"ఎస్.పి.శైలజ" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
 
==జీవితసంగ్రహం==
నెల్లూరు జిల్లా [[కోనేటమ్మ పేట]]లో సాంప్రదాయ [[శైవము|శైవ]] [[కుటుంబము|కుటుంబం]]లో జన్మించిన సుశీలశైలజ తండ్రి సాంబమూర్తి [[హరికథ|హరికథా]] భాగవతారు. అన్న [[ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం]] దక్షిణ భారత సినిమా రంగంలో పేరొందిన నేపథ్యగాయకుడు. తండ్రి, అన్న కూడా ఈమెను బాగా చదివించాలని అనుకునేవారు.
 
1977లో బాలసుబ్రహ్మణ్యం ట్రూపు వారు విదేశాలలో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు వారికి వీడ్కోలు ఇవ్వడానికి విమానాశ్రయానికి శైలజ కూడా వెళ్ళింది. అక్కడ [[విమానం]] ఆలస్యం కావడంతో కాలక్షేపానికి సినీ దర్శకుడు [[కె.చక్రవర్తి]] సమక్షంలో సరదాగా పాటలు పాడింది. ఆ తర్వాత చక్రవర్తి గారు ఆమెను తొలిసారిగా [[మద్రాసు]] పిలిపించి [[మార్పు]] (1978) సినిమా కోసం పాట పాడించారు.<ref>మెలొడీలోనే ఉంది మజా! నేపథ్య గాయని [[శైలజ]]తో ముఖాముఖి, ఈనాడు ఆదివారం, 28 డిసెంబరు 2008.</ref> ఈనాటి దర్శకుడు [[తేజ]] ఆ సినిమాలో చిన్న పిల్లవాడిగా నటించాడు. ఈమె పాడిన [[పాట]]లలో [[సాగర సంగమం]]లోని "వేదం అణువణున నాదం", [[మొండి మొగుడు పెంకి పెళ్ళాం]]లోని "లాలూ దర్వాజ కాడా లష్కర్" అన్న పాటలు కొన్ని చాలా పేరొందాయి.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3093054" నుండి వెలికితీశారు