రతన్ టాటా: కూర్పుల మధ్య తేడాలు

ప్రవేశిక చేర్పు
వికీకరణ లేని కాపీ పేస్టు వ్యాసం భాగం తొలగింపు
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
{{వికీకరణ}}
{{Infobox person
| honorific_prefix =
Line 26 ⟶ 24:
అతను 1937లో టాటా కుటుంబంలో టాటా గ్రూపు వ్యవస్థాపకుడు [[జమ్‌షెడ్జీ టాటా]] కు మునిమనుమడుగా జన్మించాడు. అతను అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ద్వారా కార్నెల్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ల పూర్వ విద్యార్థి.<ref>https://www.tata.com/management-team#//management-team/rnt</ref> అతను 1961 లో టాటా స్టీల్ షాప్ ఫ్లోర్‌లో పనిచేసేటప్పుడు తన కంపెనీలో చేరాడు, 1991 లో జె.ఆర్.డి టాటా పదవీ విరమణ చేసిన తరువాత అతనికి వారసునిగా భాద్యతలు చేపట్టాడు. అతను టాటాను ఎక్కువగా భారత-కేంద్రీకృత సమూహం నుండి ప్రపంచ వ్యాపారంగా మార్చే ప్రయత్నంలో అమెరికన్ టీ కంపెనీ [[:en:Tetley|టెట్లీ]]<nowiki/>ని సంపాదించడానికి టాటా టీ, జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను సొంతం చేసుకోవడానికి టాటా మోటార్స్, టాటా స్టీల్ యూరోప్ (కోరస్)ను సంపాదించడానికి టాటా స్టీల్ ను పొందాడు.
 
== మూలాలు ==
 
{{మూలాల జాబితా}}
 
<nowiki>----------------------------------------------------------------------------------------------------------------------------------------------</nowiki>
 
వ్యాపారవేత్త.దేశంలోకెల్లా చవకైన నానో కారు రూపకర్త.[[బ్రహ్మచారి]].<ref>{{Cite web|url=https://starsunfolded.com/ratan-tata/|title=Ratan Tata Age, Wife, Children, Family, Biography & More » StarsUnfolded|website=StarsUnfolded|language=en-GB|access-date=2020-05-07}}</ref>
 
75 ఏళ్ల వయోభారం.. అప్పటిదాకా ఎన్నో ఆటుపోట్లు చవిచూసి అలిసిన [[శరీరం]].. [[విశ్రాంతి]] కోరుకునే సమయమిది.
గత 50 ఏళ్లుగా టాటా గ్రూప్‌లో భాగమై.. రెండు దశాబ్దాలకు పైబడి గ్రూప్‌ సారథ్యాన్ని చాకచక్యంగా నిర్వహిస్తూ వచ్చిన రతన్‌ టాటా ఇప్పుడు [[విశ్రాంతి]] పర్వంలోకి అడుగుపెడుతున్నారు. దాదాపు రూ.5 లక్షల కోట్ల టాటాల సామ్రాజ్యాన్ని వారసుడు మిస్త్రీ చేతిలో పెట్టి నేడు పదవీ విరమణ చేస్తున్నారు. దాదాపు రూ.10,000 కోట్ల టాటా గ్రూపు సామ్రాజ్యాన్ని గత 20 ఏళ్లలో రూ. 4.75 లక్షల కోట్ల స్థాయికి తీర్చిద్దిన ఘనత రతన్‌ది. గ్రూప్‌ కార్యకలాపాలను ఎల్లలు దాటించడంలోనే కాదు.. దేశ [[పారిశ్రామీకరణ|పారిశ్రామిక]], వాణిజ్య పురోగతిలోనూ కీలక పాత్ర పోషించారు. మంచి నడవడిక, అంకిత భావం, పోటీతత్వం, [[ధైర్యం]].. ఈ నాలుగు లక్షణాలు రతన్‌లో పుష్కలంగా ఉన్నాయి. అందుకేనేమో రతన్‌ను పుట్టుకతోనే నాయకుడిగా అభివర్ణిస్తూ ఉంటారు ఆయన గురించి బాగా తెల్సినవాళ్లు. 'నాకు అలసటగా ఉంది. ఈ పని రేపు చేద్దాం' అన్న మాటలు రతన్‌ నోట విన్నవారు లేరు. ఆయన దృష్టంతా లక్ష్యంపైనే. గత పదేళ్లలో దాదాపు 1,800 కోట్ల డాలర్లు.. అంటే సుమారు లక్ష కోట్ల రూపాయలు వెచ్చించి టెట్లే టీ, కోరస్‌ స్టీల్‌, జేఎల్‌ఆర్‌ వంటి 22 కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా టాటాల సామ్రాజ్యాన్ని దశదిశలా వ్యాపింపచేసిన ఘనత ఈయన సొంతం. రతన్‌ టాటా ఒక వ్యక్తి కాదు.. ఒక సంస్థ, ఒక బ్రాండ్‌. అన్నిటికీ మించి సృజనాత్మకత, దార్శనికత ఉన్న వ్యక్తి. శరీరం సహకరించినన్నాళ్లూ ఫర్వాలేదు.. ఆ తర్వాతైనా టాటా గ్రూప్‌ బాధ్యతలు చేతులు మారాల్సిందేగా.. అదే ఇప్పుడు జరుగుతోంది. బృహత్తర బాధ్యతల్ని 44 ఏళ్ల యువతరానికి అప్పగించి.. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తున్న రతన్‌ టాటాకు మనసారా వీడ్కోలు చెబుదాం.. అదే సమయంలో.. పగ్గాలు చేపడుతున్న మిస్త్రీ.. రతన్‌ను మించే స్థాయికి ఎదగాలనీ ఆశిద్దాం..
మలి సంధ్య వేళలో...
ఇన్నాళ్లూ బిజీబిజీగా గడిపిన రతన్‌ ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌కు సిద్ధమవుతున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో అన్నీ కార్పొరేట్‌ లక్ష్యాలే. రెండో ఇన్నింగ్స్‌లో సామాజిక సమస్యలే ప్రధాన అజెండా. గ్రామీణాభివృద్ధి, నీటి పొదుపు, ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించడం, పేదరికంలో మగ్గుతూ.. నిరుపేద గర్భిణిలు, చిన్నారులకు పౌష్ఠికాహారాన్ని అందించడం వంటి అంశాలపై ఆయన దృష్టి సారించే అవకాశం ఉంది. తనదైన 'కార్పొరేట్‌' శైలిలో టాటా ట్రస్టులను ముందుకు నడిపించవచ్చు. బిల్‌గేట్స్‌ తరహాలోనే రతన్‌ కూడా సామాజిక సేవపై దృష్టి పెట్టొచ్చు. అంతేకాదు.. తన నీడ టాటా గ్రూపును వెన్నాడకూడదని రతన్‌ కోరుకుంటున్నారట. అడగక ముందే సలహాలు ఇవ్వడం, తన అభిప్రాయాలను సంస్థపై రుద్దడం వంటి వాటి జోలికి వెళ్లరట. ఏదైనా సహాయాన్ని కోరితే మాత్రం అందుబాటులో ఉండి, ఆ పనిచేసి పెడతారట. ఆకాశ వీధిలో విహరిస్తూ ఉండటం, పియానో సాధన చేయడం, పెంపుడు శునకాలతో పొద్దు పుచ్చడం.. వీటికి ఇదివరకటి కన్నా మరింత ఎక్కువ సమయాన్ని కేటాయించడం.. ఇవన్నీ రతన్‌ రెండో ఇన్నింగ్స్‌లో భాగమే!
నానో విడుదల వేళ..
 
