ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు: కూర్పుల మధ్య తేడాలు

→‎ఆంధ్రుల్లో అనైక్యత: +శ్రీ బాగ్ కు మూలం
పంక్తి 29:
అయితే, ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి అన్ని ప్రాంతాల వాళ్ళూ కలిసి రాలేదు. అభివృద్ధి విషయంలో కోస్తా జిల్లాల కంటే వెనకబడి ఉన్న రాయలసీమ ప్రాంతం ప్రత్యేకాంధ్ర మరింత వెనకబడి పోతుందనే ఉద్దేశంతో, తమకూ ప్రత్యేక కాంగ్రెసు విభాగం కావాలనే ప్రతిపాదనను [[1924]]లో రాయలసీమ నాయకులు లేవదీసారు.
 
ఈ అపోహలకు, అనుమానాలకు తెరదించుతూ, 1937 నవంబరు 16 న చారిత్రాత్మకమైన [[శ్రీబాగ్‌ ఒడంబడిక]] కుదిరింది.<ref>{{Cite web|url=https://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/102829/9/09_chapter-iv.pdf|title=యాటిట్యూడ్స్ ఆఫ్ రాయలసీమ అండ్ సర్కార్ లీడర్స్|last=టి|first=వసుంధర|date=|website=శోధ్ గంగ|page=167|url-status=live|archive-url=|archive-date=|access-date=}}</ref> కోస్తా, రాయలసీమ నాయకుల మధ్య మద్రాసులో కుదిరిన ఈ ఒప్పందంతో రాయలసీమ నాయకులు సంతృప్తి చెందారు. ప్రత్యేకంధ్ర ఏర్పడితే, రాయలసీమకు ఎటువంటి ప్రత్యేకతలు ఉండాలనేదే ఈ ఒడంబడికలోని ముఖ్యాంశాలు.
 
[[1939]]లో [[కృష్ణా జిల్లా]] [[కొండపల్లి]]లో జరిగిన సభలో ప్రత్యేకాంధ్ర కోరుతున్న అన్ని సంస్థలూ విలీనమై ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సంఘంగా ఏర్పడ్డాయి. 1939 అక్టోబర్‌ కల్లా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యేలా ప్రయత్నించాలని ఆంధ్ర శాసనసభ్యులను కోరింది.