వేదాంతం సత్యనారాయణ శర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 38:
 
==జీవిత విశేషాలు==
వేదాంతం సత్యనారాయణ శర్మ [[1935]] [[సెప్టెంబరు 9]] న [[కృష్ణా జిల్లా]] [[కూచిపూడి]] గ్రామంలో జన్మించారు. కూచిపూడి ఇలవేల్పు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వరస్వామి [[దేవాలయం|దేవస్థానం]]లో పద్మశ్రీ సత్యనారాయణ శర్మకు 5వ ఏటనే నాట్య గురువులు [[వేదాంతం ప్రహ్లాదశర్మ|వేదాంతం ప్రహ్లదశర్మ]] నాట్యంలో [[అరంగేట్రం]] చేయించారు. దివంగత వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్త్రి వద్ద శిక్షణ పొంది యక్షగానాలు, భామా కలాపాలు, [[నాటకాలు]], భరత కళా ప్రపూర్ణ [[చింతా కృష్ణమూర్తి]] వద్ద నాట్యంలో తర్ఫీదుపొందారు. కూచిపూడి సంగీతాన్ని, [[వయొలిన్|వయోలిన్‌]]ను కూడా చిన్న వయస్సులోనే ఔపోసన పట్టారు. తన 18వ యేటనే అనగా 1953లో [[ఢిల్లీ]]లో అప్పటి ప్రధాని [[జవాహర్ లాల్ నెహ్రూ|జవహర్‌లాల్‌ నెహ్రూ]] సమక్షంలో ఉషాపరిణయం నాటకంలో పార్వతీ పాత్రను పోషించి స్త్రీ పాత్రధారణకు ప్రాణం పోశారు. అప్పటి నుంచి [[స్త్రీ]] పాత్రలలో రాణించారు. అభినవ [[సత్యభామ]]గా సత్యనారాయణ శర్మ మంచి గుర్తింపు పొందారు. దేశ విదేశాలలో సత్యనారాయణశర్మ అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన [[పద్మశ్రీ పురస్కారం]], కేంద్ర సంగీత నాటక అకాడమీ, ఆంధ్రప్రదేశ్‌ నృత్య అకాడమీ, భారత కళా ప్రపూర్ణ, కళాదాస్‌ సన్మాన అవార్డులను అందుకున్నారు. [[భామా కలాపం]]లో [[సత్యభామ]], [[శ్రీకృష్ణుడు]], సూత్రధారులనే మూడు పాత్రలతో నడిచిన [[శృంగారం|శృంగార]], [[భక్తి]], జ్ఞాన, [[వైరాగ్యం|వైరాగ్య]] బోదకమైన ముచ్చటగొలిపే నాటక ప్రక్రియ. సత్యభామ పాత్రలు పోషించిన వారు ఆనాటి నుండి ఈనాటి వరకూ ఎందరో ఉన్నా సమకాలీనంగా గుర్తుకు వచ్చేది ఈయనే. ఆయనకు భార్య ల క్ష్మీ నరసమ్మ, ఇద్దరు కుమార్తెలునాగలక్ష్మి, రాధ, [[కొడుకు|కుమారుడు]] నాగ ప్రసాద్‌ ఉన్నారు.
 
==పిన్నవయస్సులోనే...==