కొన్నేళ్ల క్రితం నేను చూసిన ఒక దృశ్యమే ఈ 'నానో' కారుకు నాంది<ref>{{Cite web|url=https://nano.tatamotors.com/|title=New GenX Nano with Easy Shift (AMT) - Latest Compact Hatchback in India|website=nano.tatamotors.com|access-date=2020-05-07}}</ref>. ఓ [[కుటుంబము|కుటుంబం]] స్కూటరుపై వెళ్తోంది. తండ్రి డ్రైవ్‌ చేస్తూంటే.. [[కొడుకు]] ముందు నిలబడ్డాడు. వెనక సీట్లో భార్య.. ఆమె ఒళ్లో ఓ చిన్నారి.. అది చూశాక ఒక్కసారిగా నా మనసు చలించింది. నాకు నేనే ప్రశ్న వేసుకున్నా. ఇలాంటి చిన్న కుటుంబాలు.. ఎలాంటి ఇబ్బంది లేకుండా.. కారులో వెళ్లాలంటే.. వారి స్తోమతకు తగ్గ కారును అందుబాటులోకి తేలేమా..? అదే నా ప్రశ్న. రానురాను నాలో అది బలంగా నాటుకుపోయింది. ప్రజల కారు తేవాలనుకున్నా.. అదే ప్రకటించా.. చాలామంది నన్ను గేలి చేశారు. ఈ కల నెరవేరదని నిరుత్సాహపరిచారు. కొంతమంది అయితే రెండు స్కూటర్లను కలిపి చేసినట్లు అవుతుందంటూ ఎకసెక్కాలు ఆడారు. అయినా నేను లక్ష్యపెట్టలేదు. ఈవేళ నా కలల కారు.. ప్రజల కారు.. రూ.లక్ష కారు.. 'నానో'ను మీముందు ఉంచా. నేను సాధించాననే అనుకుంటున్నా. ఆ లోటు అలాగే ఉంది...
దేశంలో విమానయాన రంగానికి ఆద్యులు టాటాలే. 1932లోనే టాటా ఎయిర్‌లైన్స్‌ను జేఆర్‌డీ ఏర్పాటు చేశారు. 1946లో ఇది ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లి ఎయిరిండియాగా మారింది. మళ్లీ రతన్‌ హయాంలో విమానయాన సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇందుకోసం సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. కానీ 'అనివార్య' కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేకపోయింది. ఆ విషయంలో విఫలమయ్యా..
ప్రతిభకు పట్టం కట్టే ధోరణిని టాటా గ్రూప్‌ కంపెనీల్లో అమలు చేసి ఉంటే బాగుండేది. అంటే సీనియర్లు, జూనియర్లు అన్న భావన పక్కన పెట్టి.. చక్కటి పనితీరు కనబరిచిన వారికి తగిన నగదు బహుమతులను అందించడమే కాదు.. ఉన్నత స్థాయికి చేరేలా ప్రోత్సహించడమూ అవసరమే. ఈ విషయంలో అనుకున్నది సాధించలేకపోయా.. ఆ లోటు అలాగే ఉంది...
దేశంలో విమానయాన రంగానికి ఆద్యులు టాటాలే. 1932లోనే టాటా ఎయిర్‌లైన్స్‌ను జేఆర్‌డీ ఏర్పాటు చేశారు. 1946లో ఇది ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లి ఎయిరిండియాగా మారింది. మళ్లీ రతన్‌ హయాంలో విమానయాన సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇందుకోసం సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. కానీ 'అనివార్య' కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేకపోయింది. ఆ విషయంలో విఫలమయ్యా..
ప్రతిభకు పట్టం కట్టే ధోరణిని టాటా గ్రూప్‌ కంపెనీల్లో అమలు చేసి ఉంటే బాగుండేది. అంటే సీనియర్లు, జూనియర్లు అన్న భావన పక్కన పెట్టి.. చక్కటి పనితీరు కనబరిచిన వారికి తగిన నగదు బహుమతులను అందించడమే కాదు.. ఉన్నత స్థాయికి చేరేలా ప్రోత్సహించడమూ అవసరమే. ఈ విషయంలో అనుకున్నది సాధించలేకపోయా.. పెంపుడు కుక్కల కోసం..
 
రతన్‌కు విమానాలు, హెలికాప్టర్లు నడపడమే కాదు.. కార్లపైనా మమకారం ఎక్కువే. ఆయన గ్యారేజీలో కనీసం 5 కార్లుంటాయి. వీటిలో 'ఫెరారీ కాలిఫోర్నియా'ను బాగా ఇష్టపడతారు. ఇంకా మసరాటీ క్వాట్రోపోర్టే, క్యాడిలాక్‌ ఎక్స్‌ఎల్‌ఆర్‌, క్రిస్లర్‌ సెబ్రింగ్‌, ల్యాండ్‌రోవర్‌ ఫ్రీల్యాండర్‌, మెర్సిడెస్ 500ఎస్‌ఎల్‌, [[మెర్సిడెస్-బెంజ్|మెర్సిడెస్‌]] ఎస్‌-కస్, ఇండిగో మెరీనాలు రతన్‌ వినియోగించే కార్లలో కొన్ని. తన పెంపుడు కుక్కల కోసం [[ఇండిగో]] మెరీనా కారులోని వెనుక సీటు తీయించేసి పరుపు అమర్చడం విశేషం.
 
తన జీవితంలో నాలుగు సార్లు ప్రేమలో పడ్డానని, కానీ ఒక్కసారి కూడా అందులో విజయాన్ని అందుకోలేక పోయినట్టు టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా మనస్సులోని మాటను వెల్లడించారు. కుర్రతనంలోని తన ప్రేమాయాణ మధుర స్మృతులను ఇపుడు నెమరవేసుకుంటున్నారు.
 
