సినిమా అభిమానులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
== విమర్శలు ==
అభిమానుల ధోరణులు, పద్ధతుల పట్ల సమాజంలో చాలా విమర్శలు ఉన్నాయి. కటౌట్లు కట్టేప్పుడు అడ్డుతగిలిన విద్యుత్ వైర్లు షాక్ కొట్టి, టిక్కెట్ల కోసం పోటీపడేప్పుడు తొక్కిసలాటలో పడి ప్రాణాలు కోల్పోయిన అభిమానులు ఎందరో ఉన్నారు. ఈ సందర్భంలో హీరోలు స్పందించి బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించారు.<ref name=":1">{{Cite web|url=http://andhrabhoomi.net/content/others-242|title=ఫ్యాన్సే నిజమైన హీరోలు!|last=|first=|date=|website=andhrabhoomi.net|url-status=live|archive-url=|archive-date=|access-date=2021-01-09}}</ref><ref>{{Cite web|url=https://telugu.oneindia.com/news/andhra-pradesh/mahesh-fan-jumps-to-eluru-canal-143445.html|title=ఆగడు కటౌట్: కాల్వలోకి దూకిన మహేష్ అభిమాని|last=Srinivas|first=|date=2014-09-14|website=తెలుగు వన్ ఇండియా|language=te|url-status=live|archive-url=|archive-date=|access-date=2021-01-09}}</ref><ref>{{Cite web|url=https://telugu.asianetnews.com/andhra-pradesh/maharshi-movie-release-effect-mahaesh-babu-fan-dead-in-dhavaleswaram-theater-pr7s4a|title=మహర్షి సినిమా రిలీజ్ ఎఫెక్ట్: ఫ్లెక్సీ కడుతూ అభిమాని దుర్మరణం|website=Asianet News Network Pvt Ltd|language=te|access-date=2021-01-09}}</ref> కొందరు అభిమానులు, అభిమాన సంఘ నాయకులు తమ స్వంత డబ్బును సినిమాల వేడుకల కోసం, అలంకరణల కోసం వెచ్చించి ఆర్థికంగా నష్టపోయి ఇబ్బందుల్లో పడ్డారు.<ref>{{Cite web|url=https://telugu.asianetnews.com/entertainment/charanjeevi-fan-asking-for-help-arj-qkr0gt|title=చిరంజీవి కోసం అన్నీ అమ్ముకుని..సాయం కోసం రోడ్డెక్కిన అభిమాని|website=Asianet News Network Pvt Ltd|language=te|access-date=2021-01-09}}</ref> మొదటి రోజే సినిమా చూడకపోతే అవమానకరమనీ, మొదటి షో చూడడం తమకు ప్రతిష్టాత్మకమని భావించే అభిమానుల వల్ల మొదటి రోజు టిక్కెట్ల ఖరీదు విపరీతంగా పెంచడం పరిపాటి అయిపోయింది.<ref name=":0" /> హీరోల కటౌట్లకు క్షీరాభిషేకాలు చేయడం వల్ల పాల వంటి ఆహారపదార్థాలు వృధా అవుతున్నాయని దీనిపై చెన్నై హైకోర్టులో వ్యాజ్యం కూడా నడిచింది.<ref name=":1" />
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సినిమా_అభిమానులు" నుండి వెలికితీశారు