సినిమా అభిమానులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
=== కుల నేపథ్యాలు ===
తెలుగు సినిమా హీరోల కులాలను బట్టి ఆయా కులాలకు చెందినవారు అభిమానులుగా మారడం అన్నది తెలుగు సినిమా రంగంలో దశాబ్దాలుగా ఉన్న ధోరణి. పాత్రికేయురాలు ప్రియాంక రిచి ప్రకారం "ఈ అభిమానులు స్టార్ యొక్క ఇమేజ్‌కు స్వయం ప్రకటిత పరిరక్షకులుగానూ, మరీ ముఖ్యంగా వారి కుల గౌరవానికి సంరక్షకులుగానూ పరిగణించుకుంటారు." 1970లు, 80ల్లోనే పలు కులాలు ఒక్కో సినిమా హీరోను తమ కులానికి ప్రతినిధిగా, కుల గౌరవానికి ప్రతీకగా భావించడం ఉన్నది. క్రమేపీ అది పెరుగుతూనే వచ్చింది. ఈ కుల అభిమానాలు కొన్నిసార్లు పలు కులాల - అభిమాన సంఘాల మధ్య వివాదాలుగానూ పరిణమించాయి.<ref name=":2">{{Cite web|url=https://www.thenewsminute.com/article/how-caste-integral-functioning-telugu-film-industry-114627|title=How caste is integral to the functioning of the Telugu film industry|date=2019-12-23|website=The News Minute|language=en|access-date=2021-01-09}}</ref>
 
=== ఘర్షణలు, యాంటీ ఫ్యాన్లుఫ్యాన్స్ ===
ఒకప్పుడు ఎదుటి హీరో పోస్టర్ల మీద ఒక హీరో అభిమానులు పేడ కొట్టేవారు. అక్కినేని నాగేశ్వరరావు దీన్ని ప్రస్తావిస్తూ - తానూ, రామారావు ఇలానే ఒకరి అభిమానులు, మరొకరి పోస్టర్ల మీద పేడ కొడితే ఆ పేడ ఎరువుగా ఎదిగామని చమత్కరించాడు. వేర్వేరు హీరోల అభిమానులు ఘర్షణలు పడడం, కొన్నిసార్లు ఆ ఘర్షణల్లో కొందరు మరణించడం వంటి సంఘటనలు కూడా జరిగాయి. ఈ వివాదాల్లో కుల, రాజకీయ విభేదాలు కూడా కారణం కావడం ఉంది.<ref name=":2" /> వివాదాలకు కారణాలుగా ఒక హీరో ఫ్లెక్సీ తీసివేసి మరొక హీరో ఫ్లెక్సీ పెట్టడం, హీరోని వేరే హీరో అభిమానులు తిట్టడం వంటివి ఉన్నాయి.<ref>{{Cite web|url=https://telugu.oneindia.com/talk-of-the-day/controversy-erupts-on-mahesh-babu-flexi-210183.html|title=హీరోల ఫ్లెక్సీల వివాదం: మహేష్ బాబు వర్సెస్ పవన్ కల్యాణ్|last=Pratap|first=|date=2017-09-05|website=telugu.oneindia.com|language=te|url-status=live|archive-url=|archive-date=|access-date=2021-01-10}}</ref><ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-403872#!|title=పవన్‌, ప్రభాస్‌ అభిమానులకు పోలీసుల కౌన్సెలింగ్‌|last=|first=|date=2017-04-26|website=www.andhrajyothy.com|url-status=live|archive-url=|archive-date=|access-date=2021-01-10}}</ref><ref>{{Cite web|url=http://www.andhrabhoomi.net/content/wg-2218|title=భీమవరంలో ఫ్లెక్సీ వివాదం {{!}} Andhrabhoomi - Telugu News Paper Portal {{!}} Daily Newspaper in Telugu {{!}} Telugu News Headlines {{!}} Andhrabhoomi|website=www.andhrabhoomi.net|access-date=2021-01-10}}</ref>
 
== విమర్శలు ==
"https://te.wikipedia.org/wiki/సినిమా_అభిమానులు" నుండి వెలికితీశారు