యుక్త వయస్సులో మూడు సార్లు ప్రేమలో పడినట్టు ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ నాలుగు దఫాలు పెళ్ళి వరకు వెళ్లి ఆగిపోయానని చెప్పారు. అయితే.. తన వరకూ [[పెళ్ళి]] చేసుకోకపోవడం అదృష్టంగానే భావిస్తున్నారు. పెళ్ళి చేసుకోకపోవడం తప్పేమి కాదు. ఒక వేళ చేసుకుని ఉంటే పరిస్థితి ఇంకా సంక్లిష్టంగా ఉండేదని [[రతన్ టాటా]] అన్నారు.
 
ఆంగ్ల టీవీ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/business/india-business/Came-close-to-getting-married-four-times-Ratan-Tata/articleshow/7972929.cms|title=Came close to getting married four times: Ratan Tata - Times of India|last=Apr 14|first=TNN {{!}} Updated:|last2=2011|website=The Times of India|language=en|access-date=2020-05-15|last3=Ist|first3=07:30}}</ref>. మీరెప్పుడూ ప్రేమలో పడలేదా అని అడుగగా ఆయన పై విధంగా సమాధానం ఇచ్చారు. చివరకు కారణం ఏదైనా భయంతో వెనక్కు తగ్గానని చెప్పారు.
 
తన ప్రేమాయణం గురించి మరింత లోతుగా చెప్పమని కోరగా [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]లో పనిచేస్తున్నప్పుడు ఒకరితో నా ప్రేమ వ్యవహారం గాఢంగా సాగింది. నేను ఇక్కడకు వచ్చేశాను. నాతోపాటు రావడానికి ఇష్టపడింది కూడా. కానీ [[భారత్ చైనా యుద్ధం 1962|ఇండో-చైనా యుద్ధం]] ప్రభావం ఆమెపైన పడిందనుకుంటా.. చివరకు రావడానికి మొగ్గు చూపలేదు. అక్కడే వేరొకరని పెళ్ళి చేసుకుందని రతన్‌ టాటా మనసు విప్పారు.
 
అలాగే, మిగిలిన మూడుసార్లు ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి చేసుకోక పోవడానికి కారణాలు వేర్వేరుగా ఉన్నాయన్నారు. మీరు ప్రేమించిన వారు ఎవరైనా [[ఢిల్లీ]]లో ఉన్నారా అంటే.. ఉన్నారని చెప్పిన రతన్‌ మరిన్ని వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు.
టాటా గ్రూప్ లో కొత్త శకం ప్రారంభమైంది. నాలుగు లక్షలకోట్ల రూపాయల విలువైన టాటా సన్స్ ఛైర్మన్ బాధ్యతలను సైరస్ పల్లోంజి మిస్త్రీ స్వీకరించారు. ఉప్పు నుంచి సాప్ట్ వేర్ వరకు వివిధ రంగాలలో తనదైన ముద్ర వేసుకున్న టాటా గ్రూప్ గురించి కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. వ్యాపారం అంటే నిబద్ధత, అంకిత భావం అని తెలియజేస్తూ నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యాపార దిగ్గజం రతన్ టాటా. 1937, డిసెంబర్ 28న జన్మించిన రతన్ టాటా 50 ఏళ్లుగా టాటా గ్రూప్‌ సంస్థలకు సేవలందిస్తున్నారు. ఇన్ని ఏళ్ల తన ప్రయాణంలో ఆయన అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ప్రపంచం గర్వించదగ్గ మైలురాళ్లను అధిగమించారు. విస్తృతమైన వినియోగదారుల అవసరాలను తీర్చడం కోసమే వ్యాపారం అని చాటిచెప్పిన గొప్ప వ్యాపారవేత్త రతన్ టాటా. వ్యాపారంలో టాటా అనుసరించిన నీతి, నిజాయితీ, నాణ్యత వంటి విధానాలనే అనుసరించి ఆదర్శవంతమైన అభివృద్ధిని సాధించారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లతో సత్కరంచింది. ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు ఆయనను డాక్టరేట్లతో గౌరవించాయి. యావత్ పారిశ్రామిక ప్రపంచానికి ఆదర్శప్రాయుడైన రతన్ టాటా మన దేశానికి చెందిన వ్యక్తి కావటం మనం గర్వించదగిన విషయం. రతన్ టాటా 1962లో టాటా స్టీల్ జంషెడ్ పూర్ ప్లాంట్‌లో అప్రెంటిస్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1991లో జెఆర్‌డి టాటా నుంచి గ్రూప్ ఛైర్మన్ బాధ్యతలను స్వీకరించారు. అప్పట్లో 10 వేల కోట్ల రూపాయల టర్నోవర్ గల టాటా గ్రూప్ విలువ నేడు 100 బిలియన్ డాలర్లకు పెరిగింది. టర్నోవర్‌లో 58 శాతం ఎగుమతుల ద్వారానే వస్తోంది. రతన్ టాటా నిరంతరాయంగా, అవిశ్రాంతంగా చేసిన కృషి ఫలితమే ఇది. టాటా గ్రూపును ఆయన విదేశాలకు కూడా విస్తరింపజేశారు. రతన్ టాటా బ్రహ్మచారి. సొంత ఆర్థిక ప్రయోజనాలు అంటూ ఆయనకు పెద్దగా లేవు. ఇది కూడా ఆయన ఆదర్శవంతమైన విజయానికి దోహదపడినట్లుగా భావించవచ్చు. వ్యాపారవేత్తగా తన సుదీర్ఘ ప్రయాణాన్ని రతన్ టాటా ముగించుకున్నారు. టాటా సన్స్ ఛైర్మన్‌గా పదవీవిరమణ చేశారు.
 
టాటా కంపెనీలు : టాటా గ్రూప్‌లో మొత్తం 32 పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. వీటి ఉమ్మడి మార్కెట్ క్యాప్ 8,882 కోట్ల డాలర్లు. మొత్తం షేర్ హోల్డర్ల సంఖ్య 38 లక్షలు. ఉద్యోగుల సంఖ్య 4.50,000. లిస్టెడ్ కంపెనీల్లో టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ, టాటా పవర్, టాటా కెమికల్, టాటా గ్లోబల్ బేవరేజెస్, టాటా టెలీ, టైటాన్, టాటా కమ్యూనికేషన్స్, ఇండియా హోటల్స్ వంటి టాప్ కంపెనీలు ఉన్నాయి. గ్రూప్ వ్యాపారం 80 దేశాలకు విస్తరించి ఉంది. 85 దేశాలకు టాటా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.
 
