బలం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
 
బాగా ముగ్గిన పండు చెట్టుని వదలి భూమి మీదకి పడుతోందంటే ఆ పండుని ఏదో అదృశ్యమయిన బలం కిందికి లాగుతున్నాదనే భావన కలగక మానదు. పైనుండి కిందకి పడే వాటన్నిటికి ఉమ్మడిగా కిందను ఉన్నది భూమే కనుక భూమి ఆ వసువుని ఆకర్షింఛటం వల్ల ఆ వస్తువు కిందకి పడుతున్నాదని సిద్ధాంతీకరించవచ్చు. పరిశీలనా దక్షుడయిన నూటన్‌ ఏమన్నాడంటే "చెట్టునున్న పండునే కాదు, ఆకాశంలో ఉన్న చంద్రుడిని కూడ భూమి ఆకర్షిస్తున్నాది" అన్నాడు. అంతే కాదు "విశ్వంలో ఉన్న ప్రతి వస్తువూ ప్రతి ఇతర వస్తువునీ ఆకర్షిస్తున్నాది" అన్నాడు. "ఈ ఆకర్షణ ప్రభావం వల్లనే గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి" అని కూడ అన్నాడు. ఇదే నూటన్‌ ప్రవచించిన గురుత్వాకర్షణ సిద్ధాంతం.
 
గురుత్వాకర్షణలో ఒక భాగమే భూమ్యాకర్షణ. భూమ్యాకర్షణ లక్షణం ఏమిటంటే తన చేరువలో 'పై నుండి కిందకి' పడే ప్రతి వస్తువులోనూ ఒకే 'సమ త్వరణం' (uniform acceleration) కలిగించటం. దీనిని g అనే ఇంగ్లీషు అక్షరంతో సూచించం సంప్రదాయం. దీని విలువ సుమారుగా 980 సెంటీమీటర్లు/సెకండు<sup>2</sup>. ఈ సమ త్వరణం సదిశ రాశి (vector). దీని దిశ ఎల్లప్పుడూ భూమి కేంద్రం వైపే చూపుతూ ఉంటుంది.
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/బలం" నుండి వెలికితీశారు