హై హై నాయకా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
→‎కథ: చిన్న శైలి సవరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 26:
బడిలో ఉన్నవారంతా అతనికి చదువు చెప్పడానికి భయపడుతుండటంతో ఎవరైనా కొత్త పంతులు కోసం వెతుకుతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే సూర్యకాంతమ్మ తన మనవడిని అక్కడికి పంపిస్తుంది. వారు రామకృష్ణను చాలా సులువైన ప్రశ్నలు అడిగి ఆ ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఆ ఊర్లో ఉండటానికి అతి తక్కువ ఖర్చులో ఇల్లు, పనివాళ్ళను కూడా ఏర్పాటు చేస్తారు. రామకృష్ణ వచ్చి పిల్లలకు చక్కగా చదువు చెప్పటం మొదలు పెడతాడు. కానీ గోపీ ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయి అతన్ని చెడామడా వాయించేస్తాడు. దాంతో మిగతా పంతుళ్ళంతా పెద్దరాయుడు తమను ఏం చేసేస్తాడోనని భయపడిపోతారు. రామకృష్ణకు ఆ విషయం తెలిసి తను కూడా ఇల్లువదిలి పారిపోబోతాడు. కానీ అప్పటికే కొంతమంది మనుషులు వచ్చి అతన్ని రాయుడి దగ్గరకు తీసుకువెళతారు.
 
అక్కడ అతనికి రాధారాణి కనిపిస్తుంది. అప్పటికీ ఆమె రామకృష్ణను ద్వేషిస్తూనే ఉంటుంది. రాయుడు తన కుమారుడిని కొట్టినందుకు గాను రామకృష్ణపై బూతుల వర్షం కురిపిస్తాడు. చివరకు కొరడాతో కొట్టబోతుంటే అతన్ని ఆపి నిజానికి ఆ పిల్లవాడికంటే ఆ శిక్ష రాయుడుకే వేయాలంటాడు. ఆ పిల్లవాడి ప్రవర్తన అంతా తన తండ్రిని చూసే నేర్చుకున్నాడనీ, కాబట్టి గోపి చెడిపోవడానికి తనే కారణమనీ చెబుతాడు. దాంతో రాయుడు తన తప్పు తెలుసుకుని తన కొడుకును దారిలో పెట్టమనిపెట్టే రామకృష్ణకు అన్ని అనుమతులూ ఇస్తాడుఅప్పజెపుతాడు. రామకృష్ణ నెమ్మదిగా తన వినూత్నమైన బోధనా విధానం ద్వారా గోపీకి చదువువచ్చేటట్లు చేస్తాడు. రాయుడు కూడా అందుకు చాలా సంతోషిస్తాడు. ఒకసారి రాధారాణి రామకృష్ణను తిరస్కరించడం చూసిన ఉపాధ్యాయులు ఆమెకు అతను గురించి అన్నీ మంచిగా చెబుతారు. దాంతో ఆమె మనసు మార్చుకుని అతనిని పెళ్ళి చేసుకోవడానికి అంగీకరిస్తుంది. చివర్లో తన మనవణ్ణి అనుమానించినందుకు సూర్యకాంతమ్మ రాయుడిని, రాధారాణిని ఒక ఆట ఆడించాలని బడిలో ఉపాధ్యాయులతో కలిసి రామకృష్ణను దాచి పెడతారు. కానీ గోపీ సాయంతో రామకృష్ణ తప్పించుకుని రాధారాణిని పెళ్ళి చేసుకోవడంతో కథ ముగుస్తుంది.
 
==నటులు==
"https://te.wikipedia.org/wiki/హై_హై_నాయకా" నుండి వెలికితీశారు