జంషెడ్‌జీ నుసెర్వాన్‌జీ టాటా 1868లో స్థాపించిన టాటా గ్రూప్ కు రతన్ టాటా స్థానంలో ఆరవ ఛైర్మన్ గా మిస్త్రీ బాధ్యతలు చేపట్టారు. షాపూర్‌జీ పల్లోంజీ కుటుంబానికి చెందిన సైరస్ మిస్త్రీ 2006లో టాటా గ్రూపు బోర్డులో చేరారు. ఈ గ్రూపు హోల్డింగ్ సంస్థ టాటా సన్స్‌లో పల్లోంజీ కుటుంబానికి 19.5 శాతం వాటా ఉంది. నిర్మాణ రంగంలో షాపూర్ జీ గ్రూప్ కు 147ఏళ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం 15వేల కోట్ల రూపాయలకు చేరిన ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీని మిస్త్రీ తాత ఏర్పాటు చేశారు. రతన్ టాటాకు కుటుంబవారసులు ఎవరూ లేకపోవడంతో వ్యాపార వారసునిగా తర్వాత ఛైర్మన్ పదవిలో ఎవరిని కూర్చోబెట్టాలా అని చాలా పెద్ద కసరత్తు జరిగింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ మొత్తం ఐదుగురు ప్రతిపాదిత సభ్యుల నుంచి మిస్త్రీని ఎంపిక చేసింది. రతన్ టాటా కుటుంబానికి, మిస్త్రీ కుటుంబానికి బీరకాయపీచు సంబంధం ఉందిలేండి. 1968లో జన్మించిన సైరస్ లండన్ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ మెడిసిన్ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో పట్టా తీసుకున్నారు. ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేశారు. ఏడాది కాలంగా రతన్ ప్రత్యక్ష పర్యవేక్షణలో సైరస్ వ్యాపార విధుల నిర్వహణలో ఆరితేరారు. తన వారసునిగా సైరస్‌కు రతన్ నూటికి నూరు మార్కులు వేశారు. అయితే సైరస్ పలు సవాళ్లను ఎదుర్కోవలసి ఉంది. ఆయన రతన్ టాటా అనుసరించిన విధానాలనే అనుసరిస్తారా? లేదా? అన్నది వేచి చూడాలి. అతని నిర్వహణా సామర్థ్యాన్ని భవిష్యత్ నిర్ణయిస్తుంది.
 
3. I do not know how history will judge me, but let me say that I’ve spent a lot of time and energy trying to transform the Tatas from a patriarchal concern to an institutional enterprise. It would, therefore, be a mark of failure on my part if it were perceived that Ratan Tata epitomizes the Group’s success. What I have done is establish growth mechanisms, play down individuals and play up the team that has made the companies what they are. I, for one, am not the kind who loves dwelling on the ‘I’. If history remembers me at all, I hope it will be for this transformation.
 
- Ratan Tata
2012 డిసెంబర్ లో యుగాంతం కాలేదు కానీ, భారతదేశపు పారిశ్రామిక రంగంలో మాత్రం ఒక శకం ముగుస్తోంది. 1991 నుంచి అంటే 21 సంవత్సరాల పాటు టాటా గ్రూప్ ని విజయపథంలో నడిపిన రతన్ నావల్ టాటా (రతన్ టాటా) 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో, ఈరోజు (28/12/2012) ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నారు. వంటింట్లో ఉండే ఉప్పు, పంచదారల నుంచి ఆకాశంలో ఎగిరే విమానాల తయారీలో వాడే స్టీల్ వరకు, ప్రధానమైన ఏడు బిజినెస్ సెక్టార్స్ లో (Communications & Information Technology, Engineering, Materials, Services, Energy, Consumer products and Chemicals) దరిదాపు 85 దేశాలలో, 100 కు పైగా కంపెనీలతో, సుమారు 100 బిలియన్ US డాలర్ల పైగా బిజినెస్ చేసే ఈ పారిశ్రామిక దిగ్గజం గురించి నేను కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. కానీ అత్యంత successful గా తన tenure ని పూర్తి చేసుకున్న ఈ iconic man deserves resepect, love, affection and recognition from every individual Indian అని నా అభిప్రాయం, అందుకే కొండని అద్దంలో చూపించే ఈ చిన్న ప్రయత్నం.
 
రతన్ టాటా JRD టాటా<ref>{{Cite web|url=https://www.tata.com/about-us/tata-group-our-heritage/tata-titans/jrd-tata|title=JRD Tata {{!}} Tata group|website=www.tata.com|language=en|access-date=2020-05-15}}</ref> మునిమనవడు. రతన్ టాటా వ్యక్తిగతజీవితం గురించి పబ్లిక్ డొమైన్ లో తెలిసింది చాలా తక్కువ. ఆ కొద్దిపాటి వివరాల ప్రకారం బోంబే ప్రెసిడెన్సీకి చెందిన ఒక పార్సీ కుటుంబంలో 1937 డిసెంబర్ 28 న జన్మించిన రతన్ టాటా బాల్యం అంత సాఫీగా గడవలేదు. రతన్ నావెల్ టాటా తల్లిదండ్రులు నావెల్ H టాటా & సూనూ. నావెల్ H టాటాని JRD టాటా చిన్నకొడుకు వారికి పిల్లలు లేకపోవటంతో దత్తత తీసుకున్నారు . రతన్ టాటా వయస్సు 7 ఏళ్ళు, ఆయన తమ్ముడు జిమ్మీ వయస్సు 5 ఏళ్ళు ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు, అప్పటి నుంచి నాయనమ్మ నవాజ్ భాయ్ పెంచి పెద్ద చేసారు. ఆ తరువాతి కాలంలో నావెల్ H టాటా వేరే వివాహం చేసుకున్నారు ఆ వివాహం ద్వారా కలిగిన సంతానం నోయెల్ టాటా (ప్రస్తుత Trent Ltd వైస్ ఛైర్మన్ & టాటా ఇంటర్నేషనల్ డైరెక్టర్ ).
 
