డొక్కా సీతమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి 183.83.173.89 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWBNew చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
ట్యాగు: 2017 source edit
పంక్తి 42:
 
==జీవిత విశేషాలు==
గోదావరి నది పాయలలోని లంకగన్నవరంలో సంపన్న కుటింబీకుడు డొక్కా జోగన్న పంతులు. పెద్ద రైతే కాకుండా, పంతులు వేద పండితుడైనందున ఒక రోజున పండిత సభకు వెళ్లి వస్తూ, [[మండపేట]] వచ్చేటప్పటికి మధ్యాహ్నమవడం వలన, భవానీ శంకరం గారి ఆహ్వానంపై వెళ్లి, ఆ పూట వారి ఆతిథ్యం స్వీకరించడం జరిగింది. జోగన్నకు ఆతిధ్యం ఇవ్వడం పట్ల సీతమ్మ చూపించిన ఆదరాభిమానాలకు ఆయన ముగ్ధుడు అవడం జరిగింది. అప్పట్లో యవ్వనంలో ఉన్న సీతమ్మ మర్యాద, అణకువ కూడా నచ్చి జోగన్నకు ఆమెను [[పెళ్ళి]]చేసుకోవాలనే కోరిక కలిగింది. ఆయనకు సాముద్రిక శాస్త్రంలో కూడా ప్రవేశం ఉంది. బువన్న సీతమ్మను డొక్కా జోగన్నకు ఇచ్చి [[వైభవం]]గా పెళ్ళి జరిపించాడు. సీతమ్మకు మెట్టినింట్లో అడుగు పెట్టగానే డొక్కా ఇంటి పేరుగా మారింది. ఆమెకు వయసుతో బాటు ఉదార గుణం కూడా నానాటికీ పెంపొందసాగింది. జోగన్న - సీతమ్మ గార్ల [[దాంపత్యం]] అన్యోన్యమైనది. ఆ పుణ్య దంపతులను చూసి ఆనందించనివారు లేరనే చెబుతుండే వారు. శుచి, శుభ్రతలతో బాటు ఆప్యాయతా, ఆదరణలకు వారి ఇల్లు పెట్టింది పేరుగా ఆ గ్రామమంతా చెప్పుకునేవారు. ఆ కాలంలో గోదావరి దాటాలంటే ఒకే ఒక ప్రయాణ సాధనం పడవ. జోగన్న ఊరు లంకగన్నవరం గోదావరికి మార్గమధ్యంలో ఉన్నందు వల్ల ప్రయాణీకులు అలసి అక్కడకు చేరేవారు. అలాటివారికి అన్నపానాలు సమకూర్చడం సీతమ్మ భర్తతో కలిసి చేస్తుండేది. ఆ ఇంటి దంపతుల లక్ష్యం ఒక్కటేగా ఉండేది. ఎవరు ఏ వేళలో వచ్చి భోజనమని అడిగినా లేదు, తర్వాత రా అనే పదాలే లేకుండా, ఆదరించి అన్నంపెట్టడం వారికి నిత్యకృత్యంగా మారింది.

ఆమె గురించిన కధల్లో... తన జీవిత చివరలో, ఆమె తన ఆస్తులను ఇచ్చి, తన హిందూ విశ్వాసాలకు అనుగుణంగా చనిపోవడానికి ఆమెను వారణాసికి తీసుకెళ్లడానికి ఒక ఎద్దు బండి డ్రైవర్‌ను నియమించింది, కానీ వెనక్కి తిరిగి, తరువాతి గదిలో ఆకలి గురించి విన్న తర్వాత ఒక కుటుంబానికి త్వరగా భోజనం వండినారు.
అలాగే ఒకసారి [[అంతర్వేది]] తీర్ధానికి ప్రయాణమైన వారు కొందరు తీర్ధ యాత్రికులు సీతమ్మ గారి ఇంటికి వెళ్ళలని అనుకోవడం విని వెనక్కి మరలినట్టుగా చెప్తారు.
 
ఈ మహాతల్లి జీవితచరిత్రను 1959 వ సంవత్సరంలో శ్రీ మిర్తిపాటి సీతారామఛయనులు గారు 'విరతాన్నధాత్రి శ్రీమతి డొక్కా సీతమ్మ' పేరిట గ్రంధస్తం చేయడంజరిగినది. ఈ గ్రంధమును వీరి పుత్రులు సర్వశ్రీ మిర్తిపాటి నారాయణ, మాచరిబాబు, వేంకట్రామయ్య గార్లు 2009 లో పునర్ముద్రించి ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకునిరావడం జరిగినది.
"https://te.wikipedia.org/wiki/డొక్కా_సీతమ్మ" నుండి వెలికితీశారు