ భాషలో వ్రాశాడు.ఇందు భారత, రామాయణ, హరివంస కధలు, జైనతీర్ధంకరుల వృత్తాంతములు చోటుచేసుకున్నవి.ఇది నేడు కొంత అసమగ్రముగ లభ్యమైనది.
 
విమలసూరి ప్రణీత 'పఉమ చరిత' విక్రమ శకం 100సం. నాటి చక్కని రచన.శారసేనీ ప్రాకృతములో రచించబడినది.రామాయణ కధ ఇందలి ఇతి వృత్తాంతము.చక్కని సూక్తులు, చక్కని వర్ణనలు గలరచన. శ్రీపాద లిప్తాచార్య సహకారంతో ఆంధ్రరాజు రచించిన '''గాధాకోసం''' ప్రముఖ ప్రాకృత భాషా శృంగారభరిత ధ్వని రచన.సాహితీ సమరాంగణ సార్వభూముడు భోజదేవుడు తన శృంగార ప్రకాశములో గాధాకోసం ను ఉదహరించినాడు. కుతూహులుని 'లీలాపది' 1360 గాధల సమాహార ప్రాకృత మహాకావ్యం.
విభజన పద్దతిలేకుండా కులక పద్దతిలో సాగుతుంది.
 
హరిభద్రసూరి 'సమరాఇచ్చకహ' గొప్ప ప్రాకృత కధాకావ్యము. అలానే ఈతని శిష్యుడు దాక్షిణ్యచిహ్న బిరుదాంకితుడు ఉద్ద్యోతన సూరి రచించిన చమత్కార కావ్యము 'కువలయ మాలా'. గురువుగారి రచనకు ధీటుగా శౌరసేనీ, అక్కడక్కడ సంస్కృతము, అపభ్రంశము, పైశాచినీ వాడెను.
 
రూపకములు కూడా ప్రాకృతములో కలవు. రాజశేఖర మహాకవి 'కర్పూర మంజరీ' తొలి ప్రాకృత భాషా నిబద్ధ నాటిక. పిదప నయచంద్రుని 'రంభానుజ్ఱరి', రుద్రదాసుని 'చంద్రలేఖా' విశ్వేశ్వరుని 'శృంగార మంజరి', ఘన శ్యాముని 'ఆనంద మంజరి' మరికొన్ని ప్రఖ్యాత ప్రాకృత రూపకములు.
 
==నాటక ప్రాకృతాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రాకృతం" నుండి వెలికితీశారు