Campion స్కూల్ (అప్పటి బొంబాయి ఇప్పటి ముంబై ), బిషప్ కాటన్ స్కూల్ సిమ్లా, Cathedral & Jhon Connon స్కూల్ ముంబై లలో తన స్కూలింగ్ పూర్తిచేసిన రతన్ టాటా, 1962 లో కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ అయ్యారు. గ్రాడ్యుయేట్ అయిన వెంటనే JRD టాటా సలహా మేరకు జెంషెడ్ పూర్ లో టాటా స్టీల్ లో ఒక సాధారణ బ్లూ కాలర్ ఉద్యోగిగా చేరారు . ఆ తరువాత 1971 లో అప్పట్లో ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కుంటున్న NELCo (National Radio & Electronics Company) లో Director in-charge గా బాధ్యతలు తీసుకున్నారు. 40% లాభాలు, 2% మార్కెట్ వాటాతో కష్టాలలో ఉన్న NELCo ని మూడు సంవత్సరాలలో అంటే 1975 నాటికి, 2% నష్టాలు, 25% శాతం మార్కెట్ వాటా ఉన్న కంపెనీగా మార్చగలిగారు. కానీ తరువాతి కాలంలో దేశం లోని [[భారత అత్యవసర స్థితి|ఎమర్జెన్సీ]] మూలంగా వచ్చిన ఎకనామిక్ రిసెషన్, యూనియన్ బందులు వీటి ప్రభావంతో లాకౌట్ ప్రకటించారు. 1981 లో డైరెక్టర్, టాటా ఇండస్ట్రీస్ గా బాధ్యతలు స్వీకరించిన రతన్ టాటా మరోసారి 1986 లో Empress మిల్స్ విషయంలో ఇటువంటి చేదు అనుభవాన్ని చూసారు. ఈ చేదు అనుభవాలతో 1991 లో, లెజెండరీ పారిశ్రామికవేత్త అయిన JRD టాటా వారసుడిగా టాటా ఇండస్ట్రీస్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించే సమయంలో కొద్దిపాటి విమర్శల్ని ఎదుర్కొవాల్సి వచ్చింది.
 
1991 లో టాటా ఇండస్ట్రీస్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత అప్పటి వరకు ఫ్యామిలీ బిజినెస్ గా ఉన్న టాటా గ్రూప్ ముఖచిత్రాన్ని అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థగా మార్చారు (ప్రస్తుత టాటా గ్రూప్ ఆదాయంలో 48 % ఇండియా వెలుపలి నుంచి వచ్చేదే).
 
ఈ ప్రయాణంలో సాధించిన కొన్ని విజయాలు :
1.యంగ్ మానేజర్స్ కి ప్రాధాన్యతనివ్వటానికి రతన్ టాటా చేపట్టిన చర్యలు ముందుతరం వారినుంచి కొద్ది పాటి విమర్శలు ఎదుర్కునప్పటికీ ఈరోజు ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ లో టాటా గ్రూప్ అతి పెద్ద బిజినెస్ హౌస్ గా ఎదగటానికి ఉపయోగపడ్డాయి.
2. TCS పబ్లిక్ ఇష్యూకి వెళ్ళటంతో పాటు అతి పెద్ద ఇండియన్ బేస్డ్, మల్టీనేషనల్ IT సంస్థగా ఎదిగింది.
3. టాటా మోటార్స్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజిలో లిస్టు అయ్యింది.
4. 2007 లో 11.6 బిలియన్ US డాలర్ల డీల్ తో, ఆంగ్లో డచ్ కంపనీ అయిన Corus ని టాటా స్టీల్ తో చేసిన విలీనం టాటా స్టీల్ ని ప్రపంచం లోని 5వ అతిపెద్ద స్టీల్ కంపెనీగా మార్చడంతో పాటు రతన్ టాటాకు బిజినెస్ సెలబ్రిటీ గుర్తింపు తెచ్చింది.
5. 2008 లో జాగ్వర్ ల్యాండ్ రోవర్ ని టాటా మోటార్స్ లో విలీనం చేయడం.
6. వీటన్నిటికి మించి తరతరాలా నుంచి టాటా అంటే విలువలు పాటించే ఒక బ్రాండ్ అనే నమ్మకాన్ని ఇప్పటికీ ప్రజల మనస్సులో నిలపటంలో 100 శాతం విజయాన్ని సాధించారు.
అంతర్జాతీయంగా ఇన్ని విజయాలు సాధించిన టాటా గ్రూప్ కి స్వదేశంలో మాత్రం నానో కార్ల ప్రాజెక్ట్ ని వెస్ట్ బెంగాల్ నుంచి గుజరాత్ కి మార్చాల్సి రావటం వంటి కొన్నిచికాకులు మాత్రం ఎదుర్కోవాల్సి వచ్చింది .
లభించిన కొన్ని గుర్తింపులు :
1. 2008 లో "టైం మాగజైన్" ప్రకటించిన 100 World's most influential people లో ఒకరుగా నిలిచారు.
2. భారత ప్రభుత్వం నుంచి 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2008 లో పద్మవిభూషణ్ అవార్డ్ ని అందుకున్నారు .
3. 2007 లో రతన్ టాటాను "Fortune" పత్రిక ప్రకటించిన 25 most influential business people లో ఒకరుగా గుర్తించింది.
4. 2008 లో తాజ్ హోటల్ పై జరిగిన దాడుల తరువాత స్పందించిన తీరుతో టైం మాగజైన్ "Forbes " పత్రిక రతన్ టాటాని India 's most respected business leader గా కొనియాడింది (రాజకీయ రంగంలో అడుగుపెట్టాల్సిందిగా అభిప్రాయపడింది).
5. 2008 లో సింగపూర్ గవర్నమెంట్ Honorary Citizenship తో సత్కరించింది. రతన్ టాటా ఈ గొరవాన్ని అందుకున్న తొలి భారతీయుడు.
6. 2009 లో honorary Knight Commander of British Empire గా నియమించబడ్డారు.
7. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో Ohio State University నుంచి, టెక్నాలజీ రంగంలో Asian Institute of Technology నుంచి, సైన్స్ లో Warwick university నుంచి గౌరవడాక్టరేట్లతో పాటు, London School of Economics నుంచి Honorary fellowship ని అందుకున్నారు.
 
