తుర్లపాటి కుటుంబరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 36:
}}
 
'''తుర్లపాటి కుటుంబరావు''' ([[ఆగస్టు 10]], [[1933]] - [[జనవరి 11]], [[2021]]) పాత్రికేయుడు, రచయిత, వక్త. చిన్నప్పడే [[నార్ల వేంకటేశ్వరరావు]] గారి సంపాదకీయాలకు ప్రభావితుడై పత్రికారచన ప్రారంభించాడు. 2002 లో [[భారత ప్రభుత్వం]] [[పద్మశ్రీ పురస్కారం]]తో పాటు మరెన్నో పురస్కారాలు పొందాడు. తన 60ఏళ్ల పైబడిన పాత్రికేయవృత్తిలో 30, 40, 50, 60 వార్షికోత్సవాలను ప్రముఖుల చేతులమీదుగా జరుపుకొన్న వ్యక్తి.1993 నాటికి పదివేలకు పైబడి బహిరంగసభలకు అధ్యక్షోపన్యాసాలు చేసి మంచి వక్తగా పేరుతెచ్చుకున్నాడు. అర్ధశతాబ్ది కాలంలో ఏ పదవి లేకుండా కేవలం ఉపన్యాసకుడుగా సభలకు అధ్యక్షునిగా వ్యవహరించిన వ్యక్తి తుర్లపాటి కుటుంబరావే నని [[గిన్నిస్ బుక్ఆఫ్ వరల్డ్ రికార్డ్స్]] అధ్యక్షుడు పేర్కొన్నాడు. 2010 జూన్ 21 న అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో [[ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ పరిషత్]] చివరి అధ్యక్షునిగా బాధ్యతలుపనిచేశాడు. చేపట్టాడు<ref>{{Cite web|title=Turlapati assumes charge|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/turlapati-assumes-charge/article478327.ece|publisher=The Hindu|date= 2010-06-22|accessdate=2014-02-23}}</ref> .
== వ్యక్తిగత జీవితం==
తుర్లపాటి కుటుంబరావు ఐదుగురు సహోదరులలో మధ్యముడు. తనకు అక్క, అన్న, [[తమ్ముడు]], చెల్లి ఉండడంతో ప్రతి విషయంలో ఆలోచనలు మధ్యమ మార్గంగా ఉండేవని అన్నాడు. తండ్రి [[న్యాయవాది]] కనుక న్యాయవాది కావాలని కోరిక ఉన్నా చివరికి పాత్రికేయుడిగా మారాడు. [[పామర్రు]] ఉన్నతపాఠశాలలో నాల్గవ ఫారం చదువుతున్నప్పుడు వక్తృత్వ పోటీలలో రాణించాడు. అయితే ''స్త్రీలకు విద్య అవసరమా? కాదా?'' అనే చర్చాంశంలో అవసరం కాదని హేళనతో ఉపన్యసించినప్పుడు బాధపడిన విద్యార్థినులకు క్షమాపణ చెప్పి, తన మాటలను ఉపసంహరించుకున్నాడు. ఆ తరువాత స్త్రీలను గౌరవించాలని నిర్ణయించుకొని కృష్ణకుమారిని ముందు పరిచయాలలో పిలుపుకు వాడిన ''ఏమండీ'' అనే పదాన్ని భార్య అయిన తర్వాత కూడా కొనసాగించాడు.