ఇంద్రజిత్తు: కూర్పుల మధ్య తేడాలు

చి robot Adding: ja:インドラジット
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Victory of Meghanada by RRV.jpg|right|thumb|200px|మేఘనాధుని విజయం.<br>[[రాజా రవివర్మ]] గీసిన చిత్రం.]]
'''ఇంద్రజిత్తు''' (సంస్కృతం: इन्‍द्र जीत) [[రావణాసురుడు|రావణాసురిడికి]] [[మండోదరి]] కి జన్మించిన కుమారుడు. ఇంద్రజిత్తు జన్మించినప్పుడు అరచిన అరుపు [[మేఘం]] ఉరిమిన పిడుగు శబ్ధం వలే ఉండడం వల్ల వీనికి '''మేఘనాధుడు''' అని నామకరణం చేశారు. [[స్వర్గం|స్వర్గానికి]] వెళ్ళి [[ఇంద్రుడు|ఇంద్రుడిని]] జయించినందున ఇంద్రజిత్తు అయ్యాడు. ఈ సందర్భంగా [[బ్రహ్మ|పరమేష్ఠి]] అనుగ్రహం వల్ల బ్రహ్మాస్త్రాన్ని సంపాదిస్తాడు. యుద్ధ సంగ్రామంలో అకాశంలోకి వెళ్ళి మేఘాలలో యుద్ధాలు చెయ్యగలగడం ఇంద్రజిత్తు గొప్పతనం. ఇంద్రజిత్తు యెక్క సంగ్రామచాతుర్యాన్నిసంగ్రామ చాతుర్యాన్ని [[వాల్మీకి]] మహర్షి [[రామాయణం]] [[యుద్ధకాండ]]లో వర్ణిస్తారు.
 
[[రాముడు|రామ]] రావణుల మధ్య జరిగిన మహాయుద్ధములో ఇంద్రజిత్తు చురుకైన పాత్రను పోషించాడు. ఇంద్రజిత్తు ఆ యుద్ధములో రామలక్ష్మణులను [[నాగపాశము]]తో బంధించాడు. అయితే [[గరుడుడు]] వారిని నాగాపాశమునుండి విడిపించాడు. ఇంద్రజిత్తు ఏదైనా యుద్ధానికి వెళ్లేముందు యజ్ఞము చేసి వెళ్లేవాడు. ఆ యజ్ఞమహిమ వలన ఈయనను యుద్ధంలో ఓడించటం ఎవరివళ్లా సాధ్యంకాదు. ఆ యజ్ఞాన్ని భంగం చేయటమే ఈయనను చంపటానికి ఏకైక మార్గమని గ్రహించిన [[లక్ష్మణుడు]] యజ్ఞానికి ఆటంకం కల్పించి ఇంద్రజిత్తు ధాన్యంలో ఉండగా చంపాడు.
"https://te.wikipedia.org/wiki/ఇంద్రజిత్తు" నుండి వెలికితీశారు