ఇన్ని విజయాలు సాధించి, 100 బిలియన్ డాలర్లకి పైగా వ్యాపారం చేస్తున్న సంస్థలకి అధిపతి అయినా ఈయన lifestyle మాత్రం చాలా సింపుల్. సెల్ఫ్ డ్రైవింగ్ లో వర్క్ ప్లేస్ కి వెళ్ళడం చాలా సాధారణమైన విషయం. ఇప్పటి వరకు పుస్తకాలు, CD లతో నిండివుండే సౌత్ ముంబై లోని బాచలర్ పాడ్ లో నివసిస్తున్న ఈ బిజినెస్ టైకూన్ రిటైర్మెంట్ తరువాత ముంబైలో తన కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న మాన్షన్ కి మారబోతున్నారు. స్మోకింగ్ & డ్రింకింగ్ కి దూరంగా ఉండే ఈయనకు రెండు జర్మన్ షెపర్డ్ డాగ్స్ ప్రియనేస్తాలు, అలాగే ఫాస్ట్ కార్స్ ని డ్రైవ్ చేయడం, జెట్స్ నడపటం, స్పీడ్ బోటింగ్ రేస్ లు హాబీలు. బాచలర్గా జీవితం గడుపుతున్న రతన్ టాటా ఇద్దరు అమ్మాయిలని దత్తత తీసుకున్నారు .
4.
టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీని సాంప్రదాయ సాధారణ కార్పోరేట్ సంస్థ స్థాయి నుంచి 100 బిలియన్ అమెరికన్ డాలర్ల కంపెనీగా మలిచి.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన గొప్ప వ్యాపారవేత్త. గత యాభై ఏళ్లలో టాటా గ్రూప్ ను ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ఘనత రతన్ టాటా సొంతం చేసుకున్నారు. భారతీయ కార్పోరేట్ వ్యవస్థలో కొత్త ప్రమాణాలకు నెలకొల్పిన గౌరవం రతన్ టాటాకే దక్కింది. లక్ష రూపాయలకే టాటా నానో కారు వంటి సంచలన నిర్ణయాలు రతన్ టాటా కెరీర్ లో మచ్చు తునకలు. గత 50 ఏళ్ల టాటా గ్రూప్ చరిత్రను ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చు. రతన్ టాటాలో అనేక విజయాలు సాధించిన వ్యాపారవేత్తతోపాటు.. ఓ మానవతావాది, ఓ సంఘసేవకుడు, ఓ దార్శనికుడు దాగి ఉన్నాడు.
 
రతన్ టాటా గురించి మరో కోణంలో చెప్పుకోవాల్సి వస్తే...కొన్ని ఆసక్తికరమైన, మనసును కదిలించే సంఘటనలు, సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. బ్రిటిష్ హోటళ్లలో భారతీయులకు ప్రవేశం లేదని నిరాకరించడంతో అవమానానికి గురైన సంఘటన.. జెమ్ షెడ్ జీ టాటా హోటళ్ల వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రేరణగా నిలిచింది. అలాంటి తాజ్ హోటల్ పై [[పాకిస్తాన్]] ఉగ్రవాదులు 2008 నవంబర్ 26న విచక్షణారహితంగా దాడులకు పాల్పడినపుడు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.<ref>{{Cite news|url=https://economictimes.indiatimes.com/news/defence/revisiting-the-night-of-mumbai-terror-attack-when-10-pak-terrorists-attacked-indias-financial-capital/articleshow/72235424.cms|title=Revisiting the night of Mumbai terror attack: When 10 Pak terrorists attacked India's financial capital|date=2019-11-26|work=The Economic Times|access-date=2020-05-07}}</ref>
 
* ఆస్తుల పునరుద్దరణకు వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నపుడు..ముంబై దాడుల్లో ప్రాణాలర్పించిన వారికి అదే మొత్తంలో ఎందుకు ఖర్చు చేయకూడదని సీనియర్ అధికారులను ప్రశ్నించిన మానవతవాది రతన్ టాటా.
* తాజ్ హోటల్ పై ఉగ్రవాదులు దాడి జరిపిన సమయంలో 54 మంది అతిధులను రక్షించిన కెప్టెన్ థామస్ జార్జి చివరి క్షణంలో నేలకొరగడంతో చలించిన రతన్ టాటా భోరున ఏడ్చారట. థామస్ జార్జ్ భార్య పిల్లలకు తాను ఏమి చేస్తే.. వారి రుణ తీర్చుకోగలను అని విలపించారట.
* ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాత డిసెంబర్ 21 తేదిన తాజ్ హోటల్ ను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా తాజ్ హోటల్ లో పనిచేసే ప్రతి ఒక్కరితో రతన్ టాటా సమావేశమై.. ఒక్కొక్కరి ధైర్య సహాసాలను, సేవా దృక్పథాన్ని కొనియాడారు. సంస్థలో జూనియర్, సీనియర్ అంటూ హోదాలతో పని విభజన జరుగుతుందని.. ఉగ్రవాదుల దాడి సందర్భంగా ట్రైనీగా పనిచేస్తున్న ఆమె సీనియర్ నుంచి ఆదేశాలు లేకుండానే అతిధులను ఆదుకున్నారని ఆ సందర్భంగా తాజ్ హోటల్ లో పనిచేస్తున్న మేనేజ్ మెంట్ ట్రైనీ గుర్తించి ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.
* ఉగ్రవాదుల దాడిలో గాయపడిన, మరణించిన వారి కుటుంబాలకు వివిధ రకాలుగా.. వీలైనంత మేరకు అన్ని రకాల సహాయాన్ని అందించారు.
* తన సంస్థల్లోనే పని చేసే సిబ్బందికే కాకుండా రైల్వే స్టేషన్లలో, ఇతర ప్రాంతాల్లో పావ్ బాజీ అమ్ముకునే వ్యాపారులకు, ఇతర షాపుల యజమానులకు రతన్ టాటా సహాయమందించారు.
* ఉగ్రవాదుల దాడుల్లో తాజ్ హోటల్ ధ్వంసం కావడంతో మూత పడితే.. తన సిబ్బందికి మనీ ఆర్డర్ ద్వారా ప్రతినెల జీతాలను చెల్లించారు.
* ఉగ్రవాదుల దాడిని చూసి షాకైన వ్యక్తులకు టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సిబ్బంది ద్వారా మానసిక చికిత్సను అందించారు.
* మానసికంగా కుంగిపోయిన వ్యక్తుల వివరాలను సేకరించి వారికి కూడా వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు.
* ప్రతి కుటుంబం ఆర్థిక, ఇతర పరిస్థితులను తెలుసుకోవడానికి ఓ అధికారిని నియమించి.. వారి అవసరాలను తీర్చాలని ఆదేశించారు.
* తన సిబ్బందిని కలుసుకోవడానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులకు హోటల్ ప్రసిడెన్సీలో మూడు వారాల వసతిని కల్పించారు.
* ముంబై పేలుళ్ల జరిగి పరిస్థితులు దారుణంగా మారినపుడు.. ఎవరికి ఏమీ కావాలో ఎలాంటి సంకొచం లేకుండా అడుగాల్సిందిగా వేడుకున్నారు.
* చాలా తక్కువ వ్యవధిలో తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు భరోసా కల్పించారు. తాజ్ మూసివేసిన కాలంలో ఉద్యోగులందరికి జీత భత్యాలను చెల్లించారు. అంతేకాకుండా ప్రతి ఉద్యోగికి అదనంగా 10 వేల రూపాయలను ఆరు నెలలపాటు అందించారు.
* ముంబైపై జరిగిన దాడుల్లో రోడ్డు పక్కన షాపును నడిపే ఓ వ్యాపారస్తుడి మనుమరాలు శరీరంలో నాలుగు బుల్లెట్లు దూసుకెళ్లడంతో చికిత్స కోసం ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయం తెలిసి రతన్ టాటా.. ఆ పాపను బాంబే ఆస్పత్రి తరలించి, పూర్తిగా కోలుకునేందుకు కొన్ని లక్షల రూపాయలను చికిత్స కోసం ఖర్చు చేశారు.
* ముంబై మారణకాండలో తోపుడు బండ్లను కోల్పోయిన వ్యాపారస్థులందరికి సహాయం చేశారు.
* ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు చెందిన సుమారు 46 మంది పిల్లల విద్యకు అయ్యే మొత్తం ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చారు.
* ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి అంత్యక్రియలకు తన సీనియర్ మేనేజర్లతో కలిసి మూడు రోజులపాటు రతన్ టాటా హాజరయ్యారు.
* తాజ్ పై దాడిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకు 36 లక్షల నుంచి 85 లక్షల రూపాయల (ఇతర బెనిఫిట్స్ కాకుండా) పరిహారాన్ని చెల్లించారు.
* దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగులు చివరి సారిగా అందుకున్న జీతాన్ని వారి కుటుంబ సభ్యులకు జీవితాంతం ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు.
* బాధిత కుటుంబాలకు చెందిన, ఆధారపడిన కుటుంబాల పిల్లలకు ప్రపంచంలో ఎక్కడైనా చదువుకునేందుకు గరిష్ఠపరిమితి లేకుండా డబ్బును అందించే బాధ్యతను తీసుకున్నారు.
* బాధిత కుటుంబాలకు, ఆధారపడిన కుటుంబాలకు జీవితకాలం వైద్య సౌకర్యాలను భరించేందుకు ముందుకు వచ్చారు.
* అన్ని రకాల రుణాలను, ముందస్తు వేతనాలను పూర్తిగా రద్దు చేశారు.
 
