→శక్తి అంటే ఏమిటి?
చి (→పని) |
|||
శక్తి అనగానే మన శరీరంలో ఉండే సత్తువ, విద్యుత్ కేంద్రాలు ఉత్పత్తి చేసే విద్యుత్ శక్తి, రైలు ఇంజను రైలు పెట్టెలను లాగటానికి కావలసిన శక్తి, మొదలైన భావాలు ఎన్నో మనస్సులో మెదులుతాయి. విశేషం ఏమంటే శక్తికి నిర్దిష్టమైన రూపు లేదు; మనకి అనేక రూపాల్లో ప్రత్యక్షమవుతూ ఉంటుంది. శక్తి పదార్ధం రూపంలో ఉన్నప్పుడు దానిని చేతిలోకి తీసుకొని పట్టుకోవచ్చు; కాని ఎల్లప్పుడూ ఇది సాధ్య పడదు. శక్తి [[కాంతి]] (light) రూపంలో ఉన్నప్పుడు కంటికి కనబడుతుంది; కాని ఎల్లప్పుడూ కంటికి కానరాదు. ఇందు గలదు, అందు లేదు అనే సందేహం లేకుండా ఎందెందు చూస్తే అందందే 'కనిపిస్తుంది' ఈ శక్తి; కంటికి కనిపించక పోయినా దాని ఉనికిని మనం గుర్తించవచ్చు.
పదహారవ శతాబ్దం లగాయతు జరిగిన [[శాస్త్రీయ విప్లవం]] (scientific revolution) వల్ల ఈ నాడు 'శక్తి' యొక్క నిజ స్వరూపం మనకి అర్ధం అవుతోంది. [[పారిశ్రామిక విప్లవం]] (industrial revolution) తో పాటు శక్తిని అదుపులో పెట్టి వినియోగ పరచే యంత్రాలు రావటం, విద్యుత్ శక్తి నిజ స్వరూపం అర్ధం అవటం, [[అణువు]] (atom) ని విచ్ఛిన్నం చేసి దాని గర్భంలో శక్తిని ఆవిష్కరించటం - ఇవన్నీ గత రెండు-మూడు శతాబ్దాలలో జరిగినవే.
==పని (work)==
|