వేమన శతకము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 577:
కంచు మోగినట్లు కనకంబు మోగునా
విశ్వదాభిరామ వినుర వేమ!
 
విస్వానికి నీతిని భోధించే ఓ వేమనా! కంచు వస్తువు మ్రోగునట్లు బంగారు వస్తువు మ్రోగదు కదా! అలాగే నీచుడు ఎప్పుడూ మంచివానిలా మాట్లాడలేడు!
 
98.
Line 603 ⟶ 605:
 
102.
చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె
అనువుగాని చోట అధికుల మనరాదు
నీట బడ్డ చినుకు నీట గలిసె
కొంచెముండుటెల్ల కొదువగాదు
బ్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా
కొండ యద్దమందు కొంచెమై యుండదా
విశ్వదాభిరామ వినురవేమ!
 
ముత్యపు చిప్పలో పడిన స్వాతి వాన చినుకు, ముత్యముగా మారుతుంది. నీటిలో బడ్డ చినుకు వ్యర్థమవుతుంది. ప్రాప్తి వుంటే తప్పకుండా లాభము కలుగుతుంది!
 
103.
Line 661 ⟶ 665:
కొయ్యబొమ్మ తెచ్చి కొట్టితే గుణియోనె
విశ్వదాభిరామ వినురవేమ
 
ఎలుక తోలు అదేపనిగా సంవత్సరముతికినను తెల్లబడదు, అట్లే చిక్క బొమ్మను తెచ్చి కొట్టినను మాటలాడదు!
 
112.
Line 691 ⟶ 697:
కొండ యద్దమందు కొంచమై ఉండదా
విశ్వదాభిరామ వినురవేమ
 
తగని చోట గొప్పవారమని చెప్పుకోరాదు, తగ్గియుండుట మంచిది. అద్దంలో కొండ చిన్నదిగా కనిపించినంత మాత్రాన చిన్నదైపోతుందా!
 
117.
Line 770 ⟶ 778:
భక్తికల్గుకూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ
 
గాడిద పాలు ఒక కుండ కంటె చిక్కని ఆవుపాలు గరిటెడు మేలైనట్లుగా భక్తితో చేసిన కూడు పట్టెడు చాలును కదా!
 
130.
Line 776 ⟶ 786:
బలిమిలేని వేళ పంతములు చెల్లవు
విశ్వదాభిరామ వినురవేమ
 
శక్తి లేనప్పుడు సింహాన్ని కూడ బక్క కుక్క కరిచి భాధ పెడుతుంది, బలిమి లేని సమయంలో పౌరుషం తగదు!
 
131.
Line 807 ⟶ 819:
పేదవేళ జూడు పెండ్లాము గుణము
విశ్వదాభిరామ వినురవేమ
 
ఆపదలందు సాయపడువారే బంధువులు, భయముతో ఉన్నపుడు ధైర్యము వహించువాడే వీరుడు, బీదతనములో కూడ గౌరవించునదే భార్య!
 
137.
ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు
Line 812 ⟶ 827:
పురుషులందు పుణ్య పురుషులు వేరయ
విశ్వదాభిరామ వినురవేమ!
 
ఉప్పు, కర్పూరం చూడటానికి వొకేలాగ వుంటాయి. రుచిలో మాత్రం తేడా వుంటుంది. అలాగే పురుషులందు ఉత్తములు వేరుగా వుంటారు!
 
138.
ఆత్మ శుద్ది లేని యాచారమదియేల
Line 817 ⟶ 835:
చిత్తశుద్దిలేని శివపూజలేలరా
విశ్వదాభిరామ వినురవేమ!
 
మనసు నిర్మలంగా లేకుండా ఆచారం ఎంధుకు? వంట పాత్ర శుబ్రంగా లేని వంట ఎందుకు? స్థిరచిత్తం లేని శివ పూజలు కూడ వ్యర్థమే!
 