పదవీ విరమణ:
75 ఏళ్ల వయస్సులోకి అడుగుపెడుతున్న రతన్ టాటా జనరేషన్ మార్పు కోసం టాటా గ్రూప్ ఛైర్మన్ హోదా నుంచి తప్పుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. జేఆర్ డీ టాటా నుంచి అధికార పగ్గాలు అందుకున్న రతన్ టాటా 21 ఏళ్లపాటు ఛైర్మన్ హోదాలో కొనసాగారు. ప్రస్తుతం ఆయన స్థానంలో 44 ఏళ్ల సైరస్ మిస్త్రీకి టాటా గ్రూప్ అధికార బాధ్యతలను డిసెంబర్ 28న అప్పగించనున్నారు. టాటా గ్రూప్ లో మిస్త్రీకి చెందిన షాపూర్ జీ పల్లోంజి గ్రూప్ కు 18 శాతం వాటా ఉంది. రతన్ టాటా పర్యవేక్షణలో 1971 సంవత్సరంలో 10000 కోట్ల టర్నోవర్ ఉన్న టాటా గ్రూప్ ను 2011-12 ఆర్థిక సంవత్సరానికి 475, 721 (100.09 బిలియన్ యూఎస్ డాలర్లు) కోట్ల రూపాయల కంపెనీగా మలిచారు.
 
టాటా కంపెనీ రూపశిల్పులు
జంషెడ్‌జీ టాటా
భారతదేశంలో ఎంతో పేరున్న టాటా కంపెనీ ఇప్పటిది కాదు. 1868లో టాటా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ప్రారంభమైంది. అంటే 148 ఏళ్ల కిందట ప్రారంభమైంది. జంషెడ్‌జీ నస్సెర్‌వాన్‌జీ టాటా గ్రూప్‌ కంపెనీల వ్యవస్థాపకుడు. టాటా కంపెనీలకు ఆయన పితామహుడు. ఈరోజు టాటా ఇంతగా విస్తరించిందంటే అది ఆయన వేసిన పునాదివల్లే.
 
దోరాబ్జీ టాటా
టాటా గ్రూప్‌లో ఈయన టాటా స్టీల్‌, టాటా పవర్‌ సంస్థలను ప్రారం భించారు. టాటా గ్రూప్‌లో ఇప్పటికీ ఈ రెండు కంపెనీలే కీలకంగా ఉన్నా యి. ఒకవంక కొత్త కంపెనీలను ప్రారంభించడమే కాక, మరోవైపు భారత విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ సైన్స్‌ -ఐఐఎస్‌సి) ప్రారంభానికి ఆయన నిధులిచ్చి సహకరించారు. బెంగళూరు వెలుపల నెలకొన్న మొదటి పరిశోధనా సంస్థ ఇది.
 
నౌరోజీ సక్లత్‌వాలా
టాటా కుటుంబంతో సం బంధంలేని బయటి వ్యక్తి నౌరోజీ. సైరస్‌కు టాటాలతో దూరపు చుట్టరికం ఉన్నా, నౌరోజీకి అది కూడా లేదు. టాటా కుటుంబంతో సం బంధం లేకుండా ఆ గ్రూప్‌ నకు ఛైర్మన్‌ అయిన ఘనత ఈయనది.
 
జహన్‌గీర్‌ రతన్‌జీ దాదాభాయ్‌ టాటా
టాటా కంపెనీల విస్తరణకు ఈయన ఎంతో కృషి చేశారు. నేడు ఉన్న అనేక టాటా కంపెనీలకు ఆయన పునాదులు వేశారు. జెఆర్‌డి టాటాగా ఈయన ప్రసిద్ధిచెందారు. జెఆర్‌డి టాటా కంపెనీకి వచ్చేనాటికి ఆ గ్రూప్‌లో 14 సంస్థలే ఉండేవి. వాటిని 95 సంస్థలుగా విస్తరించిన ఘనత ఈయనకే దక్కుతుంది. జెఆర్‌డికి విమానయానమంటే మక్కువ. ఆ అభిరుచితో ఈయన టాటా ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ప్రభుత్వం దాన్ని జాతీయం చేసి, ఎయిర్‌ ఇండియాగా మార్చింది. సర్‌ దోరాబ్జీ టాటా ట్రస్ట్‌కు ఆయన ట్రస్టీగా ఉన్నప్పుడు టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (టిఐఎఫ్‌ఆర్‌), టాటా మెమోరియల్‌ సెంటర్‌ ఫర్‌ కేన్సర్‌ రీసెర్చ్‌, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిఐఎస్‌ఎస్‌), నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ (ఎన్‌సిపిఏ) లను జెఆర్‌డి నెలకొల్పారు.
 
