మహమ్మద్ సిరాజ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 67:
==నేపధ్యము==
మంచి పేస్‌, స్వింగ్‌ కలిగిన సిరాజ్‌ హెచ్.సి.ఎ ఎ-డివిజన్‌ లీగ్‌లో సత్తాచాటాడు. ఎ-డివిజన్‌ ప్రదర్శనతో [[హైదరాబాదు|హైదరాబాద్‌]] అండర్‌-23 జట్టుకు ఎంపికైన సిరాజ్‌ అక్కడ్నుంచి వెనుదిరిగి చూడలేదు.
 
== మొదటి టెస్ట్ మ్యాచ్ ==
2020 భారత జట్టు ఆస్ట్రేలియా దేశ పర్యటన సందర్భంగా సిరాజ్ తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. బాక్సింగ్ డే మ్యాచ్ గా పిలవబడే ఆ మ్యాచ్ డిసెంబరు 26 న జరిగింది. ఈ మ్యాచ్ లో సిరాజ్ రెండు ఇన్నింగ్స్ లో కలిపి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో భారత జట్టు గెలిచింది.
 
==శిక్షణ==
అండర్‌-23 జట్టు తరఫున సత్తాచాటి హైదరాబాద్‌ రంజీ ట్రోఫీ జట్టుకు ఎంపికైన సిరాజ్‌.. కోచ్‌ భరత్‌ అరుణ్‌ దృష్టిలో పడ్డాడు. టీమ్‌ఇండియా [[బౌలింగ్‌]] కోచ్‌గా ఉన్న భరత్‌.. 2016 హైదరాబాద్‌ రంజీ జట్టుకు శిక్షకుడిగా వ్యవహరించాడు. ఒకరకంగా టీమ్‌ఇండియాకు సిరాజ్‌ ఎంపికలో భరత్‌దే కీలకపాత్ర! తొలి టీ20 తర్వాత ఆశిష్‌ నెహ్రా రిటైరవనున్న నేపథ్యంలో చివరి 2 మ్యాచ్‌లకు జయదేవ్‌ ఉనద్కత్‌ లేదా బాసిల్‌ థంపిలలో ఒకరికి అవకాశం లభిస్తుందని భావించారు. ఐతే వూహించని విధంగా సిరాజ్‌కు జట్టులో చోటు దక్కడం వెనుక భరత్‌ ఉండొచ్చన్నది క్రికెట్‌ వర్గాల అభిప్రాయం! ఇక 2016రంజీ ట్రోఫీలో సిరాజ్‌, రవికిరణ్‌, సీవీ మిలింద్‌లతో భరత్‌ సంచలనాలు నమోదు చేశాడు. గ్రూప్‌-సిలో ఉన్న హైదరాబాద్‌ను ఏకంగా క్వార్టర్‌ఫైనల్‌కు తీసుకెళ్ళాడు. గత రంజీ సీజన్‌లో ముగ్గురు పేసర్లు కలిసి 110 వికెట్లు తీయడం విశేషం. అందులో సిరాజ్‌ 18.92 సగటుతో 41 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో ఇరానీ ట్రోఫీలో పాల్గొనే రెస్టాఫ్‌ [[ఇండియా]]కు సిరాజ్‌ ఎంపికయ్యాడు.
"https://te.wikipedia.org/wiki/మహమ్మద్_సిరాజ్" నుండి వెలికితీశారు