గూఢచర్యం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ
ట్యాగు: 2017 source edit
(తేడా లేదు)

13:05, 18 జనవరి 2021 నాటి కూర్పు

గూఢచర్యం (ఆంగ్లం: Espionage) అంటే ఏదైనా ఒక రహస్య సమాచారం కలిగిన వారి నుంచి వారికి తెలియకుండా దక్కించుకోవడం, లేదా బయలు పరచడం. ఈ పనిని చేసేవారిని గూఢచారులు, లేదా వేగులు అంటారు. వీళ్ళు రహస్య సమాచారాన్ని సేకరించి తమ సంస్థకు చేరవేస్తారు.[1] ఏ ఒక వ్యక్తి అయినా, లేదా బృందం అయినా ఒక ప్రభుత్వం తరఫున, లేదా ఒక సంస్థ తరఫున, లేదా స్వతంత్రంగా గూఢచర్యం చేయవచ్చు. గూఢచర్య కార్యక్రమాలు సాధారణంగా రహస్యంగా, ఎవరికీ తెలియకుండా జరిగిపోతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఇవి న్యాయ సమ్మతమైనవి, మరికొన్ని సందర్భాల్లో ఇవి చట్టవిరుద్ధమైనవి కూడా. బయటి ప్రపంచానికి తెలియని మూలాలను శోధించి సమాచారాన్ని వెలికితీయడం గూఢచర్యంలో భాగం.

గూఢచర్యం అనేది తరచుగా ప్రభుత్వం లేదా వాణిజ్య సంస్థల సంస్థాగత ప్రయత్నంలో భాగం. ఈ పదాన్ని ఎక్కువగా దేశాలు తమ అనుమానిత లేదా నిజమైన శత్రువుల మీద జరిపే నిఘా కార్యక్రమాలను ఉద్దేశించి వాడుతుంటారు. సంస్థలు నడిపే గూఢచర్యాన్ని పారిశ్రామిక గూఢచర్యం అంటారు.

ఏదైనా సంస్థ నుంచి రహస్యంగా సమాచారం సేకరించాలంటే అందులోకి చొచ్చుకుపోవడం మేలైన పద్ధతి. ఈ పని చేయడం గూఢచారి యొక్క ముఖ్య విధి. తర్వాత వీరు శత్రువుల సంఖ్య, వారి బలాబలాలు లాంటి సమాచారాన్ని సేకరించి పంపుతారు. అంతేకాకుండా సంస్థలో ఉన్న అసమ్మతి వాదుల్ని ఒప్పించి మరింత సమాచారాన్ని రాబడతారు.[2]

మూలాలు

  1. "Espionage". MI5.
  2. Fischbacher-Smith, D., 2015. The enemy has passed through the gate: Insider threats, the dark triad, and the challenges around security. Journal of Organizational Effectiveness: People and Performance, 2(2), pp.134–156.
"https://te.wikipedia.org/w/index.php?title=గూఢచర్యం&oldid=3103193" నుండి వెలికితీశారు