ఉషారాణి భాటియా: కూర్పుల మధ్య తేడాలు

ఒక తెలుగు రచయిత్రి
(తేడా లేదు)

10:13, 2 జనవరి 2021 నాటి కూర్పు

ఉషారాణి భాటియా ఒక తెలుగు రచయిత్రి. ఈవిడ పలు పేరు పొందిన రచనలు చేశారు.

నేపధ్యము

నవలా, కథా రచయిత్రిగా నాలుగు దశాబ్దాల తెలుగు పాఠకలోకానికి ఉషారాణి భాటియా సుపరిచితులు. ఆమె ప్రసిద్ధ రచయిత చలం తమ్ముడు, తొలితరం సినీ, రంగస్థల నటి, రచయిత్రి కొమ్మూరి పద్మావతిదేవిల చిన్నకుమార్తె, కొడవటిగంటి కుటుంబరావుకు మరదలు. చెన్నైలో పుట్టి పెరిగి అక్కడే న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. ఆంధ్రపత్రికలో కొంతకాలం పని చేసి, దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ సలహా మేరకు ఢిల్లీలోని సెంట్రల్‌ సోషల్‌ వెల్‌ఫేర్‌ బోర్డు వారి ఆంగ్లపత్రిక సంపాదకవర్గంలో చేరారు. ఆ తరువాత నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌ తెలుగుశాఖ తొలి ఎడిటర్‌గా 1990 వరకు పదవీబాధ్యతలు నిర్వహించారు. పలు పుస్తకాల ప్రచురణతో పాటు బాలసాహిత్యాన్ని ప్రోత్సహించి ఎనలేని సేవ చేశారు. తాను స్వయంగా ‘చిన్నారి’, ‘తండ్రి కూతురు’, ‘ప్రతీకారం’, ‘అరుణోదయం’ నవలలు రాశారు.