ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు: కూర్పుల మధ్య తేడాలు

→‎అంకురార్పణ: చిన్న చిన్న అక్షర దోషాలు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
→‎స్వాతంత్ర్యం తరువాత: తమిళుల వ్యతిరేకత
పంక్తి 29:
1937 లో మదనపల్లెలో పట్టాభి సీతారామయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో ప్రత్యేకాంధ్ర నిఒర్మాణంపై ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని వ్యతిరేకిస్తూ పాపన్న గుప్త ప్రసంగించాడు, తన ప్రసంగంలో అతడు మా సహకారం లేకుండా మీరు ప్రత్యేక రాష్ట్రాన్ని ఎలా సాధిస్తారో చూస్తాం అని అన్నాడు. మద్రాసు మంత్రివర్గంలో రాయలసీమకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వనంత వరకు, తుంగభద్ర ప్రాజెక్టు నిర్మించనంత వరకు, రాజధాని ఎక్కాడో నిర్ణయించనంతవరకూ, విశ్వవిద్యాలయం రాయలసీమకూ ఉపయోగపడేలా చెయ్యనంతవరకు ప్రత్యేక రాష్ట్ర ఆలోచన చెయ్యడం అవివేకం అని అతడు ప్రసంగించాడు. పాపన్న ప్రసంగాన్ని ఇంజేటి శ్రీకంఠేశ్వరరావు సమర్ధించాడు. పట్టాభి అతడి ఆరోపణలు నిజమేనని అంగీకరిస్తూ, అందుకు క్షమించమని కోరాడు. తమపై కోపంతో అరవలతో చేయి కలపడం సమంజసం కాదని చెప్పాడు.రాయలసీమకు అవసరమైన అన్ని సంరక్షణలను పేర్కొంటూ ఒక తీర్మానాన్ని చేసుకోవాలని, దాన్ని రాష్ట్ర సాధన ప్రణాళికలో భాగం చేసుకుందామనీ చెప్పాడు, అప్పుడు పాపన్న తదితరులు అందుకు ఆమోదించడంతో తీర్మానం అమోదం పొందింది. <ref>{{Cite web|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=21015|title=ఆంధ్ర రాష్ట్రమునకు రాయలసీమ ఆంధ్రుల ఆమోదము|last=|first=|date=|website=ఆంధ్రపత్రిక (www.pressacademyarchives.ap.nic.in)|page=7|url-status=live|archive-url=https://web.archive.org/web/20210105052905/http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=21015|archive-date=2021-01-05|access-date=2021-01-05}}</ref>
 
రాయలసీమ నాయకుల అపోహలకు, అనుమానాలకు తెరదించుతూ, 1937 నవంబరు 16 న చారిత్రాత్మకమైన [[శ్రీబాగ్‌ ఒడంబడిక]] కుదిరింది.<ref name=":1">{{Cite web|url=https://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/102829/9/09_chapter-iv.pdf|title=యాటిట్యూడ్స్ ఆఫ్ రాయలసీమ అండ్ సర్కార్ లీడర్స్|last=టి|first=వసుంధర|date=|website=శోధ్ గంగ|page=163,164,167|url-status=live|archive-url=|archive-date=|access-date=}}</ref> కోస్తా, రాయలసీమ నాయకుల మధ్య మద్రాసులో కుదిరిన ఈ ఒప్పందంతో రాయలసీమ నాయకులు సంతృప్తి చెందారు. ప్రత్యేకంధ్ర ఏర్పడితే, రాయలసీమకు ఎటువంటి ప్రత్యేకతలు ఉండాలనేదే ఈ ఒడంబడికలోని ముఖ్యాంశాలు.
 
[[1939]]లో [[కృష్ణా జిల్లా]] [[కొండపల్లి]]లో జరిగిన సభలో ప్రత్యేకాంధ్ర కోరుతున్న అన్ని సంస్థలూ విలీనమై ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సంఘంగా ఏర్పడ్డాయి. 1939 అక్టోబర్‌ కల్లా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యేలా ప్రయత్నించాలని ఆంధ్ర శాసనసభ్యులను కోరింది.
పంక్తి 46:
 
దీనితో అసంతృప్తి చెందిన ప్రముఖ గాంధేయవాది, [[స్వామి సీతారాం]] ([[గొల్లపూడి సీతారామశాస్త్రి]]) ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నాడు.<ref>{{Cite web|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=26141|title=స్వామి సీతారాం నిరశన దీక్ష ప్రారంభం|last=|first=|date=|website=ఆంధ్రపత్రిక|page=2|url-status=live|archive-url=https://web.archive.org/web/20210104184001/http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=26141|archive-date=2021-01-04|access-date=2021-01-04}}</ref> దీంతో ఉద్రిక్త భరిత వాతావరణం ఏర్పడింది. 35 రోజుల తరువాత, [[1951]] [[సెప్టెంబర్ 20]]న [[ఆచార్య వినోబా భావే]] అభ్యర్ధనపై ఆయన తన దీక్షను విరమించాడు.<ref>{{Cite web|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=26160|title=వినోబాభావే విజ్ఞప్తిపై స్వామీజీ ప్రాయోపవేశ విరమణ|last=|first=|date=|website=ఆంధ్ర పత్రిక (www.pressacademyarchives.ap.nic.in)|url-status=live|archive-url=https://web.archive.org/web/20210104184525/http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=26160|archive-date=2021-01-04|access-date=2021-01-04}}</ref> ఈ దీక్ష, ప్రజల్లో తమ నాయకుల పట్ల, కేంద్రప్రభుత్వం పట్ల అపనమ్మకం పెంచడం మినహా మరేమీ సాధించలేక పోయింది.
 
== తమిళ నాయకుల స్పందన ==
తమిళ నాయకులు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని వ్యతిరేకించారు. 1937 లో మద్రాసు ముఖ్యమంత్రిగా ఉన్న రాజాజీ బహిరంగంగానే వ్యతిరేకించాడు, అతడి ప్రభుత్వం లోని మంత్రి టి.ఎస్.ఎస్.రాజన్ రాజమండ్రిలో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. సత్యమూర్తి మాత్రం ఉద్యమాన్ని సమర్ధించాడు. తమిళుల వ్యతిరేకతను గమనించిన పట్టాభి, తమిళ మంత్రులు మనకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చేదానికంటే ముందే బ్రిటిషు వాళ్ళు భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చేట్టున్నారు. అని వ్యాఖ్యానించాడు.<ref name=":1" /> చివరికి అదే జరిగింది.
 
==కృష్ణా-పెన్నా ప్రాజెక్టు వివాదం ==