రతన్‌ టాటా
టాటాకు ఉన్న వివిధ కంపెనీల బిజినెస్‌ను ఈయన విస్తరించారు. మొదట ఇండియాకే పరిమితమైన అనేక టాటా కంపెనీలను అంతర్జాతీయ స్థాయికి తెచ్చారు. అంతర్జాతీయ రంగంలో టాటాకు సముచిత స్థానాన్ని కల్పించారు. అంతర్జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కంపెనీలను తీర్చిదిద్దారు.
 
బాంబే హౌస్
టాటా గ్రూప్‌ ప్రధాన కేంద్రం బాంబే హౌస్‌. 87 ఏళ్ల నాటి బాంబే హౌస్‌ టాటా కార్పొరేట్‌ హెడ్‌క్వార్టర్స్‌. గత ఇరవై ఏళ్లలో అంటే...రతన్‌ టాటా టాటా సామ్రాజ్యానికి అధిపతి అయ్యాక బాంబే హౌస్‌లో ఎన్నో మార్పులు జరిగాయి. ఆయన బాంబే హౌస్‌లో మార్పులు చేయాల నుకున్నారు. చేశారు. అంతకుముందు జెఆర్‌డి టాటా హ యాం స్వర్ణయుగంగా భాసిందని చెప్పేవారు రతన్‌ వచ్చి చేసిన మార్పుల్ని జీర్ణించుకోలేకపోయారు.
 
ఆయన పగ్గాలు చేపట్టగానే, ప్రక్షాళన ప్రారంభించారు. అక్కడి పాత కాపులకు, వృద్ధతరానికి ఆయన ఉద్వాసన పలికారు. ఆ చర్య చాలామందికి నచ్చలేదు. ఆగ్రహం తెప్పించింది. నిన్నమొన్న వచ్చిన రతన్‌ ఈ మార్పులు ఎలా చేయగలరు? అంతకు ముందు జెఆర్‌డి హయాంలో ఇలాంటిది కనీవినీ ఎరగం’ అన్నారు. తనపై వచ్చిన విమ ర్శలకు రతన్‌ సమాధానం చెప్పకుండా ఉండడంతో ఆయ నపై అనుమానాలూ వచ్చాయి. ఎప్పటినుంచో ఉన్నవారిని తొలగించి విమర్శలకు గురైన రతన్‌ ఇండికా కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టడంతో మొదట కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చినా, తర్వాత ప్రశంసలు పొందారు. అలాగే, నానో కారు కూడా బాంబే హౌస్‌ నుంచి వచ్చిందే. ఇది టాటా సంస్థకు మరింత పేరు తెచ్చిపెట్టింది. నానో కారు పూర్తిగా రతన్‌ టాటా ఆలోచనే అంటారు. ఇది సా మాన్య ప్రజల్లో మొదట్లో ఆసక్తిని రేకెత్తించింది. లక్ష ల్లోనే ఆర్డర్లు వచ్చాయి. కానీ, ప్రస్తుతం డిమాండ్‌ తగ్గింది. కార్ల ఉత్పత్తిరంగంలో టాటా సుస్థిరస్థానాన్ని సంపాదిం చడానికి రతన్‌టాటాయే కారణమనడంలో సందేహం లేదు.
 
టాటాకు యువకోణం
రతన్‌జీ టాటా వారసుడిగా సైరస్‌ కొత్తగా రంగంమీద కనిపిస్తున్నా ఆయనకు టాటా ఆధిపత్యం కట్టబెట్టాలన్న ఆలోచన కొన్నేళ్ల కిందటే వచ్చింది. సమర్థులైన యువతరం వారికి టాటా సారథ్యాన్ని అందివ్వాలని రతన్‌ టాటా అనుకున్నారు. ఆ ఆలోచ నతోనే టాటా కంపెనీల్లో యువకులకు ప్రాధాన్యత ఇచ్చారు. 42 ఏళ్ల ఆర్‌ ముకుందన్‌ను 2008లో టాటా కెమికల్స్‌కు సిఈఓను చేశారు. 2009లో ఎన్‌ చంద్రశేఖరన్‌ను టిసిఎస్‌కు సీఈఓగా నియమించారు. అప్పుడాయన వయసు 46. అలాగే 2008లో టాటా టెలీసర్వీసెస్‌కు సారథిగా నియమితులైనప్పుడు ముకుంద్‌ రాజన్‌ వయసు కేవలం 40 ఏళ్లు.
 
టాటా కమ్యునికేషన్స్‌లో ఉన్నత పదవిలో నియమితులయ్యేనాటికి ఎన్‌ శ్రీనాథ్‌ వయసు 45 సంవత్సరాలు. మరో చిత్రమైన ఉదాహరణ కూడా ఉంది. బ్రోతిన్‌ బెనర్జీ 35 ఏళ్ల వయసులోనే టాటా హౌసింగ్‌కు సీఈఓగా మూడే ళ్ల క్రితమే ఎంపికయ్యారు. టాటా కంపెనీల్లో ఉన్నత పదవులు చేపట్టే నాటికి వీరందరి వయసుల సగటును తీస్తే సైరస్‌ 43 ఏళ్ల వయసు పెద్ద ఎక్కువేమీ కాదు. టాటా సంస్థల్లో ఉన్నత పదవులు చేపట్టే వారి సగటు వయ సు తగ్గించాలన్నది రతన్‌జీ ఉద్దేశం. దానిపై ఏమైనా సందే హాలుంటే అవి సైరస్‌ నియామకంతో తీరిపోయాయనే చెప్పాలి. ప్రస్తుతం టాటా కంపెనీల్లో ఉన్నత పదవుల్లో ఉన్న కొందరి వయసు 64 నుంచి 73 వరకు ఉంది.
 
[[కరోనా వైరస్ 2019|కరోనా]] మహమ్మారిపై పోరాటానికి టాటా ట్రస్ట్ ద్వారా రతన్ టాటా రూ.1,500 కోట్లు  అందించాడు.<ref>{{Cite news|url=https://economictimes.indiatimes.com/magazines/panache/heres-what-ratan-tata-said-after-announcing-rs-500-cr-donation-to-fight-covid-19/articleshow/74863039.cms|title=Here's what Ratan Tata said after announcing Rs 500 cr donation to fight Covid-19|date=2020-04-01|work=The Economic Times|access-date=2020-05-07}}</ref>
 
{{టాటా గ్రూపు ఛైర్మన్లు}}
"https://te.wikipedia.org/wiki/రతన్_టాటా" నుండి వెలికితీశారు