139.
యినుము విరగనేని యినుమూరు ముమ్మారు
Line 822 ⟶ 843:
మనసు విరిగెనేని మరి చేర్ఛరాదయా
విశ్వదాభిరామ వినురవేమ!
 
ఇనుప వస్తువు విరిగితే రెండు, మూడుసార్లు మళ్లీ అతకవచ్చు, కాని మనసు విరిగితే మాత్రం అతకడం అసాధ్యం!
 
140.
కుండ కుంభమన్న కొండ పర్వతమన్న
Line 827 ⟶ 851:
భాష లిట్టె వేరు పరతత్వమొకటె
విశ్వదాభిరామ వినురవేమ!
 
కుండ-కుంభము, కొండ-పర్వతం, ఉప్పు-లవణం అర్థమొకటే, భాషలు వేరైన పరతత్వమొకటే కదా!
 
141.
అనగ ననగ రాగ మతిశ యిల్లుచునుండు
దినగ దినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ!
 
పాడుతూ పాడుతూ వుంటే రాగము వృద్ది అవుతుంది. తినగా తినగా వేపాకు కూడా తియ్యగా వుంటుంది. అలాగే సాధనము వల్ల ఇలలో పనులన్నీ అవుతాయి!
142.
చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలి ముల్లు
ఇంటిలోని పోరు నింతింత గాదయా
విశ్వదాభిరామ వినురవేమ!
 
చెప్పులో రాయి, చెవిలో జోరీగ, కంటిలోని నలుసు, కాలిలోని ముల్లు, ఇంటి లోని తగవు వల్ల కలిగే భాధ చెప్పనలవిగానిది!
 
143.
తప్పు లెన్నువారు తండోప తండంబు
లుర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పు లెన్నువారు తమ తప్పులెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ!
 
తప్పుపట్టేవారు చాలామంది, కాని లోకమందుగల జనులందరకును తప్పులెరగునంత సులభముగా తమ తప్పు గ్రహించలేరు!
 
144.
మిరప గింజ చూడ మీద నల్లగనుండు
కొరికి జూడలోన జురుకుమనును
సజ్జను లగు వారి సార మిట్లుండు
విశ్వదాభిరామ వినురవేమ!
 
మిరియపు గింజ మేద నల్లగా ఉన్నా, కొరికితే నాలుక చురుక్కుమనును! మంచివారు పైకెట్లుండినను తరచి చూచినచో బయల్పడుదురు!
 
145.
మేడిపండు చూడ మేలిమై యుండును
పొట్టవిచ్చి చూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ!
 
అత్తిపండు పైకందముగా నుండి లోపల పురుగులతో నిండీయుంటుంది, అలాగే పిరికి వాని మనసు పైకి ధైర్యముగా వున్నను-లోపల మాత్రం అధైర్యముగానే వుంటుంది!
146.
వేరు పురుగు చేరి వృక్షంబు జెరుచును
చీడపురుగు చేరి చెట్టు జెరచు
కుత్సితుండు చేరి గుణవంతు జెరచురా
విశ్వదాభిరామ వినురవేమ!
 
వేరుపురుగు గొప్ప చెట్టును పాడుచేయును, చేడపురుగు చిన్న చెట్టును నశింపజేయును. చెడ్డవాడు గుణవంతుని నాశనము చేయును!
 
147.
వేషభాష లెరిగి కాషయవస్త్రముల్
గట్టగానె ముక్తి గలుగబోదు
తలలు బోడులృన తలపులూ బోడూలా
విశ్వదాభిరామ వినురవేమ!
 
వేషభాషలు నేర్ఛుకుని, కాషాయవస్త్రములు ధరించినంత మాత్రాన మోక్షము రాదు, గుండు గీయించుకున్నమాత్రాన దురాలోచనలు రాకుండావుంటాయా!
 
{{శతకములు}}
"https://te.wikipedia.org/wiki/వేమన_శతకము" నుండి వెలికితీశారు